Take a fresh look at your lifestyle.

ఉద్యమకారులంతా ఏకం కావాల్సిందే

  • కెసిఆర్‌ను గద్దె దించేందుకు మరో ఉద్యమం
  • తెలంగాణ జనసమితి అధినేత ప్రొ. కోదండరామ్‌ ‌పిలుపు

భూకబ్జా ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రి ఈటల రాజేందర్‌కు టీజేఎస్‌ అధినేత, ప్రొఫెసర్‌ ‌కోదండరాం మద్దతు తెలిపారు.  కేసీఆర్‌ను గద్దె దింపటానికి ఉద్యమకారులు ఏకం కావాల్సిన సమయయం వచ్చిందని పిలుపునిచ్చారు. ఉద్యమకారులు విడివిడిగా ఉండటం వలనే కేసీఆర్‌ ‌రెచ్చిపోతున్నాడని విమర్శించారు. కేసీఆర్‌ ‌దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించటానికి సిద్ధమవ్వాలన్నారు. మంత్రి ఈటల సహా.. కేటీఆర్‌, ‌మల్లారెడ్డి, ముత్తిరెడ్డి, మంచిరెడ్డి కిషన్‌ ‌రెడ్డి,  మహిపాల్‌ ‌రెడ్డిలపై విచారాణ జరపాలని కోదండరాం డిమాండ్‌ ‌చేశారు. కేసులతో ఉద్యమంలో చిత్తశుద్ధితో పనిచేసిన వారిని కేసీఆర్‌ అణగదొక్కుతున్నారన్నారు. ఉద్యమ ద్రోహులను పక్కన పెట్టుకుని కేసీఆర్‌ ‌రాజకీయ కక్ష సాధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రి ఈటల గట్టిగా మాట్లాడినందుకే ఆయనపై విచారణ చేపట్టారని వ్యాఖ్యానించారు. ప్రత్యర్థులను లొగదీసుకోవటానికి భూ వివాదాలను కేసీఆర్‌  ఉపయోగించుకుంటున్నారన్నారు. రాజకీయ అవసరాల కోసమే కేసీఆర్‌ ‌విచారణలు వేస్తున్నారని తెలిపారు. హఫీజ్‌ ‌పేట్‌, ‌మియాపూర్‌ ‌భూవివాదాల కేసులపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ ‌చేశారు. కరోనాను నుంచి ప్రజల దృష్టి మలచటానికే ఈటల ఎపిసోడ్‌ ‌తీసుకువచ్చారని దుయ్యబట్టారు. భూ రికార్డుల ప్రక్షాళన చేయటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. భూ రికార్డుల సమస్యలపై తమ వాదనే కరెక్ట్ అయిందని కోదండరాం చెప్పుకొచ్చారు. ఇకపోతే ఎన్‌ ‌కన్వెన్షన్‌ ‌విషయంలో చెరువు శిఖం ఆక్రమణల కేసు ఏమయ్యిందన్నారు. హడావిడి చేసి మసిపూసి మారేడు కాయ చేశారన్నారు. ఈటెల వ్యవహారంలో ఇది భూ వివాదం కాదన్నారు. ఇది ఉద్యమకారులపై పన్నిన కుట్రగా ఆరోపించారు.

Leave a Reply