Take a fresh look at your lifestyle.

భద్రతా గదుల్లో అభ్యర్థుల భవితవ్యం

All party candidates waiting for muncipal results
అదృష్టాల పరీక్షకు ఇంకో రెండు రోజుల ఉత్కంఠ – ఎవరికి వారే గెలుపు మాదే అనే ధీమా..

పుర పోరులో అలుపెరగకుం డా కష్టపడ్డ అభ్యర్థులు వారి అనుయాయులు సేద తీరుతున్నారు. ఇల్లు గుల్లచేసుకుని మరి ఖర్చు పెట్టుకున్న అభ్యర్థులు వారి అనుయాయులు పెట్టిన ఖర్చుతో పాటు ఎవరెవరు కష్టపడ్డరు, ఎన్ని ఓట్లు వేయించారు, గెలుపుకోసం ఎంత దూరంలో ఉన్నాము ప్రత్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి అనే మీమాంసలో పోటీ చేసిన అభ్యర్థులు వారి అనుయాయులు, అనుచరులతో సత్సంగ సమావేశాలు నిర్వహణ కొనసాగుతుంది. టెంట్లు వేసుకుని మరీ భోజనాలు, పార్టీలు సమకూర్చిన ప్రదేశంలోనే హంగామా చేసిన వారు ఎలాంటి హడావుడీ లేకుండా చాప కింద నీరులా గెలిచే అవకాశాల గురించి బేరీజు వేసుకునే సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కొక్క అభ్యర్థి తమకు ఉన్న కోట్లాది రూపాయల్లో ఎంతో కొంత కేటాయించుకుని తమ రాజకీయ భవితవ్యానికి పునాదులు వేసుకునేందుకు కొత్త అభ్యర్థులు రంగంలోకి దిగగా ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందునుండే ఆయా కాలనీల్లో నెలకొన్న సమస్యలు, ప్రజల అవసరాలు గుర్తించి సేవ చేసి గెలుపొందాలనుకునే వారి నోట్లో మట్టి కొట్టినట్లుగా నోట్ల కట్టలతో దిగి గెలుపును శాసించే వారి కింద నలిగిపోయే సంఘటనలు గోచరిస్తున్నాయి.
ఆరు వేల రూపాయల జీతం కోసమేనా ఇంత  ఆర్భాటాలు
ఒక కార్పొరేటర్‌గా గెలిచిన అభ్యర్థులకు నెల వారీ జీతం కేవలం రూ. 6 వేలు మరీ ఇంత జీతం కోసం ఎంత ఖర్చు పెడుతున్నామో తెలియనంతగా దూకుడుగా వెళ్ళడం చూస్తుంటే కార్పొరేటర్‌ ‌పదవికి ఇంత ఆర్థిక వనరులున్నాయా అనేలా ప్రచారం కొనసాగడం పట్ల ప్రజలు, సామాజిక వాదులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరు వేల రూపాయల కోసం ఒక్కొక్కరు అర కోటి వరకు ఖర్చు పెట్టడం చూస్తుంటే వీరి సేవా రంగం ఎంత ఆసక్తిగా మరిందోనని ప్రజల నుండి అసహనం వ్యక్తమవుతుంది.  ఇంకా కొందరు అభ్యర్థులు పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి మరీ ప్రముఖ పార్టీల నుండి టికెట్‌ ‌సాధించి మరీ పోటీకి వెళ్ళడం పట్ల సేవ చేయాలంటే ఇంత ఖర్చు పెట్టాలా అనే సెటైర్లు వేసుకోవడం పరిపాటిగా మారుతుంది. పోటీల్లో వైద్య వృత్తి, రియాల్టర్లు, ఫైనాన్స్ ‌వ్యాపారులు పోటీలోకి దిగడం పట్ల ఎన్నడూ లేనంతగా ఎలాగైనా గెలుపొందాలని ఎన్నికల నోటిఫికేషన్‌ ‌వెలువడకముందు. డివిజన్ల వారిగా రిజర్వేషన్‌ ‌కేటాయించ••ముందు నుండే ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం తరువాత రిజర్వేషన్‌ అనుకూలించక చతికిలపడిన వారు కొందరు కాగా ఎక్కడైనా ఫర్వాలేదు. డబ్బుకు లోకం దాసోహం అనే రీతిలో విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేసి మరీ గెలిచేలా ఏర్పాట్లు చేసుకున్నారనే ప్రచారం కొనసాగుతుంది.

- Advertisement -

అందినకాడికి దండుకుందాం.. అనుకునే వారికి రివర్స్ ‌గిఫ్ట్ ‌ఖాయమే
అందినకాడికి దండుకుందాం అని ఆశించిన ప్రజలకు రానున్న రోజుల్లో ఆయా ప్రజా ప్రతినిధుల నుండి రివర్స్ ‌గిఫ్ట్ అం‌దడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మా కాలనీలోని వినాయక మండపం, యూత్‌కోసం మరో పార్టీ, డీజే సౌండ్‌ ‌కిట్‌ అని గొంతెమ్మ కోర్కెలు కోరినవారి నుండి అంతకు మించి అనే అభిప్రాయాన్ని స్పష్టంగా ఏర్పాటు చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు బడా బాబులు ఇప్పుడే కాకపోయినా మరోసారైనా ఖర్చు పెట్టి మీముందుకు వచ్చి సేవ చేస్తామని చెపుతుండడం పట్ల ప్రజలు విస్తుపోతున్నారు. మాకేం తక్కువ పైసల్లోనే పుట్టినం పెరిగినం  కేవలం ప్రజా సేవే పరమావధిగా ముందుకు వస్తున్నాం అని గెలుపే లక్ష్యంగా ప్రత్యర్థి వర్గాలను భయభ్రాంతులకు గురి చేసి మరీ ఖర్చు చేసే విధానానికి ప్రజలు, ఓటర్లు చిత్తవుతున్నారు. ఏది ఏమైనా నిజమైన సేవ చేసే వారిని ఎంత వరకు ఆదరిస్తారో ఎవరు గెలుపు వాకిట నిలుస్తారో తెలుసుకునేందుకు మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే.

Tags: pura results 2020, live updates, telangana parties

Leave a Reply