ఫిబ్రవరి 10న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని 1-19 సంవత్సరాల వయస్సు గల వారందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు ఆల్బెండజోల్ వేయించాలని వరంగల్ రూరల్ కలెక్టర్ హరిత తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ చల్లా మధుసూదన్, జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారుల అనారోగ్యానికి కారణమవుతున్న నులిపురుగుల నిర్మూలనతో రక్తహీనత, కడుపునొప్పి, శారీరక పెరుగుదల తగ్గడం, బుద్దిమాంద్యం, తదితర సమస్యలు దూరమవుతాయన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాలలో, ప్రభుత్వ, ఎయిడెడ్ ప్రైవేట్ కళాశాలలోని విద్యార్థులకు వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్యామనీరజ, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సుధీర్, ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ సుమలత, సూపరింటెండెంట్ డాక్టర్ పి.గోపాల్, డాక్టర్ సంజీవయ్య, చిన్నయ్య, మోహన్‌రావు, స్వరూపారాణి, రాజు, శ్రీనివాస్, విజేందర్, కుమార్‌లు పాల్గొన్నారు.
Tags: Program Officer Dr. Shamiraja, Program Officer Dr. Sudhir, Education Department, Sumalatha, Superintendent Dr. P. Gopal, Doctor