- తీవ్రoగా మారడానికి ముందే అణచివేయాలి
- ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
- 132 దేశాల్లో గుర్తించామని వెల్లడి
కొరోనా డెల్టా వేరియంట్ మరింత తీవ్రగా మారడానికి కన్నా ముందే అణచివేయాలని మహమ్మారి ప్రపంచాన్ని హెచ్చరిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది. తొలుత భారత్లో వెలుగు చూసిన ఈ మ్యూటెంట్ ..అత్యంత వేగంగా ప్రసారమౌతుందని, ఇప్పటికే 132 దేశాలను తాకిందని పేర్కొంది. ‘డెల్టా వైరస్ అభివృద్ధి చెందుతూ హెచ్చరిస్తుంది. కానీ మరింత ప్రమాదకరమైన వేరియంట్లు వెలుగు చూడక ముందే మనం తగిన చర్యలు తీసుకోవాలని’ డబ్ల్యూహెచ్ఒ అత్యవసర డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ అన్నారు. వ్యాక్సినేషన్ తప్ప కొరోనా నుంచి తప్పించుకునేందుకు మరో ఉపాయం లేదన్నారు. వైరస్ను అడ్డుకునేందుకు అందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. అనేక దేశాలను కొరోనా కుదిపిస్తేన్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నియంత్రించేందుకు తొలి నుండి అమలు చేస్తున్న వాటిని కొనసాగించాలని, అవే భౌతిక దూరం, మాస్క్లు ధరించడం, రద్దీ ప్రాంతాల్లో జన సమూహం ఎక్కువగా లేకుండా చూడటం వంటి చేయాలని అన్నారు.
ఇప్పటి వరకూ నాలుగు కొత్త వేరియంట్లను గుర్తించామని డబ్ల్యుహెచ్ఒ చీఫ్ టెడ్రోస్ అథనామ్ అన్నారు. కొరోనా వైరస్ ఉన్నంత కాలం కొత్త వేరియంట్లు పుట్టక తప్పదని పేర్కొన్నారు. డబ్ల్యుహచ్ఒ పరిధిలోని ఆరింటిలోని ఐదు ప్రాంతాలు గత నాలుగు వారాల్లో 80 శాతం కేసులు పెరిగాయన్నారు. కొరోనా వైరస్ కొత్త వేరియంట్లు, వ్యాక్సినేషన్లో జాప్యంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వివిధ దేశాలను హెచ్చరించింది. అలాగే డెల్టా వేరియంట్ వ్యాప్తిపై కూడా హెచ్చరికలు జారీ చేసింది. డబ్ల్యూహెచ్ఓ అత్యవసర డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ మాట్లాడుతూ డెల్టావేరియంట్ 132 దేశాల్లోకి ప్రవేశించిందని, భారత్లో ఈ వేరియంట్ తొలిసారిగా కనిపించిందన్నారు. ఇది అత్యంత వేగంగా వ్యాపిస్తున్నదని హెచ్చరించారు. దీనిపై అప్రమత్తం అయ్యేలోగానే కొన్ని ప్రమాదకర వేరియంట్లు బయటపడుతున్నాయన్నారు. వీటిని అడ్డుకునేందుకు అందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. ఇప్పటివరకూ నాలుగు కొత్త వేరియంట్లను గుర్తించామన్నారు. ఈ వేరియంట్లను అడ్డుకోవడానికి ప్రజలంతా ఫిజికల్ డిస్టెన్సింగ్, మాస్క్ ధరించడం, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం, వెంటి లేషన్ బాగా ఉండే ప్రాంతాల్లో ఉండటం ఎంతో అవసరమన్నారు.