Take a fresh look at your lifestyle.

విద్యార్థుల రక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలి

  • ఆరోగ్యం, రక్షణ, మానసిక సంబంధాలపై ప్రత్యేక దృష్టి
  • యూనివర్సిటీల వీసీలు, రిజిస్ట్రార్లకు గవర్నర్‌ ‌తమిళిసై సూచన

‌ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలలు పున:ప్రారంభం అవుతున్న దృష్ట్యా విద్యార్థుల రక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్‌ ‌డా.తమిళిసై సౌందరరాజన్‌ ‌వైస్‌ ‌చాన్స్‌లర్లు, రిజిస్ట్రార్లకు సూచించారు. ముఖ్యంగా తరగతుల నిర్వహణ విషయంలో విద్యార్థుల ఆరోగ్యం, రక్షణతో పాటు మానసిక, పౌష్టిక సంబంధ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని కళాశాలలను పున:ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయంచిన నేపథ్యంలో గవర్నర్‌ ‌శుక్రవారం రాజ్‌భవన్‌ ‌నుంచి వర్చువల్‌ ‌విధానంలో వైస్‌ ‌చాన్స్‌లర్లు, రిజిస్ట్రార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్‌ ‌వ్యాక్సిన్‌ అం‌దుబాటులోకి వచ్చిన నేపథ్యంలో కళాశాలలను ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ సమయంలో అంతా జాగ్రత్తతో వ్యవహరించి విద్యార్థుల రక్షణకు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు విద్యార్థులు, సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించడం, క్యాంపస్‌లలో హాండ్‌వాష్‌ ‌సౌకర్యాలతో పాటు విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కొరోనా సమయంలో విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా అన్ని యూనివర్సిటీల పరిధిలోని అన్ని కళాశాలల్లో ఆన్‌లైన్‌ ‌క్లాసుల నిర్వహణకు చొరవ తీసుకున్నందుకు వైస్‌ ‌చాన్స్‌లర్లను ఈ సందర్భంగా గవర్నర్‌ అభినందించారు.

Leave a Reply