Take a fresh look at your lifestyle.

సాగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధం

  • కోవిడ్‌ ‌నిబంధనల మేరకు ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల సంఘం
  • ఉదయం 7 నుండి రాత్రి 7 వరకు పోలింగ్‌
  • ‌ప్రధాన పార్టీల అభ్యర్ఠులతో పాటు బరిలో 41 మంది
  • మొత్తం 346 పోలింగ్‌ ‌కేంద్రాలు ఏర్పాటు
  • మాస్కులు ధరిస్తేనే వోటేయడానికి అనుమతి

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికకు రంగం సిద్ధం అయ్యింది. కోవిడ్‌ ‌నిబంధనల మేరకు ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7వరకు పోలింగ్‌ ‌నిర్వహించనున్నారు. కొరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకుని పోలింగ్‌ ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 2లక్షల మందికి పైగా వోటర్లు ఉండగా, 41 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అందుకు మొత్తం 346 పోలింగ్‌ ‌కేంద్రాలు ఏర్పాటు చేశారు. కోవిడ్‌ ‌నిబంధనల ప్రకారం వోటర్లు మాస్క్ ‌ధరించి వొస్తేనే వొటింగ్‌కు అనుమతి ఇస్తారు. ప్రతి పోలింగ్‌ ‌కేంద్రం వద్ద థర్మల్‌ ‌స్కానర్లు, మాస్క్‌లు, గ్లౌస్‌లు, శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. మొత్తం 8,151 మంది పోస్టల్‌ ‌బ్యాలెట్లకు దరఖాస్తు చేసుకోగా,1,433 మంది ఇప్పటికే పోస్టల్‌ ‌బ్యాలెట్‌ ఓటువేశారు.

కరోనా పాజిటివ్‌ ‌వచ్చిన వారు సాయంత్రం 6గంటల తరువాత ఓటు వేసేలా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ప్రచారంలో కొవిడ్‌ ‌నిబంధనలను పాటించని వారిపై మొత్తం 116 కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు రూ.45లక్షల నగదు, రూ.46లక్షల విలువైన మద్యాన్ని సీజ్‌ ‌చేశారు. ఎన్నిక నిబంధనలను ఉల్లం ఘించిన 362 మందిపై కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండగా, సాగర్‌ ‌నియోజకవర్గం పరిధిలో పని చేసే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు 17న అధికారులు సెలవు ప్రకటించారు.  ప్రధాన రాజకీయ పార్టీలయిన కాంగ్రెస్‌,‌టిఆర్‌ఎస్‌, ‌బిజెపిలతో పాటు పలువురు ఇండిపెండెంట్లు నేటి ఎన్నిక బరిలో ఉన్నారు. గురువారం సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగియడంతో కార్యకర్తలంతా ఇంటింటి ప్రచారంలో బిజీగా మారారు.

శుక్రవారం ఎక్కడిక్కడే గ్రూపు వి•టింగ్‌లతో ప్రచారానికి ప్రాధాన్యం ఇచ్చింది. ఏప్రిల్‌ 3‌న నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగియగా, బరిలో 41 మంది అభ్యర్థులు నిలిచారు. రెండునెలల ముందునుంచే వివిధ రూపాల్లో రాజకీయ పార్టీలు తమ  ప్రచారాన్ని ప్రారంభించాయి. ప్రధాన పార్టీలు, అభ్యర్థులు ఖరారయ్యాక ప్రచారాన్ని ముమ్మరంచేశాయి. ఉపఎన్నికను టీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌, ‌బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో మూడు పార్టీల కీలకనేతలు ఇక్కడే మకాంవేసి ప్రచారాన్ని వేడెక్కించారు. అధికార పార్టీ తరఫున మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, స్థానిక నేతలతో పాటు సీఎం కేసీఆర్‌ ‌బహిరంగసభతో ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్‌, ‌బీజేపీల రాష్ట్ర అధ్యక్షులు, కీలక నేతలు, స్టార్‌ ‌క్యాంపెయినర్లు అధికార పార్టీకి ధీటుగా ప్రచారాన్ని కొనసాగించారు. నియోజకవర్గంలోని ఆరుమండలాల్లో గ్రామగ్రామాన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సభలు, సమావేశాలు, రోడ్‌షోలతో అన్ని పార్టీల అభ్యర్థులు, వారికి మద్దతుగా వచ్చిన నేతలు సందడిచేశారు.  కాంగ్రెస్‌, ‌బీజేపీ పార్టీల రాష్ట్ర అధ్యక్షులు, కీలక నేతలు, స్టార్‌ ‌క్యాంపెయినర్లు అధికార పార్టీకి దీటుగా ప్రచారాన్ని కొనసాగించి ఢీ అంటే ఢీ అన్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో గ్రామగ్రామాన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

సభలు, సమావేశాలు, రోడ్‌షోలతో అన్ని పార్టీల అభ్యర్థులు, వారికి మద్దతుగా వచ్చిన నేతలు సందడి చేశారు. కొద్ది రోజులుగా రాజకీయ నేతల ప్రచారాలు, మైకులతో హోరెత్తిన నియోజకవర్గంలో ఒక్కసారిగా నిశబ్దం ఏర్పడింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి సాగర్‌లో మకాం వేసిన అన్ని పార్టీల నేతలు ప్రచార సమయం ముగియడంతో ఇంటిబాట పట్టారు. ప్రచారం ముగియడంతో ఎన్నిక నిర్వహణకు అధికారులు, పోలీసుల హడావుడి మొదలైంది. ఉప ఎన్నికలో విధులు నిర్వహించే పోలింగ్‌ ‌సిబ్బందికి థర్డ్ ‌ర్యాండమైజేషన్‌ ‌ద్వారా పోలింగ్‌ ‌స్టేషన్లను గురువారం కేటాయించారు. ఎన్నికల సాధారణ పరిశీలకుడు సజ్జన్‌ ‌సింగ్‌ ఆర్‌.‌చవాన్‌ ‌సమక్షంలో కలెక్టర్‌ ‌కార్యాలయంలో ప్రత్యేక సాప్ట్‌వేర్‌ ‌ద్వారా థర్డ్ ‌ర్యాండమైజేషన్‌ ‌పక్రియ నిర్వహించి 346 పోలింగ్‌స్టేషన్లకు సిబ్బందిని కేటాయించారు. ఉప ఎన్నిక నేపథ్యంలో నాగార్జునసాగర్‌ ‌నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ‌కార్యాలయాలకు స్థానిక సెలవు ప్రకటించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ‌ప్రశాంత్‌ ‌జీవన్‌ ‌పాటిల్‌ ‌తెలిపారు. పోలింగ్‌స్టేషన్లకు వినియోగించే పాఠశాలలు, కార్యాలయ భవనాలకు ఈ నెల 16న కూడా సెలవు ప్రకటించినట్లు తెలిపారు. ఉప ఎన్నిక పోలింగ్‌కు సంబంధించి రిసెప్షన్‌ ‌కేంద్రంలో సిబ్బంది చెక్‌ ‌లిస్ట్ ‌ప్రకారం వచ్చిన సామగ్రిని పరిశీలించాలని అదనపు కలెక్టర్‌ ‌చంద్రశేఖర్‌ ‌సూచించారు. ఆర్జాలబావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థలో స్ట్రాంగ్‌ ‌రూం, కౌంటింగ్‌ ‌సెంటర్‌ ఏర్పాటు చేశారు. మే2న కౌంటింగ్‌ ‌చేపట్టి ఫలితం ప్రకటిస్తారు.

Leave a Reply