Take a fresh look at your lifestyle.

హైదరాబాద్‌ ‌రోడ్ల విస్తరణకు నిధులు కేటాయించండి

500 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదనలు
కేంద్రమంత్రి గడ్కరీకి మంత్రి కెటిఆర్‌ ‌లేఖ

‌రోడ్ల అభివృద్దికి నిధులు విడుదల చేయాలని మంత్రి కెటిఆర్‌ ‌కేంద్రాన్ని కోరారు. ప్రదానంగా విజయవాడ రహదారికి నిధులు కేటాయించాలన్నారు. ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ ‌గడ్కరీకి మంత్రి కేటీఆర్‌ ‌గురువారం లేఖ రాశారు. హైదరాబాద్‌ – ‌విజయవాడ జాతీయ రహదారిపై అభివృద్ధి కార్యక్రమాలకు రూ. 500 కోట్లు కేటాయించాలని కేంద్రమంత్రిని కేటీఆర్‌ ‌కోరారు. నగర పరిధిలో హైదరాబాద్‌ – ‌విజయవాడ హైవే సుమారు 25 కిలోవి•టర్ల మేర విస్తరించి ఉంది.

హైదరాబాద్‌లో అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఉన్న ఈ హైవేకు ప్రత్యేకంగా లెవల్‌ ‌జంక్షన్లు, సర్వీస్‌ ‌రోడ్డు వంటి సౌకర్యాలతో పాటు లేన్‌ ‌కెపాసిటీని మరింతగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం రాష్ట్ర పబ్లిక్‌ ‌వర్కస్ ‌డిపార్ట్‌మెంట్‌ ‌రూ. 500 కోట్లతో డీపీఆర్‌ ‌సిద్ధం చేసింది. హైదరాబాద్‌ ‌నగరంలో పెరుగుతున్న విస్తరణకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన కోసం ప్రాజెక్టులు చేపట్టిందని కేటీఆర్‌ ‌తన లేఖలో తెలిపారు. దీంతో నిధులు కేటాయిస్తే ఈ పనులు పూర్తి చేసుకోగలమని అన్నారు.

Leave a Reply