Take a fresh look at your lifestyle.

‌గ్రేటర్‌ ‌ప్రచారంలో పాల్గొన్న వారంతా హోమ్‌ ‌క్వారంటైన్‌లో ఉండాలి

  • అనుమానాలు ఉంటే పరీక్షలు చేసుకోవాలి
  • రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ శ్రీ‌నివాస్‌ ‌రావు
  •  రాష్ట్రంలో కోవిడ్‌ ‌నియంత్రణలో ఉందని వెల్లడి
గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ షాకింగ్‌ ‌న్యూస్‌ ‌చెప్పింది. ప్రచారంలో పాల్గొన్న వారంతా హోమ్‌ ‌క్వారంటైన్‌లో ఉండాలని సూచించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్‌ ‌నియంత్రణలో ఉందని, పాజిటివ్‌ ‌పర్సెంటేజ్‌ 1 ‌శాతం మాత్రమే ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీ‌నివాస్‌ ‌రావు అన్నారు. యాక్టీవ్‌ ‌కేసులు, మరణాలు తక్కువ..రికవరీ రేట్‌ ఎక్కువగా ఉందని అన్నారు. అయితే ఇటీవలి  జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల సందర్భంగా వేలమంది జనం గుమిగూడారని, ప్రచారంలో పాల్గొన్న వారంతా 5 నుంచి 7 రోజులు హోమ్‌ ‌క్వారంటెయిన్‌ ఉం‌డాలని సూచించారు.
బుధవారం నగరంలోని కోఠిలో నిర్వహించిన వి•డియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల వేళ ప్రచారం నిర్వహించిన కార్యకర్తల నుంచి నాయకుల వరకు అందరూ ఐసోలేషన్‌లో ఉండాలని, కుటుంబ సభ్యులను కూడా దూరం పెట్టాలని ఆయన అన్నారు. లక్షణాలు ఉంటే టెస్ట్‌లు చేయించుకోవాలన్నారు. కొరోనా బాధితుల కోసం ప్రభుత్వ, ప్రయివేట్‌ ‌హాస్పిటళ్లలో 88శాతం బెడ్స్ ‌ఖాళీగా ఉన్నాయని, సీఎం, మంత్రి ఈటల ఎప్పటికప్పుడు వైరస్‌ ‌తీవ్రతపై రివ్యూలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 65 వేలకు పైగా టెస్ట్‌లు చేయగల కెపాసిటీ ఉందని .. 1096 సెంటర్స్‌లో టెస్ట్‌లు చేస్తున్నామని తెలిపారు. మరో 50 సెంటర్స్  ‌కొత్తగా ప్రారంభిస్తున్నామని, వీటిలో జీహెచ్‌ఎం‌సీ పరిధిలో 25 సెంటర్లు ఉన్నాయన్నారు.

Leave a Reply