Take a fresh look at your lifestyle.

జర్నలిస్టులకు అండగా మిడియా అకాడమి

ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌తెలంగాణలో ఇప్పటి వరకూ కొరోనా వైరస్‌ ‌బారిన పడిన 337 మంది జర్నలిస్టులకు 59.30 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించినట్టు తెలంగాణ మిడియా అకాడ ఛైర్మన్‌ అల్లం నారాయణ తెలిపారు. వీరిలో పాజిటివ్‌వచ్చిన 256 మంది జర్నలిస్టులకు 20వేల చొప్పున 51.20 లక్షల రూపాయలు, •మ్‌క్వారంటైన్‌లో ఉన్న 81 మంది జర్నలిస్టులకు 10వేల చొప్పున 8.10లక్షల రూపాయలు సాయంగా అందించామని తెలిపారు. సోమవారం నాటికి వివిధ జిల్లాలకు చెందిన జర్నలిస్టులకు కొరోనా వైద్య పరీక్షల నిర్వహించగా తాజాగా 72 మందికి పాజిటివ్‌వచ్చిందని, మరో నలుగురు జర్నలిస్టులు •ం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా వైద్యాధికారులు సూచించినట్టు తెలిపారు.

ఇలా 761మంది జర్నలిస్టులకు 14లక్షల 80వేల రూపాయల ఆర్థిక సాయం జర్నలిస్టుల అకౌంట్‌లలో జమచేసినట్టు తెలిపారు. జర్నలిస్టు మిత్రులు తమ వివరాలు  తెలంగాణ డియా అకాడ ఛైర్మన్‌ ‌వాట్సప్‌ ‌నెంబర్‌ 8096677444 ‌పంపాలని అన్నారు. అలాగే మరిన్ని వివరాలకు డియా అకాడ మేనేజర్‌ ‌లక్ష్మణ్‌కుమార్‌ ‌సెల్‌ ‌నెం. 9676647807 కు సంప్రదించ వచ్చని అన్నారు. కొరోనా బారిన పడిన పాజిటివ్‌, ‌క్వారంటైన్‌ ‌జర్నలిస్టులు ప్రభుత్వ డాక్టర్లు ధృవీకరించిన మెడికల్‌ ‌రిపోర్టులు డియా అకాడ కార్యాలయానికి పంపించాలని ఆయన సూచించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply