Take a fresh look at your lifestyle.

‌ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలి : ఎమ్మెల్యే

నర్సంపేట నియోజకవర్గం లో ఇంతవరకు ఒక్క పాజిటివ్‌ ‌కేసు కూడా నమోదు కాలేదని కేవలం వారు వివిధ పనులపై బయటికి పోయి వచ్చిన వారేనని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ ‌రెడ్డి అన్నారు సోమవారం క్యాంపు కార్యాలయంలో పోలీసు రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాధి విజృంభన నేపధ్యంలో కట్టడి చర్యలు చేపట్టి అప్రమత్తంగా ఉండాలని అన్ని మండలాల అధికారులకు సూచించారు. ప్రపంచలో అన్ని దేశాలను కుదిపేస్తున్న కరోనా మన దేశంలో కూడా రోజు రోజుకు.. పెరుగుతోందనీ ఒక వైపు కరోనాకు మందు కనిపెడుతున్నామని శాస్త్రవేత్తల తేలిపే విషయాలు కొంత ఊరట కలిగిస్తుంటే, మరో వైపు జనాల ఆశ్రద్దతో తిరిగే క్రమం ఆందోళన కలిగిస్తుందని ఆయన అన్నారు. ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్‌ ‌కూడా లేని నర్సంపేట నియోజకవర్గం లో ముందు నుంచే తగు జాగ్రత్తలు తీసుకున్నామని, లాక్డౌన్‌ ఎత్తి వేయడంతో జనాల ఉధృతి పెరిగిందని కరోనా పట్ల వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకునే విషయంలో సీరియస్నెస్‌ ‌పెంచాలని ఈ సందర్భంగా ఎమ్మేల్యే అన్నారు. నియోజకవ ర్గంలో ముఖ్యంగా పోలీస్‌ ‌శాఖ జనాల రాకపోకలను తగ్గించాలని, మాస్క్ ‌లేకుండా ఇష్టారాజ్యంగా తిరిగే అల్లరి మూఖలను గుర్తించి వారి పట్ల కఠినంగా వ్యవరించాలని ఆదేశించారు. కరోనా ఎక్కడికి పోలేదని మనము ఇష్ట మొచ్చినట్లు తిరిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, వ్యాధి సోకితే మనతోనే పోకుండా అమాయకులైన మన కుటుంభ సభ్యులుతో పాటు అనేక మందిని బలితీసుకున్నవాళ్ళం కావద్దని కోరారు.

రానున్న వర్ష్యా కాల రీత్యా వైరల్‌ ‌డీసీసెస్‌ ఎక్కుగా ప్రబలే అవకాశం ఉంది గనుక ముందస్తు చర్యగా వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండటం వలన దాని వలన కలిగే నష్టాన్ని తగ్గించవచ్చని అన్నారు. కరోనా విజృంభిస్తున్న నగరాలు, పట్టణాల నుండి వచ్చే వ్యక్తులను కట్టడి చేయాలని, మన ఇరుగు పొరుగు వారు ఎలాంటి అస్వస్థతకు గురైన వెంటనే అధికారులకు తెలియజేయాలని అన్నారు.వ్యాధి పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉంటే దాని వలన మృత్యు వాత అంత తీవ్రస్థాయిలో ఉందని తెలిపారు. గ్రామాల్లో ఎప్పటికప్పుడు సానిటైజ్‌ ‌చేస్తూ వ్యాధి పట్ల వారికి అవగాహన కల్పించాలని అధికారులను కోరారు.మాస్క్ ‌తప్పనిసరి దరిస్తూ వ్యాధి నిరోధక శక్తిని పెపొందించే ఆహారం తీసుకోవాలని అన్నారు. ఏదైనా అత్యవసరం అయితే తప్పా బయటకు రావద్దని ఒకవేళ వచ్చినా సామాజిక వ్యక్తిగత దూరం తప్పని సరిగా పాటించాలని కోరారు. నియోజకవర్గంలో ఎక్కడైనా సరే మాస్కలు లేకుండా కరోనా నిబంధనలు పాటించకుండా ఎవ్వరు కనిపించిన వారికి కౌన్సిలింగ్‌ ఇస్తూ ఇంకోసారి అలా వ్యవహరించకుండా ఫైన్‌ ‌వేయాలని పోలీసు వారిని అదేశించారు.ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు వైద్యులు, పోలీసు వారు, ప్రజల సమూహంలో మెలిగే రక రకాల వృత్తులు చేస్తున్న వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నర్సంపేట పట్టణంలో వివిధ రకాల వ్యాపారాలు చేస్తున్న షాప్‌ ‌యజమానులు తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు.ఈ కార్యక్రమంలో రూరల్‌ ‌జిల్లా డి ఎం హెచ్‌ ఓ ‌మధుసూదన్‌, ఏసీపీ ఫణిదర్‌, ఆర్‌ ‌డి ఓ పవన్‌ ‌కుమార్‌, ‌నర్సంపేట గవర్నమెంట్‌ ‌హాస్పిటల్‌ ‌సూపరింటెండెంట్‌ ‌గోపాల్‌, ఐఎంఏ ‌బాధ్యులు, అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు, పోలీసులు,వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply