Take a fresh look at your lifestyle.

అక్షర సంపన్నుడు.. అరవింద్‌కుమార్‌

తెలంగాణ నూతన పారిశ్రామిక విధానాలను కొత్త పుంతలు తొక్కిస్తూ.. ప్రభుత్వ విధి విధానాలను ముందుకు తీసుకెళ్తున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, పురపాలన, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి, సమాచార శాఖ కమిషనర్‌ అరవింద్‌కుమార్‌ అక్షర సంపన్నుడు. ఏదో ఒక అంశంపై పట్టు సాధించిన వారు ఎందరో ఉంటారు. అన్నింట్లో పరిపూర్ణతను కలిగిన వారు అరుదుగా కనిపిస్తారు. ఈ అలుపెరుగని బాటసారి నేటికీ నిత్యవిద్యార్థే! రెండున్నర దశాబ్దాల ఉద్యోగ ప్రస్థానంలో అనుకున్న లక్ష్యాలను సాధించిన కార్యదక్షుడు అరవింద్‌ ‌కుమార్‌. ‌విజయాల మజిలీలు ఆయనకే సొంతం. ప్రజలతో ఆయనది నిత్యానుబంధం. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిపై నిత్యపోరు సల్పుతున్నారు. నిద్రాహారాలు మాని, వైరస్‌ ‌నియంత్రణకు నిరంతరాయంగా పనిచేస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా అరవింద కుమార్‌ ‌కష్టపడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధికారులకు అండగా ఉంటున్నారు. ఆయన అనుసరించిన కట్టుదిట్టమైన నియంత్రణ విధానాలవల్ల ప్రస్తుతం కరోనా వైరస్‌ అదుపులోకి వస్తుంది.

న్యూ ఢిల్లీలో 1966 అక్టోబర్‌ 26‌న సుశీల-అశోక్‌కుమార్‌ ‌దంపతులకు అరవింద్‌కుమార్‌ ‌జన్మించారు. 1992 నవంబర్‌ 21‌న తన బ్యాచ్‌మెట్‌ అయిన ఐఏఎస్‌ అధికారిని సుమితాడావ్రాను ఆదర్శ వివాహం చేసుకున్నారు. ఆమె ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వంలో ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఆయన కుమార్తె మాన్సీకుమార్‌ అమెరికాలో అర్థశాస్త్రం చదువుతోంది. అరవింద్‌ ‌కుమార్‌ ‌తన ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యలను ఢిల్లీలో పూర్తి చేశారు. అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ ‌యూనివర్సిటీలో పబ్లిక్‌పాలసీలో మాస్టర్స్ ‌డిగ్రీ సాధించారు. లండన్‌ ‌స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్ అం‌డ్‌ ‌పొలిటికల్‌ ‌సైన్స్‌లో ‘పీజీ’ పూర్తి చేశారు. అహ్మదాబాద్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ చదివారు. కొంతకాలం ‘మారుతి’ సంస్థలో విదేశీ ఎగుమతుల విభాగంలో ఉన్నతోద్యోగిగా పని చేశారు. అనంతరం సివిల్స్‌పై ఉన్న మక్కువతో 1990 సంవత్సరంలో యూపీఎస్సీ పరీక్షలు రాసి, రెండంకెల ర్యాంకుతో 1991లో ఐఏఎస్‌ ‌సాధించారు. 1991సెప్టెంబర్‌ 15‌న ట్రెనీ సబ్‌-‌కలెక్టర్‌గా అరవింద్‌కుమార్‌ ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి 1993సెప్టెంబర్‌ ‌వరకు నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌లో వృత్తి పరమైన శిక్షణ తీసుకున్నారు. ప్రజాసంబంధాలు, విధానాలు, సమీక్షలతో పాటు, పరిపాలనకు సంబంధించిన విషయాలపై ఆయన శిక్షణ పొందారు. 1993సెప్టెంబర్‌ ‌చివరి మాసం నుంచి 1995 వరకు గోదావరి జిల్లాల్లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా పనిచేసి గిరిజనుల జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకు రవాణా సౌకర్యం, గిరిజనులకు వైద్య, ఆరోగ్య, రక్షిత మంచినీటి పథకాలతో పాటు, ప్రాథమిక విద్య సౌకర్యాలను కల్పించారు.

1995జూన్‌ ‌నుంచి 1996జూలై వరకు తూర్పుగోదావరి జిల్లా జాయింట్‌ ‌కలెక్టర్‌గా పనిచేసి ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టపరిచారు. దాదాపు 38లక్షల మందికి ఆహార ధాన్యాలను పంపిణీ చేశారు. ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం భూసేకరణ జరిపి తక్కువ ఖర్చుతో గృహనిర్మాణాలను చేపట్టారు. గోదావరినది ఉప్పొంగి వరదలు వచ్చిన సమయంలో సహాయక చర్యలు చేపట్టారు. గ్రామీణ రోడ్ల నిర్వహణ, విద్యుత్‌ ‌శక్త్తి, నీటిపారుదల సౌకర్యాలు, పారిశుధ్య నిర్వహణ, దారిద్య్ర నిర్మూలన కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. 1996 జూలై నుంచి 2000 జూన్‌ ‌వరకు విజయవాడ, వరంగల్‌ ‌జిల్లాలో మున్సిపల్‌ ‌కమిషనర్‌గా పని చేసి నగర పాలక సంస్థల బలోపేతానికి కృషి చేశారు. భద్రకాళి చెరువు చుట్టూ షోర్‌ ‌బండ్‌ ‌నిర్మించారు. అనేక మంచినీటి పథకాలు వీరి హయాంలోనే నిర్మితమైనాయి. నగర పాలక సంస్థల వార్షిక ప్రణాళికలు, బడ్జెట్‌ ‌రూపకల్పనతోపాటు, నీటి సరఫరా నిర్వహణ పనులను ఆయన పటిష్ఠ పరిచారు. నూతన రహదారులు, పచ్చదనం..పరిశుభ్రత, ప్రణాళిక బద్ధంగా నగరాలను అభివృద్ధి చేయడంలో అరవింద్‌కుమార్‌ ‌విశేష కృషి చేశారు.

జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే, నగరంలో మౌలిక సదుపాయాల కల్పన, ఆస్తి పన్నును సక్రమంగా వసూలు చేయడంలో కృతకృత్యులయ్యారు. కాజీపేట, హన్మకొండ, వరంగల్‌ ‌ప్రాంతాల్లో ప్రధాన రహదారుల విస్తరణలో కీలక భూమిక పోషించారు. పాలక వర్గం నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్లడంతో ఆయన సమర్థుడైన కమిషనర్‌గా పేరు గడించారు. 2000 జూలై నుంచి 2002జూలై వరకు రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ జాయింట్‌ ‌కమిషనర్‌గా పని చేసిన ఆయన ఆ శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అమ్మకం పన్ను వసూళ్లను, వినోదపుపన్ను, వృత్తి పన్నులను అంచనావేసి అందుకు తగినట్లుగా చర్యలు తీసుకున్నారు. ఆయన వాణిజ్యశాఖలో పని చేసిన సందర్భంలో విలువ ఆధారితపన్ను (వాల్యువేషన్‌ ఆడెడ్‌ ‌టాక్స్-‌జుఊ)ను ప్రవేశపెట్టి ఐటీ,ఆర్కిటెక్చర్‌ ‌విభాగాలను కూడా వాణిజ్యపన్నుల విభాగంలోకి తీసుకొచ్చారు.

2002 జూలై నుంచి 2006జూన్‌ ‌వరకు హైదరాబాద్‌, ‌ఖమ్మం జిల్లాల కలెక్టర్‌గా పనిచేసిన అరవింద్‌కుమార్‌ ఆ ‌జిల్లాల ప్రగతికి బాటలు వేశారు. జిల్లా పరిపాలనాధికారిగా సామాజిక భద్రత, దళిత, గిరిజన గ్రామాల్లో పారిశుధ్యం, ఉద్యోగాలు, పౌరసేవల కల్పన, విద్య, వైద్య, నీటి సరఫరా కార్యక్రమాలతో పాటు, గ్రామీణ అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషించారు. ప్రభుత్వ అభివృద్ధి పథకాలను అమలు పరుస్తూనే. పలు సంక్షేమ కార్యక్రమాల ద్వారా దారిద్య్రాన్ని నిర్మూలించారు. 2003లో జరిగిన గోదావరి పుష్కరాలను, 2004లో జరిగిన సాధారణ ఎన్నికలను అరవింద్‌కుమార్‌ ‌సమర్థవంతంగా నిర్వహించారు. ఆ తర్వాత 2006జూలై నుంచి 2007జూన్‌ ‌వరకు సెలవుపై అమెరికా వెళ్లి ప్రిన్స్‌టన్‌ ‌యూనివర్సిటీలో మాస్టర్స్ ఇన్‌ ‌పబ్లిక్‌ ‌పాలసీ (ఎంపీపీ)లో ‘పీజీ’ చేశారు. ఆ కోర్సులో జనాభా గణనలో ఉన్న ఇబ్బందులు, స్త్రీ, పురుష నిష్పత్తిలో ఉన్న వ్యత్యాసాలు, ప్రాణాంతక వ్యాధులు, ప్రజావైద్యం, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాటి తీరు తెన్నులను ఆయన ఆధ్యయనం చేశారు. అనంతరం 2007 సెప్టెంబర్‌ ‌నెలలో మత్స్యశాఖ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టి, 2009 మే వరకు చేపల ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచారు. శాస్త్రీయ ఆచరణ, నూతన పద్ధతుల ద్వారా చేపల పెంపకాన్ని ప్రోత్సహించారు. మత్స్యకార్మికులు, వారి కుటుంబాల స్థితిగతుల మెరుగుదలకు ఆయన కృషి చేశారు. అనంతరం అరవింద్‌కుమార్‌ ఐదేళ్లపాటు కేంద్ర సర్వీసులకు వెళ్లారు. 2009 మే నెల నుంచి 2011వరకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ డైరెక్టర్‌గా పనిచేసి ఆ శాఖలో అనేక మార్పులు తీసుకొచ్చారు. రైతులకు మద్దతు ధర చెల్లించి ఆహార ధాన్యాలను సేకరించడమే గాక, వాటిని సబ్సిడీపై పేదలకు అందించారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన రైతులకు, కూలీలకు అండగా నిలిచారు.

ముఖ్యంగా మిగులు రాష్ట్రాల నుంచి ఆహార ధాన్యాలను సేకరించి, లోటు కలిగిన రాష్ట్రాలకు పంపిణీ చేశారు. 24కోట్ల భారతీయులకు సబ్సిడీ ధరలపై ఆహార ధాన్యాలను అందజేయడంతో పాటు, వార్షిక బడ్జెట్‌ను రూపొందించారు. పేద ప్రజలకు ఆహార భద్రత హక్కు కల్పించే ‘నేషనల్‌ ‌ఫుడ్‌ ‌సెక్యూరిటీ బిల్‌’ ‌రూపకల్పనలో డ్రాప్టింగ్‌ ‌కమిటీ సభ్యుడిగా అరవింద్‌కుమార్‌ ‌కీలకపాత్ర పోషించారు. 2011మే నెల నుంచి 2014జూలై మాసం వరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖలో జాయింట్‌ ‌సెక్రెటరీగా పని చేసిన అరవింద్‌కుమార్‌ ‌పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవస్తాపన సౌకర్యాలు, ఆర్థిక సంస్థల అధిపతిగా సూక్ష్మవిత్తం, సూక్ష్మక్రెడిట్‌, ‌గ్రామీణ రుణప్రణాళిక, బీమా పెన్షన్‌ ‌తదితర సంస్కరణలను ఆయన ప్రవేశపెట్టారు. పలు ఆర్థిక సంస్థలతో దగ్గరి సంబంధాలను కలిగిన ఆయన ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సంధానకర్తగా వ్యవహరించారు. నాబార్డు డైరెక్టర్‌తో సహా మరో ఎనిమిది ఆర్థిక సంస్థల్లో డైరెక్టర్‌గా పని చేసిన ఆయన ఆ పోస్టులకే వన్నె తెచ్చారు. భారత ప్రభుత్వం ద్వారా ద్వైపాక్షిక బహుళ సంప్రదింపులతో బీమా, ఆర్థిక సంస్థల విషయాలపై ప్రభుత్వ నియామక అధికారిగా చర్చలు జరిపారు.

ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్ర విభజన సమయంలో సహాయ, పునరావాస స్పెషల్‌ ‌కమిషనర్‌గా పని చేసిన సమయంలో విశాఖ పట్టణంలో ‘హుద్‌హుద్‌’ ‌తుపాన్‌ ‌సహాయక కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టారు. తుపాన్‌ ‌బాధితులకు అండగా నిలిచి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముఖ్యంగా వారికి ఆహారం, మంచినీటి సౌకర్యాలు కల్పించడంతో పాటు, 20ప్రభుత్వశాఖలను సమన్వయపరచి సహాయ, పునరావాస చర్యలను తీసుకొన్నారు. తుపాన్‌ ‌సందర్భంలో రికార్డు ట్నెంలో సహాయక చర్యలను చేపట్టి విశాఖపట్టణంలో సాధారణ పరిస్థితులను నెలకొల్పడంలో అరవింద్‌కుమార్‌ ‌చేసిన కృషి అజరామమైనది. భవిష్యత్‌లో విపత్తు నివారణ చర్యలు, ఏ విధంగా తీసుకోవాలనే విషయాలపై ఆయన సమగ్ర నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు. తర్వాత హైదరాబాద్‌ ‌మహానగర పాలక సంస్థ, హెచ్‌ఎం‌డీఏ కమిషనర్‌గా విశిష్ట సేవలు అందించారు. మహానగరానికి తాగునీటిని సక్రమంగా అందించడంలో ఆయన కృషి ఎంతో ఉన్నది. రాష్ట్రంలో పట్టణాభివృద్ధి, సుందరీకరణ, మౌలిక సదుపాయాల కోసం రూ.100కోట్లను అదనంగా మంజూరు చేయించిన ఘనత అరవింద్‌కుమార్‌కే దక్కింది.

2015జనవరి 5న పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడి స్థాపనలో సౌకర్యాల కల్పన, మైనింగ్‌, ‌విద్యుత్‌ ‌శాఖల ప్రిన్సిపల్‌ ‌కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఆయన 2017 జనవరి 7వరకు సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. పరిశ్రమలను, పెట్టుబడులను ప్రోత్సహించడంతో పాటు, 2015 జనవరి నుంచి రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. తెలంగాణలో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు 1,45,000ఎకరాల స్థలాన్ని కేటాయించారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమిని పరిశ్రమల అవసరానికి వాడుకునే నిమిత్తం నూతన పారిశ్రామిక విధానం (ఊఐ ? ఆజుఐఐ జుఊ – 2015) లో ఆయన భాగస్వామి అయ్యారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు.. టీఎస్‌ ఐపాస్‌ ‌చట్టం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని ఏకగవాక్ష విధానం ద్వారా అనుమతులను పక్షం రోజుల్లోనే పొందే సౌకర్యాన్ని ఆయన కల్పించారు. సౌరవిద్యుత్‌ ‌ప్రాజెక్టులకు అనుమతుల విధానాన్ని మరింత సులభతరం చేశారు. 2015 సోలార్‌ ‌పాలసీ, 2016లో మైనింగ్‌ ‌పాలసీని తయారుచేయడంతో పాటు 2,500 మెగావాట్ల విద్యుత్‌శక్తి బిడ్డింగ్‌ ‌ద్వారా సాధించి ‘అరవింద్‌కుమార్‌’ ‌దేశంలోనే మంచి పేరు సంపాదించుకున్నారు. 2017 జనవరి 10వ తేదీ నుంచి 2018 జనవరి 8 వరకు న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ ‌ప్రిన్సిపల్‌ ‌రెసిడెంట్‌ ‌కమిషనర్‌గా పనిచేసిన అరవింద్‌ ‌కుమార్‌ ‌పీవోఎస్‌ ‌ద్వారా ఈ లావాదేవీలను నిర్వహించారు. 2018 జనవరి 9 నుంచి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఏ శాఖలో పనిచేసిన ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రజలతోపాటు, ప్రజాప్రతినిధుల మన్ననలు పొందుతున్నారు. రెండున్నర దశాబ్దాల ప్రభుత్వ సర్వీసులో పలుశాఖల్లో.. వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన ‘ఆదర్శ అధికారి’గా అరవింద్‌కుమార్‌ ‌పేరు గడించారు. ప్రస్తుతం మానవాళిని హరించి వేస్తున్న మహమ్మారి కొవిడ్‌-19 ‌కట్టడి కోసం అరవింద్‌ ‌కుమార్‌ అవిరళ కృషి చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!