Take a fresh look at your lifestyle.

అల్లం నారాయణ హామీ…! కాలేయ మార్పిడికి సహకారం

నిజామాబాద్ జర్నలిస్టు వకీల్ ప్రేమ్ కుమార్ కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స కు ప్రభుత్వము నుంచి అన్నిరకాల సహకారం అందేలా చూస్తానని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హామీ ఇచ్చారు.. హైదరాబాద్ లకడికపూల్ గ్లోబల్ ఆసుపత్రిలో సోమవారం సాయంత్రం రాత్రి tuwj ప్రధానకార్యదర్శి మారుతిసాగర్, ఉపాధ్యక్షుడు జమాల్పూర్ గణేష్, హైదరాబాద్ జిల్లా ప్రధానకార్యదర్శి యారనవీన్ కుమార్లతో కలిసి అల్లం నారాయణ ప్రేమ్ కుమార్ ను పరామర్శించారు.. కాలేయ మార్పిడికి 30 లక్షలు ఖర్చు అవుతోందని ప్రేమ్ తండ్రి అల్లం నారాయణ దృష్టికి తీసుకువచ్చారు.

ప్రభుత్వం తరపున అవసరమైన నిధులను సమకూర్చడానికి అన్నివిధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.. రెండు రోజుల్లో వైద్య పరీక్షలు పూర్తి అయిన తరువాత మరోసారి కలుస్తామని అల్లం నారాయణ అన్నారు.. ప్రేమ్ పూర్తి స్థాయిలో కూలుకునేదాక tuwj అండగా ఉంటుందని మారుతి సాగర్ అన్నారు.. శస్త్ర చికిత్స కు కావాల్సిన సహకారం కోసం ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతామని అన్నారు.. ప్రేమకుమార్ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు అల్లం నారాయణ.

Leave a Reply