Take a fresh look at your lifestyle.

15 ‌నుంచి 18 ఏళ్లలోపు వారందరికీ టీకా వేయించాలి

  • అందరూ రెండో డోస్‌ ‌కూడా వేయించాలి
  • చెత్త రహిత పట్టణంగా స్వచ్ఛ సిద్ధిపేట
  • మున్సిపల్‌ ‌కౌన్సిలర్లు వార్డుల్లో ప్రజలతో భాగస్వామ్యం కావాలి
  • గ్రామ, గ్రామాన రైతుబంధు పండుగ కార్యక్రమాలు జరపాలి
  • సిద్ధిపేట నియోజకవర్గ స్థాయి నాయకులతో మంత్రి హరీష్‌ ‌రావు టెలీ కాన్ఫరెన్స్

‌సిద్ధిపేట, జనవరి 3(ప్రజాతంత్ర బ్యూరో) : కొరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతీ ఒక్కరూ మాస్కులు విధిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, ఎల్లప్పుడూ చేతులను సబ్బుతో కడుక్కోవాలని ఎప్పటికప్పుడు ప్రజలలో అవగాహన కల్పించి చైతన్య పర్చాలని నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు మార్గనిర్దేశం చేశారు. సోమవారం హైదరాబాదు నుంచి సిద్ధిపేట నియోజకవర్గ పరిధిలోని సర్పంచ్‌లు, ఏంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఏంపీపీలు, మున్సిపల్‌ ‌కౌన్సిలర్లు, మున్సిపల్‌ ‌చైర్మన్‌, ‌మార్కెట్‌ ‌కమిటీ చైర్మన్లు, నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులతో మొత్తం 180 మందితో మంత్రి టెలీ కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌ ‌రావు మాట్లాడుతూ..15 నుంచి 18 సంవత్సరాల వయస్సులోపు వారందరికీ కొరోనా వ్యాక్సినేషన్‌ ‌వేయించేలా, ఆయా గ్రామాల్లోని పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్‌ఎం‌లు, ఆశా వర్కర్ల సమన్వయంతో 2007కు ముందు పుట్టిన అర్హులైన వారెవరూ మిగలకుండా ప్రత్యేక దృష్టి పెట్టి పీహెచ్‌ ‌సీలకు తీసుకెళ్లి టీకాలు వేయించేలా చొరవ చూపాలని కోరారు.

గ్రామాల్లో అభివృద్ధి పనులు ముమ్మరంగా చేపట్టాలని, అసంపూర్తిగా మిగులు పనుకు, ఇంకా ప్రారంభించని సీసీ రోడ్డు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయించాలని ఆయా గ్రామ ప్రజాప్రతినిధులకు మంత్రి సూచించారు. చెత్త రహిత పట్టణంగా మార్చడమే లక్ష్యంగా మున్సిపల్‌ ‌కౌన్సిలర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి హరీష్‌ ‌రావు చెప్పారు. స్వచ్ఛ సిద్ధిపేటలో భాగంగా మున్సిపల్‌ ‌కౌన్సిలర్లు చాలా బాగా కృషి చేస్తున్నారని, అదే స్ఫూర్తితో క్షేత్రస్థాయిలో వార్డుల్లో దృష్టి పెట్టి పని చేయాలని కోరారు. అలాగే పట్టణ పరిధిలో 15 నుంచి 18 ఏళ్ల వయస్సులో ఉన్న అర్హులకు కోవిడ్‌ ‌టీకాలు వేయించేలా మున్సిపల్‌ ‌కౌన్సిలర్లు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.

మొదటి కోవిడ్‌ ‌వ్యాక్సినేషన్‌ ‌పూర్తయి, రెండవ టీకా వేసుకొని వారిని గుర్తించి, వారికి కోవిడ్‌ ‌టీకాలు వేయించేలా చొరవ చూపాలని మున్సిపల్‌ ‌కౌన్సిలర్లు, స్థానిక నాయకులు దృష్టి సారించాలని కోరారు. ఈ దఫా రైతుబంధుతో 50 వేల కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం, అప్పుగా కాకుండా నేరుగా నగదు కింద 50 వేల కోట్ల రూపాయలు ఈ దఫాతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ‌రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెల్లింపులు జరిపిందని తెలిపారు. దేశ చరిత్రలోనే స్వాతంత్య్రం వొచ్చిన నాటి నుంచి, ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా 50 వేల కోట్ల రూపాయలు రైతుబంధు కింద రైతులకు చెల్లించిందని గర్వంగా చెప్పుకునేలా.. తమ గ్రామాల్లో ప్రజాప్రతినిధులు పండుగలా వివిధ రూపాల్లో టీఆరెస్‌ ‌ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు, కృతజ్ఞతతో ఉత్సవాలను జరపాలని మంత్రి పిలుపునిచ్చారు.

Leave a Reply