Take a fresh look at your lifestyle.

అసైన్డ్ ‌భూముల కబ్జాపేరుతో బురదజల్లారు

  • తనపై నిష్పక్షపాత విచారణకు ఎప్పుడూ సిద్దమే
  • మీడియా సమావేశాంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌

‌తనను అణచివేయడానికి సిఎం కెసిఆర్‌ ‌తన అంగబలాన్ని అంతా వినయోగించారని, అయినా తాను తాకు చప్పుళ్లకు భయపడే వారిని కాదని ఈటెల రాజేందర్‌ అన్నారు. తనపై పెట్టే కేసులకు భయపడేది లేదన్నారు. తాను భయపడి లొంగిపోయే చిన్నవాడిని కాదన్నారు. కేసులు పెట్టి, జైలుకు పంపినా, ఆస్తులు గుంజుకున్నా సామాన్యుడిగా పోరాడుతానే తప్ప ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్దేది లేదన్నారు. యావత్‌ ‌తెలంగాణ అసహ్యించుకునేలా తనపై దుష్పచ్రారం చేశారని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వేల ఎకరాల భూములు ఆక్రమించానని, కుంభకోణాలు చేసినట్లు ఆరోపించారన్నారు. 19 ఏళ్లపాటు సీఎం కేసీఆర్‌తో కలిసి పని చేశారని ఈటల అన్నారు. పార్టీకి మచ్చ తెచ్చే పని ఎప్పుడూ చేయలేదని స్పష్టం చేశారు. శావి•ర్‌పేట నివాసంలో ఈటల రాజేందర్‌ ‌సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడారు.

నిన్నటి తమ్ముడు ఇయ్యాల దయ్యమెట్ల అయ్యిండని సీఎం కేసీఆర్‌ను ఈటల రాజేందర్‌ ‌ప్రశ్నించారు. గత మూడ్రోజులుగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసైన్డ్ ‌భూములు కొంటే తాను శిక్షకు అర్హుడినని తెలిపారు. సంబంధం లేని భూములను తనకు అంటగడుతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్‌ను ఒక్కటే అడుగు తున్నా.. ఉద్యమంలో 14 ఏళ్లపాటు నీ వెంట నడిచా. నువ్వు మమ్మల్ని గౌరవించడమే గాక నా తమ్ముడని గొప్పగా చెప్పినవ్‌. అలాంటిది ఒక్కసారే మీకు ఈ తమ్ముడు దయ్యమెలా అయ్యాడు? మేం ఏం చేశామని? నేను పార్టీ పెడతానని ఏ ఒక్క నాయకుడితోనూ చెప్పలేదు. పార్టీ మారుతానని కూడా చెప్పలేదు. కానీ అధికారంతో నన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ ‌చేశారు’ అని ఈటల రాజేందర్‌ ‌చెప్పారు. మంత్రిగా కేసీఆర్‌ ‌తనకు అవకాశం ఇచ్చారు. పార్టీకి, ప్రభుత్వానికి, కేసీఆర్‌కు మచ్చతెచ్చే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో అసెంబ్లీలో పోరాడే అవకాశం కల్పించారు. కేసీఆర్‌ ఉద్యమ నాయకుడిగా ఏనాడు అధర్మం వైపు వెళ్లలేదుకేసీఆర్‌ ఉద్యమ నాయకుడిగా ఏనాడూ అణచివేతకు భయపడలేదు. కేసీఆర్‌ ‌తెలంగాణ ప్రజలను, ధర్మాన్ని నమ్ముకున్నారు కాని డబ్బులను నమ్ముకోలేదు.

అలాంటి కేసీఆర్‌ ‌నాలాంటి సాధారణ వ్యక్తిపై తన శక్తినంతా ఉపయోగిస్తున్నారు. నాపై అన్ని శాఖలను ఉపయోగిస్తున్నారు. నర్సాపూర్‌ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని పిలిపించుకొని చర్చోపచర్చలు జరిపారని ఈటల అన్నారు. తెలంగాణ కేబినెట్‌ ‌నుంచి తొలగించడంపై మంత్రి ఈటల స్పదించారు. గత మూడు రోజులుగా పథకం ప్రకారం వేల ఎకరాల భూమి ఈటల కబ్జా పెట్టారని…వేల కోట్ల డబ్బులు సంపాదించాడని ప్రచారం చేశారని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. అసైన్డ్ ‌ల్యాండ్స్ ‌కబ్జాలు చేశాడని… ప్రజలు అసహించుకునేలా ప్రచారం చేశారని ఫైర్‌ అయ్యారు. 2002లో మెదక్‌ ‌జిల్లా పార్టీ రాజకీయాలకు ఆకర్షితుడనై మధుసూదనాచారి ఆధ్వర్యంలో పార్టీలో చేరానాని పేర్కొన్నారు. 19 సంవత్సరాలు టీఆర్‌ఎస్‌లో పని చేశా… 2004లో కమలపూర్‌ ‌లో గెలిచానని తెలిపారు. పార్టీ ఫ్లోర్‌ ‌లీడర్‌ ‌పదవి, మంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేశారు. కేసీఆర్‌ ‌కు పార్టీకి మచ్చ తెచ్చే పని నేను చేయలేదని ఈటల పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుటా ఎగురేశానని గుర్తు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని ఈటల రాజేందర్‌ ‌కోరారు. ఏమాత్రం తప్పున్నా తనను శిక్షించాలన్నారు. ఉద్దేశ పూర్వకంగానే తనపై తప్పుడు రాతలు రాస్తున్నారని తెలిపారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు విచారణ జరిగిందని ఈటల పేర్కొన్నారు. అధికారులు సమర్పించిన నివేదికలో అన్నీ తప్పులేనన్నారు. జమున హ్యాచరీస్‌లో తాను డైరెక్టర్‌ను కానన్నారు. ప్రభుత్వంలో ఒక కమిట్‌మెంట్‌తో పనిచేశానన్నారు. ఎప్పుడూ చిల్లర పనులు చేయలేదని ఈటల పేర్కొన్నారు. సాగర్‌లో కేవలం కేసీఆర్‌ ‌ప్రచారం వల్లే గెలవలేదన్నారు. కార్యకర్తలందరి సమిష్టి కృషి వల్లే పార్టీ గెలిచిందన్నారు.

గులాబీ కండువా వేసుకున్న ప్రతి కార్యకర్తకు.. పార్టీకి ఓనర్‌ అనే ఫీలింగే ఉంటుందని ఈటల పేర్కొన్నారు. కొత్త పార్టీ పెట్టడంపై మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ‌స్పందించారు. గత కొద్ది రోజలుగా ఆయన పార్టీ పెట్టబోతు న్నారంటూ హడావుడి జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన పార్టీపై స్పందించారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచనేమీ లేదన్నారు. నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్‌ ‌కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటా నన్నారు. పార్టీ భీఫామ్‌ ఉం‌టే కాదని.. ప్రజల ఆమోదం ఉంటేనే గెలుపు సాధ్యమన్నారు. తనకు అన్యాయం జరిగిందన్న భావన ప్రజల్లో ఉందన్నారు. సుదీర్ఘకాలంగా సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేశానని ఈటల పేర్కొన్నారు. 2008లో పార్టీ ఆదేశిస్తే రాజీనామా చేశానన్నారు. పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తించానన్నారు. పార్టీకి నష్టం చేకూర్చే పని ఏనాడు చేయలేదని అన్నారు. గత మూడ్రోజులుగా తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వాపోయారు.

Leave a Reply