Take a fresh look at your lifestyle.

స్లమ్స్‌లోని జీవితాలకు అక్షర రూపం (పుస్తక సమీక్ష)

“ఒక విధంగా ఆలోచిస్తే కవిని ఆలూరిది ఒక విప్లవాత్మకమైన ఆలోచనే అని చెప్పాల్సివుంది. ఇందులో 60 ఏళ్ళ నాటి జీవితాల వ్యధలున్నాయి. వాటన్నింటినీ కథల్లాగా అందించిన తీరు బహుదా ప్రశంసనీయం. ఒక్కొక్కరి ‘జీవన చిత్రాలను ఎంతో హృదయవిదారకంగా అందించిందో మాల్లో చెప్పలేము. ఈ పుస్తకాన్ని ముఖ్యంగా సంఘసేవ చేయాలనుకునే వారూ, సంఘ సంస్కర్తలూ, అంతకు మించి ప్రభుత్వంలో వున్న అధికార, అనధికారులూ చదివి తీరాలి మరి.”

masidhu matladithe
మూసీనది మాట్లాడితే…
రచయిత్రి : కవిని ఆలూరి.
వెల : రూ. 150/-
పుస్తకాలు దొరుకు చోటు : అన్ని పుస్తక షాపులు.

‘మూసీ నది మాట్లాడితే….’ అంటూ కవిని ఆలూరి అందించిన, హైదరాబాదు నగరంలోని పేదల జీవన చిత్రాలను కడు రమ్యంగా అక్షరీకరించి, చదివే పాఠకుల గుండెలను పిండి, కన్నీళ్ళ పర్యంతం గావించిన ఒక విభిన్నమైన రచన. 1965 ప్రాంతం నుండి హైదరాబాదు నగరం నింబోలి అడ్డ ప్రాంతంలో నివసించిన నాలాంటి వారికి ఈ మూసీనదీ, ఛాదర్‌ ‌ఘాట్‌ ‌బ్రిడ్జీ, విక్టోరియా ప్లేగ్రౌండ్‌ ‌కళ్ళముందు నిలిచి మనస్సు పిండేసాయంటే అతిశయోక్తి కాదు. ఆరోజులే వేరు అనిపించినా, అప్పటికీ, ఇప్పటికీ మూసీనది నీళ్ళ రంగూ మారలేదు, వాసనా పోలేదు. కొన్ని మాత్రం అప్పటికీ ఇప్పటికి అలానే వున్నాయి. కవినికి ఎందుకు ఆ ఆలోచన కలిగిందో తెలియదు గానీ, ఆమె చేసిన ప్రయత్నం ఒక అద్భుతమే అనిపిస్తుంది. ముక్కులు పగిలిపోయే దుర్ఘంధంతో చీమలూ, దోమలూ, కీటకాలు విచ్చలవిడిగా స్వైర విహారం గావించే నగరంలోని స్లమ్‌ ఏరియాల్లో ఎంతో ధైర్యంగా సంచరించి, వారికి నచ్చే విధంగా ప్రవర్తిస్తూ, వారు మనసువిప్పి మట్లాడే విధంగా చేసి, సేకరించిన వ్యక్తిగత సమాచారం ప్రభుత్వాలకు ఎంతో ఉపయోగకరంగా వుంటాయి. ఎంత సమాచారాన్ని సేకరించిందో? ఒక విధంగా ఆలోచిస్తే కవిని ఆలూరిది ఒక విప్లవాత్మకమైన ఆలోచనే అని చెప్పాల్సివుంది. ఇందులో 60 ఏళ్ళ నాటి జీవితాల వ్యధలున్నాయి. వాటన్నింటినీ కథల్లాగా అందించిన తీరు బహుదా ప్రశంసనీయం. ఒక్కొక్కరి ‘జీవన చిత్రాలను ఎంతో హృదయవిదారకంగా అందించిందో మా•ల్లో చెప్పలేము. ఈ పుస్తకాన్ని ముఖ్యంగా సంఘసేవ చేయాలనుకునే వారూ, సంఘ సంస్కర్తలూ, అంతకు మించి ప్రభుత్వంలో వున్న అధికార, అనధికారులూ చదివి తీరాలి మరి. ప్రభుత్వంలో వున్న కొన్ని విభాగాల వారికి ముఖ్యంగా మునిసిపల్‌ ‌కార్పొరేషన్‌, ‌పోలీసు, రెవెన్యూ, సాంఘిక సంక్షేమం, మహిళా సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల వారికి ఒక విధంగా ఈమె అందించిన, సేకరిచిన సమాచారం ఎంతో విలువైనది. మేధావులూ, రాజకీయ నాయకులూ, సామాజికి వేత్తలూ, మహిళా సంఘాలూ, సమాజ శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరూ, కుల, మత, భాష, ప్రాంత భేదం లేకుండా చదివి తీరాలి. ఈమె అనుభవించిన మానసిక వ్యధ ఆమె రచనల్లో ప్రస్ఫుటంగా కనిపంచింది. హైదరాబాదు నగరంలోని మరో ప్రపంచాన్ని మనకు చూపించి ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఎన్నో ఎన్నెన్నో అంశాలు మనకు గుండె పిండేస్తాయి. మొదటి