- లాక్‌డౌన్‌కు ముందు బుక్‌చేసిన వారికి వడ్డీలో చెల్లించాలి
- తిరిగి ప్రయాణానికి అనుగుణంగా మార్చుకునే వెసలుబాటు
- టిక్కెట్ మొత్తాన్ని బదిలీ చేసుకునే వీలు
- ఏజెంట్లకు విమానయాన సంస్థలకు సుప్రీం ఆదేశాలు
విమాన టికెట్ తీసుకుని లాక్డౌన్ సమయంలో ప్రయాణం చేయలేకపోయిన వారికి సుప్రీంకోర్టు ఓ శుభవార్తను వినిపించింది. పౌరవిమానయాన శాఖ ప్రతిపాదించిన రిఫండ్ స్కీమ్‌కు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లాక్డౌన్ సమయంలో రద్దు అయిన విమానాలకు సంబంధించి ఈ స్కీమ్‌ను రూపొందించారు. జస్టిస్ అశోక్ భూషణ్‌తో కూడిన ధర్మాసనం ఇవాళ ఈ కేసును విచారించింది. ప్రయాణికులకు, విమాన రంగానికి ఆమోదయోగ్యమైన స్కీమ్‌ను ఆహ్వానిస్తున్నట్లు సుప్రీం బెంచ్ పేర్కొన్నది. ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుక్ అయిన టికెట్లను వారి ద్వారానే రిఫండ్ చేయాలని కోర్టు సూచించింది. టికెట్లు తీసుకున్న ప్రయాణికుల పేరిట క్రెడిట్ షెల్స్ ఓపెన్ చేయాలని విమానాయాన శాఖ సూచన చేసింది. అయితే ప్రయాణికులు క్రెడిట్ షెల్ అకౌంట్‌తో ఏ రూట్లోనైనా తమ ప్రయాణం కోసం తర్వాత టికెట్‌ను బుక్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. ఆ క్రెడిట్ మొత్తాన్ని మరొకరికి కూడా ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఇచ్చారు. ఒకవేళ క్రెడిట్ అమౌంట్‌ను ప్యాసింజర్ వాడనిపక్షంలో.. ఆ మొత్తాన్ని వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ లోగా ఆ ప్రయాణికుడి ఖాతాలోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు.
కోవిడ్-19 నిరోధానికి అమలు చేసిన లాక్డౌన్ ముందు బుక్ చేసిన విమానాల టిక్కెట్ల ధరను ప్రయాణికులకు తిరిగి చెల్లించాలని విమానయాన సంస్థలను సుప్రీంకోర్టు ఆదేశించింది. మే 24 వరకు ప్రయాణించేందుకు బుక్ చేసుకున్న టిక్కెట్లు విమానయాన సేవలు రద్దయినందు వల్ల ప్రయాణికులకు ఆ సొమ్మును తిరిగి చెల్లించాలని ఆదేశించింది. లాక్డౌన్ నేపథ్యంలో విధించిన ఆంక్షల కారణంగా రద్దయిన విమానాల టిక్కెట్ల ధరను తిరిగి చెల్లించడానికి సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూపొందించిన ప్రణాళికను సుప్రీంకోర్టు గురువారం ఆమోదించింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, విమానయాన సంస్థలు తమ వద్ద టిక్కెట్ తీసుకున్న ప్రయాణికుల పేరు వి•ద క్రెడిట్ షెల్‌ను ఏర్పాటు చేయవచ్చు. ఈ సొమ్ముతో 2021 మార్చి 31లోగా ఏ మార్గంలోనైనా విమానయానం చేసే అవకాశం ప్రయాణికులకు కల్పిస్తారు.
ఈ క్రెడిట్ షెల్‌ను వేరొకరికి బదిలీ చేసుకోవచ్చు. టిక్కెట్‌ను రద్దు చేసుకున్న తేదీ నుంచి జూన్ 30 వరకు 0.5 శాతం వడ్డీ, జూలై 1 నుంచి 2021 మార్చి 31 వరకు 0.75 శాతం వడ్డీని విమానయాన సంస్థలు చెల్లిస్తాయి. ట్రావెల్ ఏజెంట్ల ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకున్నట్లయితే, వారి ద్వారానే ఆ సొమ్మును తిరిగి చెల్లిస్తారని సుప్రీంకోర్టు చెప్పింది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 మధ్యలో బుక్ చేసిన టిక్కెట్ల ధరను ప్రయాణికులకు తక్షణమే తిరిగి చెల్లించాలని డీజీసీఏ ఏప్రిల్ 16న ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలు కొనసాగుతాయి. ఈ ఏడాది మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా అంతకు ముందు బుక్ చేసిన విమాన టిక్కెట్ల సొమ్మును తిరిగి చెల్లించాలని కోరుతూ ప్రవాసీ లీగల్ సెల్, ఎయిర్ పాసింజర్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం ఈ తీర్పు చెప్పింది. సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే అడ్వకేట్ జో అబ్రహంలు కేసును వాదించారు. క్రెడిట్ షెల్ స్కీమ్‌కు అంతర్జాతీయ ప్రయాణికులు కూడా వస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది.