Take a fresh look at your lifestyle.

అల్విదా … ఇర్ఫాన్

“తన ముప్పయ్యేళ్ళ నట జీవితంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించిన ఇర్ఫాన్ మొదట తన కెరియర్ ను క్రికెటర్ గా ప్రారంభించాడు. సికే నాయుడు అండర్-23 క్రికెట్ టోర్నమెంట్ తో ఫస్ట్ క్లాస్ క్రికెట్ కూడా ఆడాడు. కాని ఆయనలోని ఇంస్టింక్స్ ఆయనను క్రికెటర్‌గా కాకుండా నటన వైపే మళ్ళించాయి. అలా 1984లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ప్రవేశం పొందాడు. ఉత్తమ విదేశిచిత్రం కేటగిరిలో భారతదేశం నుంచి అస్కార్ అవార్డు కోసం పంపబడిన ‘సలాం బాంబే ‘ (1988) తో ఆయన చిత్రరంగ ప్రవేశం చేసాడు. మధ్య కాలంలో చాల కష్టాలను ఎదురైనప్పటికినీ వాటన్నింటినీ అధిగమించి నిలదొక్కుకున్నాడు. చాణక్య, భారత ఏక్ కోజ్, సారా జహాన్ హమారా, చంద్రకాంత ‌వంటి‌ గొప్ప టీవీ సీరియళ్ళలో నటించి తనలోని నటుడికి మెరుగులు దిద్దుకున్నాడు.”

ఆయన జీవితమంతా. సాహసాలమయమే. ఆయన పొషించిన పాత్రలతోనే ఆయనంటే మనకు అవగమవుతుంది ఆయన నటుడే కాదు.. సాహసి కూడా. ఎందరికి తెలుసు ఆయన సాహసం? దేశమంతా గంగవెర్రులెత్తిపోయే క్రికెట్ ను వదిలి నటనను ఎంచుకొవడం ఎందరివళ్ళ అవుతుంది ? ఎవరికీ తెలియని ఒక బందిపోటు బయోపిక్ లో నటించాలంటే ఎంత ధైర్యం కావాలి? బాలీవుడ్ ను బందువుగా మార్చుకున్న “ఖాన్ దాన్ ‘ను వదిలి మామూలు నటుడుగానే తనను తాను రుజువు చేసుకోవడ ఎందరికి సాధ్యం? బాలీవుడ్ లో ఖాన్ ల హావా గురించి తెలియంది‌ కాదు. ఆ పేర్లతోనే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది రూపాయల సినిమా వ్యాపారం ‌జరుగుతోంది. ఈ సమయంలో ఖాన్ అనే పేరు ఉంటే ఖచ్చితంగా అదనపు హంగే అవుతుంది.. కాని అందరి అంచనాలకు భిన్నంగా ‌తనకు పుట్టుకతోనే ఉన్న “ఖాన్” ను‌ విసర్జించిన అభ్యుదయవాది‌ ఇర్ఫాన్…… అందుకే ఆయన సాహసి. చివరకు తన మరణం మీద ప్రకటనలు చేయడం కూడా ఆయనకే చెల్లింది. మరికొన్ని వారాలో లేద నెలలో… అంతకు మించి ఎక్కువగా ఆశించలేం అంటూ తన అంత్య దినాలను గూర్చి నవ్వుతూ వ్యాఖ్యానించడం ఇర్ఫాన్ తో తప్పా మరెవరితోనూ సాధ్యపడదు. 2018 లో ఒక తెలియని క్యాన్సర్ వ్యాధి తనకు సంక్రమించిందని ఆయన ప్రకిటించినప్పుడు ఆయన అభిమానులంతా ఖిన్నులయ్యారు.

