Take a fresh look at your lifestyle.

పారుపల్లి హైస్కూల్‌లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో ఎంతో ప్రఖ్యాతి చెందిన పారిపాల్లి హైస్కూల్‌లో చదివిన 1998-99 టెన్త్ ‌బ్యాచ్‌ ‌విద్యార్థులు  గెటు టు గెదర్‌ ‌నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల పూర్వ హెచ్‌ఎం ‌కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులెందరో ఉతన్న స్థానాలలో ఉన్నారన్నారు. అయితే, 1998-99 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులందరూ సేవా కార్యాక్రమాలు చేయాలన్నారు.

- Advertisement -

వివిధ రంగాలలో స్థిరపడినప్పటికీ ఇన్నేండ్లకు అందరూ ఒక దగ్గర కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ బ్యాచ్‌కు చెందిన  అసోసియేట్‌ ‌ప్రొఫెసర్‌ ‌బల్‌రాం, పంజాబ్‌ ‌నేషనల్‌ ‌బ్యాంక్‌ ‌మేనేజర్‌ ‌శ్రీనివాస్‌, ‌సైంటిస్ట్ ‌సంతోశ్‌, ‌టీచర్స్ ‌నరేశ్‌, ‌సురేశ్‌, ‌స్వరూప, రాజ్‌, ‌ఖాజా, లలిత , భవాని,  శ్రీదేవి, అమర్‌, ‌వంశీ, అంజద్‌, ‌రాజేశ్‌, ‌ప్రమోద్‌తో పాటు ఇతర రంగాలలో స్థిరపడిన వారందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాబుద్దులు నేర్పించిన అప్పటి ఉపాధ్యాయులందరినీ ఆహ్వానించి ఘనంగా సన్మానించి ఆశీర్వాదం తీసుకున్నారు.

Leave a Reply