ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయించాలి కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు

పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి ఆల్బెండజోల్ గోలీలు తప్పనిసరిగా వేయించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినాన్ని పురస్కరించుకొని సోమవారం హసన్‌పర్తి మండలంలో ప్రభుత్వ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒకటి నుండి 19 సంవత్సరాలలోపు పిల్లలందరు కూడా వారు యాక్టివ్‌గా, ఆరోగ్యంగా ఉండడానికి పోషకాహార లోపంతో బాధ పడకుండా ఉండడానికి ఈ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు, పాధ్యా యులకు, విద్యాసంస్థల యాజమాన్యాలకు, అంగన్వాడీ కార్యకర్తలకు ఏఎన్‌ఎంలకు సూచించారు. 10వ తేదీన ఎవరికైనా మిస్ అయితే 17వ తేదీన ఈ మాత్రలు వేయించాలని ఆదేశించారు. అంగన్వాడీ, ప్రభుత్వ ప్రవేటు ప్రాథమిక, జూనియర్ కళాశాల స్థాయి విధ్యరిని విద్యార్థులు మొత్తం 2 లక్షల 85 వేల 955 మంది కి ప్రయోజనం పొందుతారని చెప్పారు. అసలు నులి పురుగులు శరీరంలో చేరకుండా జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యవంతంగా ఉండేందుకు తల్లిదండ్రులు పిల్లలు కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. పిల్లలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండాలన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి లలిత దేవి మాట్లాడుతూ నులి పురుగులు నివారణకు అందరి సహకారం అవసరమని ముఖ్యంగా నట్టాల నివరుంచినప్పుడే పిల్లల శారీరక ఎదుగుదలతో పాటు ఆరోగ్యకరమైన సమస్యలకు దూరంగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. అల్బెండజోల్ మాత్రలతో పాటుగా బోదకాలు వ్యాధి నివారణకోసం ధర్మసాగర్ ఐనవిలు పి హెచ్ సి పరిధిలో డిఇసి మందులను కూడా వేస్తామని ఆమె తెలియజేసారు. జిల్లా విద్యాశాఖాధికారి నారాయణరెడ్డి మాట్లాడుతూ నట్టల మందు నివారణలో పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. అన్ని ప్రాథమిక పాఠశాలలో పిల్లలందరికీ అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వరలక్ష్మి రాష్ట్ర పరిశీలకులు శ్రీరామ, గురుకుల ప్రిన్సిపాల్ అశోక్‌రెడ్డి, డాక్టర్ గీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.