Take a fresh look at your lifestyle.

నేడు ప్రగతి భవన్‌ ‌వద్ద అఖిలపక్ష పార్టీల నిరసన

రాష్ట్రంలో కొరోనా వైరస్‌ను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

రాష్ట్రంలో కొరోనా వైరస్‌ను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిరస నగా శుక్రవారం అఖిల పక్ష పార్టీల ఆధ్వ ర్యంలో ముఖ్య మంత్రి మేలుకో ప్రజల ప్రాణాలను కాపాడు, బ్రతుకు దెరువును నిలబెట్టు పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ‌మేరకు ప్రభుత్వం ఇచ్చిన హామీని మరచినందుకు ఈ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ప్రజలు లాక్‌డౌన్‌ ‌నిబంధనలు పాటిస్తూనే నల్ల బెలూన్లను ఎగురవేయాలని టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ ‌పిలుపునిచ్చారు.

శుక్రవారం ఉదయం 11 గంటలకు అఖిలపక్ష పార్టీల నేతలు ప్రొ.కోదండరామ్‌తో పాటు టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.‌రమణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, న్యూడెమోక్రసీ నాయకులు వెంకటేశ్వరరావు, కె.గోవర్ధన్‌, ఇం‌టి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, శ్రీ‌శైల్‌రెడ్డి, బాలమల్లేష్‌, ‌డిజి నరసింహారావు, చలపతిరావు, రాజేష్‌, ఉప్పలయ్య, మురహరి పాల్గొననున్నారు. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును కాపాడాల్సిన సీఎం కేసీఆర్‌ అం‌దుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నందున ఆయనకు కనువిప్పు కలిగేలా  నిర్వహిస్తున్న ఈ నిరసనలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ప్రొ.కోదండరామ్‌ ‌పిలుపునిచ్చారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!