Take a fresh look at your lifestyle.

వ్యాక్సిన్‌ ఉత్పత్తిపై ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి

వ్యాక్సిన్‌ ‌వచ్చే వరకు జాగ్రత్తలు తప్పనిసరి – ఎపి సిఎం వైఎస్‌ ‌జగన్‌ ‌వెల్లడి
అమరావతి : కరోనా వ్యాక్సిన్‌పై కేంద్రం ప్రత్యా మ్నాయ మార్గాలు ఆలోచించాలని ఎపి సిఎం వైఎస్‌ ‌జగన్‌ అన్నారు. అందరికీ వ్యాక్సిన్‌ అం‌దాలంటే ఇప్పుడున్న పద్దతిలో ఉత్పత్తి చేస్తే సాధ్యం కాదన్నారు. దేశంలో 18 ఏళ్లు పైబడ్డ వారికి 172 కోట్ల టీకా డోసులు కావాలని.. ఇప్పటి వరకు కేందప్రభుత్వం ఇచ్చింది కేవలం 18 కోట్ల టీకా డోసులు మాత్రమేనని తెలిపారు. దేశంలో కేవలం రెండు కంపెనీలే వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్నాయని.. నెలకు 7 కోట్ల డోసులు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యంపై కేంద్రం ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌సూచించారు. ఒకవైపు కోవిడ్‌తో యుద్ధం చేస్తూ, మనందరం సామాన్య జీవితం గడపాల్సిన పరిస్థితి ఉంది.

కోవిడ్‌ను సమూలంగా తీసేయాలి అంటే, వాక్యినేషన్‌ ఒక్కటే అని అందరికీ తెలుసు. కానీ మన దేశంలో వ్యాక్సినేషన్‌ ‌పరిస్థితి ఏమిటన్నది కూడా అందరికీ తెలుసన్నారు. దేశంలో 45 ఏళ్ల పైబడిన వారు దాదాపు 26 కోట్లు ఉంటే, వారికి రెండు డోస్‌ల చొప్పున మొత్తం 52 కోట్ల డోస్‌లు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. అదే విధంగా 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న వారు 60 కోట్లు ఉన్నారు. వారికి 120 కోట్ల డోస్‌లు కావాలి. ఆ విధంగా అందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలంటే మొత్తం 172 కోట్ల డోస్‌లు కావాలి. కానీ ఇప్పటి వరకు కేవలం దాదాపు 18 కోట్లు మాత్రమే వ్యాక్సిన్‌ ఇచ్చారు. అంటే దాదాపు 10 శాతం మాత్రమే ఇవ్వగలిగామని అన్నారు. ’ఇక రాష్ట్రంలో ఫ్రంట్‌లైన్‌ ‌వర్కర్లతో సహా 45 ఏళ్లకు పైబడిన వారు దాదాపు 1.48 కోట్లు ఉన్నారు.

వారందరికీ దాదాపు 3 కోట్ల డోస్‌లు కావాలి. అదే విధంగా 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న వారు మరో 2 కోట్లు. వారికి రెండు డోస్‌ల చొప్పున 4 కోట్లు డోస్‌లు కావాలి. ఆ విధంగా అందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలంటే దాదాపు 7 కోట్ల వ్యాక్సీన్లు కావాల్సి ఉండగా, అక్షరాలా మనకు కేంద్రం సరఫరా చేసింది కేవలం 73 లక్షలు మాత్రమే. అంటే 10 శాతం కూడా మించని పరిస్థితి ఉందని వివరించారు. దేశంలో కేవలం రెండు కంపెనీలు భారత్‌ ‌బయోటెక్‌, ‌సీరం ఇన్‌స్టిట్యూట్‌ ‌మాత్రమే వ్యాక్సీన్లు తయారు చేస్తున్నాయి. భారత్‌ ‌బయోటెక్‌ ‌నెలకు కోటి, సీరమ్‌ ‌సంస్థ 6 కోట్లు.. రెండూ కలిపి నెలకు 7 కోట్ల వ్యాక్సీన్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయని అన్నారు.

కాబట్టి కోవిడ్‌తో సహజీవనం తప్పని పరిస్థితి. ఒకవైపు కోవిడ్‌తో యుద్ధం చేస్తూ, మరోవైపు దాంతో సహజీవనం తప్పదు. మనకున్న పరిస్థితిలో మనం వేస్తున్న అడుగులు అందరూ గమనించాలన్నారు. ఒకవైపు చేయాల్సిన పనులు చేస్తూ పోయి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్‌లు ధరించాలి. చేతులు ఎప్పటికప్పుడు కడుక్కోవాలి. భౌతిక దూరం పాటించాలి. ఇవన్నీ మన జీవితంలో భాగం కావాలి. ఆ విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, రైతులు తమ పని చేసుకుపోవాలని జగన్‌ ‌ప్రజలకు సూచించారు.

Leave a Reply