వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

యాసంగికి కావాల్సినన్ని ఎరువులు

January 11, 2020

All the fertilizer required for yasangi
రెండో పంటకు 16.40లక్షల మెట్రిక్‌టన్నుల రసాయనిక ఎరువులు, జిల్లా గోదాముల్లో దుక్కిమందులు, యూరియా సంచులు

ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్‌: ‌లంయాసంగి సీజన్‌కు రాష్ట్ర వ్యవసాయశాఖ పూర్తిస్థాయిలో సిద్ధమైంది.రెండోపంటకు కావాల్సిన ఎరువులను రైతులకు పంపిణీ చేసేందుకు కర్యాచరణ ప్రణాళికలను రూపొందించారు. గత వర్షాకాలంలో యూరియాకోసం రైతులు పడరా నిపాట్లు పడ్డారు.ఈ అనుభవాలను పరిగణనలోకి తీసుకొని రెండోపంటకు 16.40లక్షల మెట్రిక్‌టన్నుల ఎరువులు అవసరమవుతాయని నిర్ణయించారు. కేంద్రాన్ని కావాల్సిన ఎరువులు ఇవ్వాలని కోరారు. కేంద్ర వ్యవసాయశాఖ రాష్ట్రం కోరినంత ఎరువును సరఫరా చేసింది.ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణవర్షపాతం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యింది. ప్రాజెక్ట్‌లన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. ఖరీఫ్‌సీజన్‌లో కోతలు జరుగుతున్నప్పుడు కూడా నవంబర్‌ ‌చివరివారం వరకు ఎడతెరపిలేని వర్షాలు కురిసాయి. గత దశాబ్దకాలంలో ఏనాడు నిండని నాగార్జునసాగర్‌, శ్రీ‌రాంసాగర్‌ ‌వంటి ప్రాజెక్ట్‌లు నిండాయి.ఈ రెండు ప్రాజెక్ట్‌ల నుంచి రెండోపంటలకు నీళ్లు అందిస్తున్నారు.ఈ ప్రాజెక్ట్‌లన్నీ కలిపి 38లక్షల ఎకరాలకు ప్రాజెక్ట్‌ల ద్వారా నీళ్లు అందించగలుగుతామని రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారులు రూపొందించిన క్యాలెండర్‌లో పేర్కొన్నారు,నీటిపారుదలశాఖ ఇచ్చిన ప్రణాళికలకు అనుగుణంగా రసాయనిక ఎరువులు సిద్ధం చేశారు. అంచనాలకు మించి కూడా వరినాట్లు పడే అవకాశాలు ఉన్నాయని జిల్లాలనుంచి వస్తున్న రిపోర్డులు తెలియచేస్తున్నాయి. సాధారణంగా రెండోపంటలకు నీటిలభ్యత తక్కువగా ఉంటుంది.అందుకని రైతులు మెట్ట పంటలకు ప్రాధాన్యం ఇస్తారు. అయితే కావాల్సిన నీటిలభ్యత ఉండటంతో ప్రాజెక్ట్‌లు, చిన్ననీటివనరులు, బోర్‌బావులు తదితర వనరుల ద్వారా వరినాట్లు ముమ్మరంగా పడుతున్నాయి.

ఈ సీజన్‌కు సరిపడేవిధంగా 8.20లక్షల మెట్రిక్‌టన్నుల యూరియా, 8.20 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల డీఏపీ, పొటాష్‌ ఇతర దుక్కులలో వేసే ఎరువులను అందుబాటులోకి తెచ్చారు. అన్నీ జిల్లా కేంద్రాలకు ఎరువులను తరలించారు. జిల్లాలోని గోదాములలో ఎరువులను అందుబాటులోకి తెచ్చారు.రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా (పీఏసీఎస్‌)‌ల ద్వారా 4.50లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ఎరువులను పంపిణీకి సిద్ధం చేశారు. మార్కెఫెడ్‌ ‌గోదాముల్లో 2.52లక్షల మెట్రిక్‌టన్నుల బఫర్‌ ‌యూరియా నిల్వలు ఉన్నాయని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.గత వర్షాకాలంలో సూర్యాపేట, హుజూర్‌నగర్‌, ‌కరీంనగర్‌, ‌నిర్మల్‌, ‌నిజామాబాద్‌, ‌జనగాం, సిరిసిల్ల, కోదాడ కేంద్రాల్లో అదనపు ఎరువులు సిద్ధంగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.గత వర్షరుతువులు రైతులు యూరియాకోసం తిప్పలు పడిన అన్నీ మండల కేంద్రాల్లో కావాల్సినంత యూరియా నిల్వలు పంపిణీకి సిద్దం చేశారు.ఈ ఎరువులు సరిపోనట్లయితే కేంద్రానికి విజ్ఞప్తులు పంపించి ఎక్కడ అవసర మైతే అక్కడ రసాయనిక ఎరువులను అందిస్తాయని రైతులు ఆందోలన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

Tags: fertilizer, required, yasangi, pacs, 4.50 lacks, metric tones