కథలోనే అట్టడుగు ప్రజానీకంలోని భాగస్వా ములైన ‘మంగళి’ కులానికి చెందిన మంగళి యాదమ్మ కొన్ని వేలమందికి కాన్పులు చేసింది. ఇప్పుడామెకు 90 సంవత్సరాలట. గరీబోళ్ళందరికీ కా న్పులు ఉట్టిగానే చేసేది. అది పుణ్యం గా భావించేదట. పైపె చ్చు పా లు తెచ్చు కుని తాగమ ని పైస లు ఇచ్చి వచ్చేది కూడాను. వర్షాకాలంలో ముసురుపట్టిన రోజుల్లో పేద వారి జీవ నం ఎలా వుంటుందో కనులకు కట్టినట్లుగా ఈ రచనలో చూపించింది. అయితే ఎందరో జీవిత చిత్రాలను గమనించిన తర్వాత, మనకు తెల్సే కొన్ని నిజాలు భయం కరంగా కని పించాయి. స్లమ్‌లలో ని వసించే ప్ర జల్లో ఎ క్కువ శాతం మ ద్యపానానికి అలవాటుపడి, భార్యకు నరకం చూ పిస్తు న్న వారే నని తెలు స్తోంది. పేదరి కం ఆసరాగా తీ సుకుని పడు పు వృత్తిని జీవన వి ధానంగా స్వీ కరించిన అ భాగ్యులైన మ హిళల కథలూ కనిపిస్తాయి. భా గ్యనగరంలో జీవించే ఎందరో అభాగ్య జీవుల కథనాలు మనలను ఎంతో ఆసక్తిగా చదివిస్తాయి. వృత్తి కళాకారులూ, యాచకవృత్తి దారులూ, బుడగ జంగాలు, వీరముష్టివారూ, పూ సలవాళ్ళూ, ఎరులవారూ, దళితులూ, ఆదివాసీలూ, శాలియా దాసరి వారూ, బైండ్ల, ఎరుకల, వీరభద్రయ, ఎస్‌.‌సి, ఎస్‌.‌టి, బంజారా, ఆర్యకటిక, మాదిగ, మాల, మోచీ, దర్జీ, కంచర, వడ్రంగి, డోరోళ్ళు, డోలక్‌ ‌బేచనేవాలాలూ, ఇలా ఎందరో వృతిదారులూ, అట్టడుగు వర్గాలవారి జీవన కథలను మనకు వినిపించింది. ముస్లిం మతస్థుల్లోని తెగలనూ, వారి ఆచార వ్యవహారాల్లోని కొన్ని మహిళా వెతలనూ ఎంతో దయనీయంగా సేకరించి అందించిన కవిని ఆలూరి ధన్యురాలు. సింగరేణి కాలనీవాసుల వెతలను, వాళ్ళ నిత్య జీవన పోరాటాన్నీ రచయిత్రి వివరించారు. ఛీప్‌ ‌లిక్కరు, గంజాయి. గుట్కా మొదలైన మత్తు పదార్ధాలకు బానిసలైన వారే ఎక్కువగా కనిపించారని చెబుతుందీ రచయిత్రి. వారు ఇలాంటి అలవాట్ల కారణంగా తొంబై శాతం మంది నలభై సంవత్సరాలకే మూత్రపిండాల వ్యాధులు, క్యాన్సరు వాత పడుతున్నారనీ, గుండెపోటుతో చనిపోతున్నవారూ ఎక్కువగా వున్నారట. ఈ పుస్తకం చదువుతూ వుంటే ఎన్నో ఆచారవ్యవహారాలూ, నమ్మకాలూ మనకు తెలుస్తాయి. ఇస్లాం మత ఆచార వ్యవహారాలను కూడా నగరంలోని పలు పాత బస్తీ ప్రాంతాల్లో తిరిగి సంపాదించి మనకు అందించారీ రచయిత్రి. గంటా సాయిబ్బుల విశేషాల నుండి, ఫకీర్లు, జుమానీ, తలాక్‌ ‌వంటివి ఈ పుస్తకంలో వివరించబడ్డాయి. మాట పట్టింపులకు పోయి విడిపోయిన ముస్లిం కుటుంబ గాథలు ఇందులో వున్నాయి. ముస్లిం మహిళలు ఎందరో ఏవిధంగా కష్టపడి తమ బిడ్డలను బ్రతికించుకుంటూ గౌరవంగా బ్రతికుతున్నారో ఈ 196 పేజీల పుస్తకంలో చదివి ఎంతో గర్విస్తాము. స్వయంగా ఎంతో కష్టపడుతూ, గౌరవంగా, ఆత్మాభిమానంతో బ్రతుకుతున్న అభాగ్యుల జీవన కథలు కవిని ఆలూరి అందించింది. హైదరాబాదు పాతబస్తీ వాసుల సమస్యలతో బాటుగా, విద్య, వైద్యం, ఉపాధి, ఆచారవ్యవహారాలు ఈ పుస్తకం ద్వారా తెలుస్తాయి. ఈనాటి హైదరాబాదు మాత్రమే గాక 30/40 సంవత్సరాల క్రిందటి హైదరాబాదు కూడా మనకు కనిపిస్తుందీ అరుదైన పుస్తకంలో. కవిని ఆలూరిని అభినందించకుండా వుండలేము మనం, ఈ గొప్పవిశేషాత్మకమై ప్రయోగానికిగాను.

krishan murthy
డా।। పులివర్తి కృష్ణమూర్తి

Leave a Reply