Take a fresh look at your lifestyle.

ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్‌ ‌రాజీనామా

  • మునుగోడు ఎన్నిక ముందు బిజెపికి షాక్‌
  • ‌బిజెపి నీతులు తప్ప ఆచరణలో శూన్యమని విమర్శ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 20 : ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్‌ ‌భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. ప్రతి ఒక్కరు డబుల్‌ ఇం‌జిన్‌ ‌సర్కార్‌ ‌పేరుతో మాటలు చెప్పడమే తప్ప తెలంగాణ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. బీజేపీలో చేరినప్పటి నుంచి అవమానాలు ఎదుర్కొ న్నానని పేర్కొన్నారు. బీజేపీ బీసీల మనోభావాలకు విలువ లేకుండా చేసిందన్నారు. బీజేపీ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తుందని ధ్వజమెత్తారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్టాన్రికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చేస్తున్న తీవ్ర అన్యాయాన్ని, వివక్షను చూశాక ఆ పార్టీలో కొనసాగడంలో ఏమాత్రం అర్థం లేదని భావిస్తూ, భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. తెలంగాణ రాష్టాన్రికి అండగా ఉంటామంటు భారతీయ జనతా పార్టీ చేసిన వాగ్దానాలను నమ్మి ఆ పార్టీలో చేరడం జరిగింది.

అయితే మాజీ ఎమ్మెల్యేగా, సీనియర్‌ ‌నాయకునిగా రాజకీయాల్లో దాదాపు రెండున్నర దశాబ్దాల అనుభవం ఉన్న నాకు ఆ పార్టీలో చేరిన నాటి నుంచి అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. పార్టీలో నాలాంటి బీసీ నాయకులను పట్టించుకునే వారే లేరు. కేంద్రం నుంచి వచ్చిన ప్రధానమంత్రి నుంచి మొదలుకొని కేంద్ర మంత్రుల దాకా ప్రతి ఒక్కరు డబుల్‌ ఇం‌జన్‌ ‌సర్కార్‌ ‌పేరిట మాటలు చెప్పడమే కానీ ఇప్పటిదాకా ఒక్క పైసా అదనపు సహాయాన్ని తెలంగాణకు చేయకపోవడం, ఇక్కడ సర్కారు ఉంటేనే నిధులిస్తాము, అప్పటిదాకా తెలంగాణ ఇబ్బందులను పట్టించుకోమనట్లు కేంద్రం వ్యవహరిస్తున్న తీరు వారు, బిజెపి చెబుతున్న డబుల్‌ ఇం‌జన్‌ ‌సర్కారు మాడల్‌ ‌లోని డొల్లతనానికి అర్థం పడుతున్నది.గత రెండున్నర దశాబ్దాల తన రాజకీయ ప్రస్థానంలో బడుగు బలహీన వర్గాల ప్రయోజనాల కోసం కృషి చేశాను. భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత అనేక పర్యాయాలు కేంద్రంలో బలహీన వర్గాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ ‌వచ్చిన ప్రతిసారి ఎంతో ఆశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అశించాను.

కానీ ప్రతిసారి నిరాశను ఎదురైంది. దీంతోపాటు  నేతన్నల సమాజం భవిష్యత్తును సంక్షోభంలోకి నెట్టేలా, వారికున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేయడంతోపాటు, దేశం చరిత్రలో చేనేతపైన తొలిసారి పన్ను వేసిన కేంద్ర నిర్ణయం వెనక్కి తీసుకోవాలని చేసిన విజ్ఝప్తిని కేంద్రం పెడచెవిన పెట్టి, జియస్టిని భారీగా పెంచే కుట్రలు చేయడం బాధను కలిగిస్తున్నది. ఈ నిర్ణయాలతో పూర్వ నల్లగొండలోని వేలాది నేతన్నల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందన్నారు.

ఆధునిక భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అద్భుతంగా నిర్మించిన యాదాద్రి దేవాలయానికి ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదు.  మిషన్‌ ‌భగీరథ కార్యక్రమానికి ఒక్క రూపాయి ఇవ్వలేదు.  కోమటి రెడ్డి సొదరుల దుర్మార్గపు రాజకీయల నుంచి దూరంగా పోయేందుకే బిజెపిలో చేరాను. కానీ రాజగోపాల్‌ ‌రెడ్డి తన కాంట్రాక్టుల కోసం పార్టీ మారి బిజెపిలోకి వచ్చారు. అయన వేల కోట్ల అర్ధిక లాభం కోసం ఉపఎన్నిక తెచ్చి, బిజెపి పార్టీ బిసిల మనోభావాలకు విలువ లేకుండా చేసింది. రాజగోపాల్‌ ‌రెడ్డి రాజకీయాలకు వ్యతిరేకంగా బిజెపి పార్టికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

మునుగోడు వోటర్లకు  యాదాద్రి దర్శనం
ఆరగింపు సేవను నిలిపివేయడంపై విమర్శలు

యాదగిరిగుట్ట, అక్టోబర్‌20 :‌యాదగిరిగుట్టలో మునుగోడు వోటర్లకు  స్పెషల్‌ ‌దర్శనం వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఓటర్లను యాదగరిగుట్టకు తీసుకెళ్లిన ఎమ్మెల్యే జీవన్‌ ‌రెడ్డి.. స్వామివారి ఆరగింపు సేవను నిలిపివేయించి మరీ దర్శనం చేయించడంపై విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. ఉదయం 15 బస్సుల్లో ఆయన దండుమల్కాపురం గ్రామస్థులను ఆయన గుట్టకు తీసుకెళ్లారు.

అయితే వారు గుట్టపైకి చేరుకునే సరికి సమయం మధ్యాహ్నం 12గంటలు  అయింది. వాస్తవానికి మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి ఆరగింపు సేవ జరగాల్సి ఉండగా.. అధికారులు దాన్ని నిలిపేసి మరీ దండు మల్కాపురం ఓటర్లకు కుటుంబ సమేతంగా లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేయించారు. స్వామివారి సేవను నిలిపేసి మునుగోడు వోటర్లకు  దర్శనం చేయించిన అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

టిఆర్‌ఎస్‌లో చేరిన రాజగోపాల్‌ అనుచరులు
నల్లగొండ,అక్టోబర్‌20: ‌మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ ‌సమయం దగ్గర పడుతున్న కొద్ది బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డికి షాక్‌ల ద షాక్‌లు తగులుతున్నాయి. రాజగోపాల్‌ ‌రెడ్డి శిష్యులు పాల్వాయి గోవర్ధన్‌ ‌రెడ్డి, అయితగోని విజయ్‌ ‌షాకిచ్చారు. రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖ మంత్రి జగదీశ్‌ ‌రెడ్డి ఆధ్వర్యంలో గోవర్ధన్‌ ‌రెడ్డి, విజయ్‌ ‌టీఆర్‌ఎస్‌ ‌పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ ‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ‌రాష్ట్ర నాయకులు వేమిరెడ్డి నరసింహారెడ్డి, సూర్యాపేట జిల్లా పరిషత్‌ ‌వైస్‌ ‌చైర్మన్‌ ‌గోపగాని వెంకట్‌ ‌నారాయణ గౌడ్‌ ‌పాల్గొన్నారు.ఇక ఆరు నెలల క్రితం బీజేపీలో చేరిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్‌ ఆ ‌పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు భిక్షమయ్య గౌడ్‌ ‌బహిరంగ లేఖ విడుదల చేశారు. బీజేపీ పార్టీ బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణకు రూపాయి సాయం కూడా చేయలేదని మండిపడ్డారు.

Leave a Reply