Take a fresh look at your lifestyle.

హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణకు అన్ని చర్యలు: కలెక్టర్‌

‌సూర్యాపేట, సెప్టెంబర్‌9, ‌ప్రజాతంత్ర ప్రతినిధి): జిల్లాను పచ్చని వనంలా మార్చేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్‌ ‌టి. వినయ్‌ ‌కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌ ‌కార్యాలయంలో జాతీయ రహదారుల అధికారులు, హరితహారం ప్రత్యేక అధికారులు, ఎంపిడిఓలు, గ్రామ కార్యదర్శులతో నాటిన మొక్కల సంరక్షణపై ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతు మొదలు నుండి చివరి భాగం వరకు 6వ విడతలో జాతీయ రహదారికి ఇరువైపులా రెండు వరుసల్లో నాటిన ప్రతి మొక్క సంరక్షణ ఆయా పరిధిలోని సంబంధిత శాఖాధికారుల పర్యవేక్షణలో చూసుకోవాలని అన్నారు.

జిల్లాలో వర్షాలు ఎక్కువగా పడుతున్నందున మొక్కల పాదులలో నీరు ఎక్కువ నిల్వఉండకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. జిల్లాలో 80లక్షలు మొక్కల నాటే లక్ష్యం కాగా ఇప్పటి వరకు 62లక్షల మొక్కలు నాటామని అన్నారు. ఇటీవల కొన్ని మండలాలలో నాటిన మొక్కలను పరిశీలించం జరిగిందని తెలుపుతూ చనిపోయిన మొక్క) స్థానంలో నూతన మొక్కలను నాటాలని సూచించారు. కొత్త పంచాయతీ రాజ్‌ ‌చట్టంలో నిబంధనలు తప్పక అనుసరించాలని అధికారులకు వెల్లడించారు. గ్రామాల్లో రక్షణకు పెట్టిన ట్రీగార్డులను తీసివేసిన వారిపై కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పిడి కిరణ్‌కుమార్‌, ‌డిఎఫ్‌ఓ ‌ముకుంద రెడ్డి, ప్రత్యేక అధికారులు, ఎంపిడిఓలు, గ్రామ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply