Take a fresh look at your lifestyle.

అం‌టువ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు: కలెక్టర్‌

‌సూర్యాపేట, ఆగస్టు 24, ప్రజాతంత్ర ప్రతినిధి): జిల్లాలోని వివిధ సమస్యలపై అర్జిదారులు చేసుకున్న దరఖాస్తులను అర్హత మేరకు పరిశీలించి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ‌టి. వినయ్‌ ‌కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ ‌కార్యాలయంలో అర్జిదారుల నుండి దరఖాస్తులను స్వీకరించి మాట్లాడారు. అర్జిదారులు చేసుకున్న దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని సూచించారు.

తరుచుగా వర్షాలు పడుతున్నందున ఎప్పటికప్పుడు పారిశుద్ద్య పనులు చేపట్టి అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు సరిపడా ఉంచాలని, ముఖ్యంగా గ్రామాలలో ప్రజలకు కరోనా వైరస్‌పై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యాధికారులను అవగాహన కల్పించాలని సూచించారు.

Leave a Reply