Take a fresh look at your lifestyle.

ఇక్కడ అన్ని అమ్మబడును..

త్యాగాల పునాదులు
కార్పొరేటు గునపాలకు ధ్వంసం అవుతున్న
అభివృద్ధి పెట్టుబడి చేప భూమిపై ఈదనికి వస్తున్న
సంబరపడి సమస్తం అర్పించే సందర్భం
భవిష్య తరాల భవిష్యత్‌ అగమ్యగోచరం..

స్వేచ్ఛకై చిందిన నెత్తురు జాడలు
ఇసుక తీరలైట
సుఖ మోజులో పయనిస్తున్నాయి..

రోడ్లు.సంస్థలు.విద్య, వైద్యం
అన్ని అంగడి సరుకై అగ్వకున్నై
కొల్లగొట్టుకునే వారికీ దొరికినంత
ఎర్ర తివాచీ పర్చి
సాదరంగా స్వాగతించే అమాత్యులు
నీడన దేశం మొత్తం తాకట్టు కానుంది..
బాహ్యంగా అభివృద్ధి జెండా
కొత్త రంగుతో రెపరెప లాడుతు భజన పరులని మురిపిస్తూ…
శ్రామికుడి నడ్డి విరిచే కుయుక్తులు
మొలుస్తున్నై…

ఒక్కొక్కటి చేయి దాటి పోతున్న
మిన్నకుండే ముఖాలు
సుఖాలు అరచేతిని ముద్దాడే సందర్భం…
భావి బానిసత్వానికి బాటలు
వేసుకుంటున్న భజన పరులు
ఎప్పటికీ తెలుకునుని చక్కదిద్దుకొనేలోపు
భూమిపై ఏమీ ఉండవేమో?
ఆలోచించే బుద్ది జీవి
అల్ప సంతోషాలకు బానిడకావడం..
దేశానికి పెను ప్రమాదం…

– నాగరాజు మద్దెల
6301993211.

Leave a Reply