Take a fresh look at your lifestyle.

పోలవరం సహా ప్రాజెక్టులన్నీ త్వరగా పూర్తి పూర్తిచేయాలి

యుద్దప్రాతిపదికన ప్రాజెక్టులు పూర్తి కావాలి
ఇరిగేషన్‌శాఖపై సక్షలో సిఎం జగన్‌ ఆదేశాలు

అమరావతి, మే 28 : పోలవరం అత్యంత ప్రాధాన్యతగల ప్రాజెక్ట్ అని సీఎం జగన్‌ ‌చెప్పారు. యుద్ధప్రాతిపదికన పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలనే.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందుగా డబ్బులు ఇస్తున్నామని తెలిపారు. ఇరిగేషన్‌శాఖపై సీఎం సక్ష నిర్వహించారు. పోలవరం దిగువ కాఫర్‌ ‌డ్యాంకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని అధికారులను జగన్‌ ఆదేశించారు. కేంద్రం నుంచి దాదాపు రూ.1600 కోట్ల బిల్లులు.. వేర్వేరు దశల్లో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఢిల్లీ వెళ్లి పెండింగ్‌ ‌బిల్లులు క్లియర్‌ అయ్యేలా చూడాలని ఆయన సూచించారు. నేరడి బ్యారేజీ నిర్మాణంపైనా దృష్టిపెట్టాలన్నారు. త్వరలోనే నేరడి బ్యారేజీపై ఒడిశాతో మాట్లాడతామని సీఎస్‌ ‌చెప్పారు. వెలిగొండ టన్నెల్‌-2 ‌పనులు వేగవంతం చేయాలని, వంశధార- నాగావళి నదుల అనుసంధానం పనులు పూర్తిచేయాలని జగన్‌ ఆదేశించారు.

పోలవరం సహా ప్రాధాన్యత ప్రాజెక్టుల నిర్మాణ ప్రగతిపై అధికారులతో చర్చించారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్రగతిని అధికారులు సీఎంకు వివరించారు. 91 శాతం స్పిల్‌వే కాంక్రీట్‌ ‌పనులు పూర్తయ్యాయని.. జూన్‌ 15 ‌నాటికి మిగిలిన పనులు పూర్తిచేస్తాం అని అధికారులు తెలిపారు. ఈ నెలాఖరుకు స్పిల్‌ ‌ఛానల్‌ ‌పనులు పూర్తవుతాయని వెల్లడించారు. ఎగువ కాఫర్‌ ‌డ్యామ్‌లో ఖాళీలను పూర్తిచేశామని.. జూన్‌ ‌నెలాఖరుకు కాఫర్‌ ‌డ్యామ్‌లో 1, 2 రీచ్‌లు పూర్తవుతాయన్నారు అధికారులుజులై ఆఖరుకు కాఫర్‌ ‌డ్యామ్‌ 3, 4 ‌రీచ్‌ ‌పనులు నిర్ణీత ఎత్తుకు పూర్తి అవుతాయని తెలిపారు. దిగువ కాఫర్‌ ‌డ్యాం పనులు కూడా వేగవంతం చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. కేంద్రం నుంచి రావాల్సిన పోలవరం బిల్లుల చెల్లింపుపై సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌సక్ష నిర్వహించారు.

1600 కోట్ల రూపాయల బిల్లులు వేర్వేరు దశల్లో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు సీఎం. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి జగన్‌ ‌మాట్లాడుతూ.. ‘పోలవరం ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యతా ప్రాజెక్టు. యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తిచేయాలనే తలంపుతో ఉన్నాం. అందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందుగా డబ్బులు ఇస్తున్నాం. ప్రాజెక్టు ఫలాలు వీలైనంత త్వరగా అందించాలనే తపనతో ఉన్నాం. ఆర్థికంగా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా.. ప్రాజెక్టు పట్ల సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నాం అని సీఎం జగన్‌ ‌తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసిన ఖర్చుకు సంబంధించి ..కేంద్రంలో బిల్లులు పెండింగులో ఉండడం సరికాదు . అధికారులు వెంటనే దీనిపై దృష్టిపెట్టాలన్నారు. చేసిన ఖర్చు వెంటనే రీయింబర్స్ అయ్యేలా చూడాలి. వచ్చే మూడు నెలలకు కనీసం 1400 కోట్ల రూపాయలు ఖర్చు అని అధికారులు చెప్తున్నారు. ఢిల్లీ వెళ్లి పెండింగ్‌ ‌బిల్లులు క్లియర్‌ అయ్యేలా చూడాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

Leave a Reply