‌‌‌‌తన ముప్పయ్యేళ్ళ నట జీవితంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించిన ఇర్ఫాన్ మొదట తన కెరియర్ ను క్రికెటర్ గా ప్రారంభించాడు. సికే నాయుడు అండర్-23 క్రికెట్ టోర్నమెంట్ తో ఫస్ట్ క్లాస్ క్రికెట్ కూడా ఆడాడు. కాని ఆయనలోని ఇంస్టింక్స్ ఆయనను క్రికెటర్‌గా కాకుండా నటన వైపే మళ్ళించాయి. అలా 1984లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ప్రవేశం పొందాడు. ఉత్తమ విదేశిచిత్రం కేటగిరిలో భారతదేశం నుంచి అస్కార్ అవార్డు కోసం పంపబడిన ‘సలాం బాంబే ‘ (1988) తో ఆయన చిత్రరంగ ప్రవేశం చేసాడు. మధ్య కాలంలో చాల కష్టాలను ఎదురైనప్పటికినీ వాటన్నింటినీ అధిగమించి నిలదొక్కుకున్నాడు. చాణక్య, భారత ఏక్ కోజ్, సారా జహాన్ హమారా, చంద్రకాంత ‌వంటి‌ గొప్ప టీవీ సీరియళ్ళలో నటించి తనలోని నటుడికి మెరుగులు దిద్దుకున్నాడు. అలీ సఫ్దార్ జాఫ్రి నిర్మించిన కాహ్ కషన్ సిరియల్ లో ఉర్దూ కవి మఖ్దూం మొయినుద్దీన్ పాత్రను పోషించడం ఆయన ఎప్పుడూ గొప్పగా చెప్పుకునేవాడు. అదేసమయంలో భాసుచటర్జీ నిర్మించిన కమ్లా కి మౌత్, ఏక్ డాక్టర్ కి మౌత్, సచ్ ఏ లాంగ్ జర్ని వంటి చిత్రాలలో ఆయన నటించాడు. అసిఫ్ కపాడియా నిర్మించిన ది వారియర్ చిత్రంతో ఇర్ఫాన్ పేరు ప్రపంచ వ్యాప్తంగా ‌అందరికి పరిచయమైంది. రోడ్ టు లడఖ్ ఇర్ఫాన్ నటజీవితంలో మరో మైలురాయి. అంతర్జాతీయ నటుడుగా నిలదొక్కుకునేందుకు అవకాశం ‌కల్పించిన ఈ చిత్రం ఎన్నో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లలో ప్రదర్శించబడింది. మక్బూల్ చిత్రం ఆయనను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేసింది. షేక్స్పియర్ ప్రసిద్ద నవల ‘మెక్బాత్ ‘ స్పూర్తితో నిర్మించిన ఈ చిత్రం ఇర్ఫాన్ లోని కొత్త నట కోణాన్ని ఆవిష్కరించింది. 2004 లో హాసిల్ చిత్రానికి గాను ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకొన్నపుడు విమర్శకుల ప్రశంసలు సైతం ఆయనకు లభించాయి. 1992 లో ఆయన చేసిన మొదటి వాణిజ్య చిత్రం హృతిక్ రోషన్, కరీనా కపూర్ లతో నటించిన ముజ్సే దోస్తి కరోగే . ఆ తరువాత కసూర్ (2001), మహేష్ భట్ చిత్రం గునా (2002), టిగ్మాన్షు ధులియా యొక్క హాసిల్ (2003) చిత్రాలలో వరసగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు పోషించాడు. విశాల్ భరద్వాజ్ 2003 లో నిర్మించిన మక్బూల్ లో మియాన్ మక్బూల్ పాత్రలో ఇర్ఫాన్ ను తప్పా మరోకరినిఊహించలేము అనడం అంటే చిన్న విషయమే అవుతుంది . తబుతో కలిసి నటించిన ఈ చిత్రం ఇర్ఫాన్ ను పెద్ద నటుడుని చేసింది.

హిందీ చిత్రాలో నటిస్తూనే ఎన్నో హాలివుడ్ చిత్రాలలో కూడా ఆయన తన సత్తా చాటాడు. ఏ మైటీ హార్ట్, ది డార్జిలింగ్ లిమిటెడ్ చిత్రాలు ఆయన పోషించిన పాత్రలు మరవలేం. పాకిస్తాన్ లో హత్య చేయబడిన వాల్ స్ట్రీట్ జర్నలిస్ట్ డానియెల్ పెర్ల్ భార్య మారియాన పెర్ల్ జీవితకథ ఆధారగా మైఖేల్ వింటర్ బాటం దర్శకత్వంలో 2007లో నిర్మించిన చిత్రం ఏ మైటీ హార్ట్. ఏంజెలీనా జోలితో కలిసి నటించిన ఈ చిత్రంలో ఇర్ఫాన్ కరాచి పోలీస్ చీఫ్ పాత్రను పోషించి మెప్పించాడు. అదే సంవత్సరం లైఫ్ ఇన్ మెట్రో, ది నేం సేక్ చిత్రాలతో సైతం ఇర్ఫాన్ మెప్పించాడు. 2008 లో స్లమ్‌డాగ్ మిల్లియనీర్ చిత్రంలో ఆయన నటనకు స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డు పొందడం అంతర్జాతీయంగా ఆయనను గొప్ప నటుడుగా నిలబెట్టింది. హాలివుడ్ తో సహా, మిగతా పాశ్చత్యదేశాలను సైతం భారతదేశం వైపు చూసేలా చేసిన నటుడాయన. 2012లో తిగ్ మన్షూ ధూలియా దర్శకత్వంలో నిర్మించిన పాన్ సింగ్ తోమర్ ఆయనకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు సంపాదించిపెట్టింది. అంతేకాదు ఆంగ్ లీ దర్శకత్వంలో ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన లైఫ్ ఆఫ్ పై చిత్రం ఇర్ఫాన్ కు మంచి పేరు తెచ్చి పెట్టింది. 2013లో ఇర్ఫాన్ నటించిన లంచ్ బాక్స్ ఆయన నటజీవితంలో కలుకుతురాయి. ఈ చిత్రానికి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్రాండ్ రైల్ డి ఆర్డర్ అవార్డుతో పాటు ఉత్తమ చిత్రంగా బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బాఫ్టా) కు నామినేట్ అయ్యింది. ఎందరో జాతీయ, అంతర్జాతీయ నటుల సరసన నటించిన ఇర్ఫాన్ ఆ చిత్రాల విజయాలలో కీలక పాత్ర పోషించాడు. 2015 లో దీపిక పడుకొనే, అమితాబ్ బచ్చన్ లతో కలిసి పికు చిత్రంలో నటించడమే కాకుండా అదే సంవత్సరం హాలివుడ్ చిత్రం జురాసిక్ వరల్డ్ చిత్రంతో సైతం ప్రశంసలు పొందాడు. ఐశ్వర్య రాయ్ సరసన ఆయన నటించిన జజ్బా చిత్రం విమర్శకులను సైతం మెప్పించింది. షారుఖ్ ఖాన్ తో కలిసి నటించిన బిల్లు:బార్బర్ కూడ ఇర్ఫాన్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. టామ్ హాంక్స్ తో కలిసి నటించిన ఇంఫెర్నలో ఇర్ఫాన్ నటన ఎవరు మర్చిపోగలరు?. 2017 లో వచ్చిన హింది‌ మీడియం లో ఆయన నటనకు గాను ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది. ఈ చిత్రం ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంటూ అందరినీ ఆకట్టుకుంటుంది ‌అంటే అతిశయోక్తి కాదు.

2017లో మొస్తఫా ఫారూఖీ సర్వార్ నిర్మించిన బెంగాలీ-ఇంగ్లీష్ చిత్రం ‘నో బెడ్ రోజెస్ ‘ లో ఇర్ఫాన్ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ చిత్రం బంగ్లాదేశ్ నుంచి ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఆస్కార్ అవార్డుకు నామినేయ్ అయ్యింది. 2018 లో వచ్చిన కార్వాన్, బ్లాక్ మెయిల్ చిత్రాలు కూడా ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఇర్ఫాన్ సైనికుడు వంటి తెలుగు చిత్రంలో సైతం నటించాడు. ఆశించిన రీతిలో ఈ చిత్రం విజయవంతం కాకపోవడంతో ఆయన మళ్ళీ తెలుగు చిత్రాల మీదా ఆసకి కనబర్చలేదు. ఈ సంవత్సరం విడుదలైన అంగ్రేజీ మీడియం ఆయన చివరి చిత్రం. దురదృష్టవశాత్తు కరోనా వైరస్ ప్రభావంతో ఆ చిత్రం ఎక్కువమందికి చేరలేదు. జీవితంలో ఎన్నో అవంతరాలను అదిగమించిన ఇర్ఫాన్ క్యాన్సర్ తో పోరాటంలో అలిసిపోయి అల్విదా చెప్పాడు. తన తల్లి మరణించిన నాలుగురోజులకే ఇర్ఫాన్ మరణించడం సినిమా పారిభాషిక పదంలో చెప్పాలంటే విధి ఆడిన వింత నాటకం.
జయప్రకాశ్ అంకం…..

1 Comment
 1. AKKINENI SRIDHAR says

  అంతర్జాతీయ నటుడు ఇర్ఫాన్.
  —————————————-
  ప్రజాతంత్రకి, అంకం జయప్రకాష్ ల
  సమగ్ర సమాచార వార్తా కథనానికి కృతజ్ఞతలు.
  – శ్రీధర్ అక్కినేని.

Leave a Reply