Take a fresh look at your lifestyle.

గడువులోగా పనులన్నీ పూర్తి చెయ్యాలి

All work must be completed within the deadline rathod

  • భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగొద్దు
  • అన్ని శాఖలు సమన్వయంతో పనిచెయ్యాలి
  • పనులపై అలసత్వం వహిస్తే కఠిన చర్యలు
  • రాష్ట్ర గిరిజన,స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి రాధోడ్‌

ములుగు: ఫిబ్రవరి 5 నుండి 8 వరకు జరిగే శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఆసౌకర్యాలు కలుగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, భక్తుల సౌకర్యార్ధం చేపడుతున్న అభివృద్ది పనులు సకాలంలో పూర్తి చేయ్యాలని, పనులపై అలసత్వం వహించుతే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర గిరిజన,స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాధోడ్‌ అన్నారు. శుక్రవారం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డిలతో కలిసి మేడారంలో పర్యటించారు. మంత్రులకు ముందు గా ఆలయ పూజారులు గిరిజన సాంప్రదాయాల ప్రకారం స్వాగతం పలికారు. అమ్మవార్లకు మొక్కులు అప్పగించుకున్నారు. అనంతరం జాతర పురోగతి పనులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. జంపన్న వాగులో ఏర్పాటు చేసిన బాతింగ్‌ ‌ఘాట్స్‌ను ప్రారంభించారు. అనంతరం హరిత హోటల్‌లో వివిధ శాఖలచే చేపడుతున్న పనుల పురుగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సదర్బంగా సత్యవతి రాధోడ్‌ ‌మాట్లాడుతూ జాతరలో ప్రమాద స్థలాలను గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలని,ప్రమాద బోర్డులను ఏర్పాటు చేయ్యాలని,అర్‌డబ్ల్యూఎస్‌ ‌పనులు త్వరితగతిన చేపట్టి జనవరి 15 లోగా పూర్తిచేయ్యాలన్నారు.

తెలంగాణ గిరిజన కుంభమేళ తరహలో జరిగే జాతరకు గిరిజనేతరులందరిని రాష్ట్రపతి,ఉప రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, నాయకులకు అహ్వనిస్తున్నామన్నారు. పంచాయితీ రాజ్‌ ‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ హైదరాబాద్‌,‌వరంగల్‌ ‌హైవే పనులు నత్తనడకన సాగుతున్నాయని,వేగం పెంచి జాతర వరకు పూర్తి చేయ్యాలన్నారు. జాతరలో అధికారులకు, మీడియా వారికి దర్శనం విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.  దేవాదయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ మేడారం జాతర ప్రపంచ ప్రసిద్ది చెందిన జాతరని,కోటి మంది భక్తులకు పైగా జాతరకు రానున్నట్లు  ఆయన అన్నారు. భక్తులకు ఎలాంటి ఆసౌకర్యాలు కలుగకుండా నిధులను కేటాయించి వసతులు కల్పిస్తున్నా మన్నారు. ఇంచార్జీ కలెక్టర్‌ ‌వాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అన్ని సివిల్‌ ‌పనులను ఈనెలాఖరులోగా పూర్తి చెయ్యాలన్నారు. అనంతరం భక్తుల సౌకర్యార్ధం దిక్సూచిగా ఉండే మేడారం అఫీషియల్‌ ‌యాప్‌ను మంత్రులు అవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో వరంగల్‌ ఎం‌పి పసునూరి దయాకర్‌రావు, మహబూబ్‌బాద్‌ ఎం‌పి మాలోత్‌ ‌కవిత, వరంగల్‌ ‌మేయర్‌ ‌గుండా ప్రకాశ్‌రావు,ఎమ్మేల్సీలు కడియం శ్రీహరి,పోచారం శ్రీనివాసరెడ్డి, ఏమ్మేల్యేలు దనసరి సీతక్క, గండ్ర వెంకటరమణారెడ్డి,పెద్ది సుదర్శన్‌రెడ్డి,చల్లా దర్మారెడ్డి,తాటికోండ రాజయ్య, జడ్పీ చైర్మెన్‌లు కుసుమ జగదీశ్వర్‌,‌గండ్ర జ్యోతి,జక్కు శ్రీహర్షిని,హిమ బిందు,గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి మహేశ్‌ ‌దత్‌ ఎక్కా,టూరిజం ఎండి క్రిస్టినా,దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌ ‌కుమార్‌,‌వరంగల్‌ ‌రేంజ్‌ ఐజి నాగిరెడ్డి,జిల్లా ఎస్సీ డాక్టర్‌ ‌సంగ్రామ్‌ ‌సింగ్‌ ‌గణపతిరావు పాటిల్‌,‌వరంగల్‌ ‌సర్కిల్‌ ‌సీసీఎఫ్‌ ఏం‌జే అక్బర్‌, ‌దేవాదుల సిఇ బంగారయ్య, గిరిజన సంక్షేమ శాఖ సిఇ శంకర్‌రావు,అర్టీసి ఆర్‌ఎం శ్రీ‌ధర్‌,‌జిల్లా రైతు సమన్వయ సమితి కో అర్డినేటర్‌ ‌పల్ల బుచ్చయ్య, జడ్పీ వైస్‌ ‌చైర్మెన్‌ ‌బడే నాగజ్యోతి,ఐటిడిఏ పివో చక్రధర్‌రావు,ములుగు ఏఎస్పీ సాయి చైతన్య, ఏటూరునాగారం ఏఎస్పీ శరత్‌ ‌చంద్ర పవార్‌,‌జడ్పీ సీఈవో పారిజాతం,వివిధ శాఖల అధికారులు,ప్రజాప్రతినిధులు పాల్గోన్నారు.

Tags: devotees, Sri Sammakka, Sarallamma, horoscope, Radhod, Minister, State for Tribal, Women and Child Welfare

Leave a Reply