Take a fresh look at your lifestyle.

రోడ్లన్నీ నిర్మానుష్యం..!

బయటకు వచ్చిన వారి ఐడిలు చెక్‌ ‌చేసిన పోలీసులు
అత్యవసర విభాగాల ఉద్యోగులకు మాత్రమే అనుమతి
అనవసరంగా వచ్చిన వారికి తొలిరోజు కౌన్సిలింగ్‌తో సరి
ప్రజలు ఇళ్లకు పరిమితం కావాలని హెచ్చరించిన పోలీసులు

లాక్‌డౌన్‌తో హైదరాబాద్‌లోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. అడుగడుగునా పోలీస్‌ ‌పికేట్‌ ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. బుధవారం ఉదయం 10 గంటల నుంచి లాక్‌ ‌డౌన్‌ ‌ప్రారంభమైంది. మొదటి రోజు కావడంతో ప్రజల్లో కొంతమందికి అవగాహన లేకపోవడంతో వారికి కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. పది తరవాత రోడ్లపైకి రావద్దని హెచ్చరిస్తున్నారు.  తర్వాత నుంచి కఠినంగా లాక్‌ ‌డౌన్‌ అమలు చేస్తామని పోలీసులు తెలిపారు.ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకుకార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నాలుగు గంటలే సడలింపు ఇవ్వడంతో మార్కెట్లలో రద్దీ కనిపించింది. నిత్యావసరాల కోసం ఉదయం నుంచి జనం క్యూకట్టారు. లాక్‌ ‌డౌన్‌ ‌విధించడంతో సొంతూళ్లకు ప్రయాణమయ్యారు.

సికింద్రాబాద్‌, ‌నాంపల్లి రైల్వే స్టేషన్లలో ప్రయాణీకుల రద్దీ కనిపించింది. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ ‌తెలంగాణ వ్యాప్తంగా ఉదయం 10 గంటలకు అమలులోకి వచ్చింది. ఉదయం వేళలో సొంత ఊరి బాట పట్టిన వారితో సికింద్రాబాద్‌, ‌నాంపల్లి రైల్వే స్టేషన్లు రద్దీగా కనిపించగా.. ఎంజీబీఎస్‌, ‌జేబీఎస్‌ ‌బస్‌స్టాండ్ల వద్ద ప్రయాణికుల సంఖ్య తగ్గింది. లాక్‌డౌన్‌ ‌సమయం దగ్గర పడటంతో ఇళ్లకు చేరుకునేందుకు పలువురు ఉరుకులు పరుగులు తీశారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో రోడ్లు, బస్టాండ్లు, మెట్రో స్టేషన్లు నిర్మానుష్యంగా మారాయి. హైదరాబాద్‌లోని అవి•ర్‌పేట, పంజాగుట్ట, ఎస్‌ఆర్‌ ‌నగర్‌ ‌తదితర ప్రాంతాల్లో వస్త్ర, వాణిజ్య, దుకాణ సముదాయాలను వ్యాపారులు మూసివేశారు.

లాక్‌డౌన్‌ ‌ప్రారంభం కావడంతో సికింద్రాబాద్‌ ‌జూబ్లీ బస్టాండ్‌ ‌నిర్మానుష్యంగా మారింది. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ తదితర ప్రాంతాల్లో ప్రధాన రహదారిపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్‌ ‌నిబంధనలను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రధాన కూడళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన అత్యవసర సేవలను మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వారిని వెనక్కి పంపుతున్నారు.రాచకొండ పరిధిలో లాక్‌ ‌డౌన్‌ ‌సంపూర్ణంగా కొనసాగుతోందని రాచకొండ సీపీ మహేష్‌ ‌భగత్‌ ‌తెలిపారు. ప్రజలు ఇళ్ళలోనే ఉండాలని మనవి చేస్తున్నామన్నారు. వ్యాపార సమూదాయలు 10 గంటలకే బంద్‌ ‌చేశారన్నారు. అనవసరంగా రోడ్ల వి•దకు వస్తే కఠిన చర్యలు తప్పవని మహేష్‌ ‌భగత్‌ ‌హెచ్చరించారు.

Leave a Reply