Take a fresh look at your lifestyle.

అల.. !!

సాధుత్వానికి ప్రతీక స్త్రీమూర్తి..
పురుషాధిక్య ప్రపంచంలో
వెలుగుల అంతర్వాహిని ఆమె
పురుష విజయాల తెరవెనుక
రహస్యం !
భారతీయ కుటుంబ వ్యవస్థ
అంతఃసూత్రం !
లాలిత్యం సుగుణగుణం
మెండుగా కల్గిన భూజాత
ఒక చేత్తో కుటుంబాన్ని
మరో చేత్తో విద్యుక్త ధర్మాన్ని
సమర్థంగా నడుపుతున్న
విజయసారథి !
సహనం సమభావం సౌశీల్యం
ఆభరాణులుగా రాణించే రాణి !
ఇవన్నీ నాణానికి ఒకవైపు..
మరి రెండో వైపు?
దుర్మదాంధుల చేతుల్లో
విధివంచిత ఆమె
మనుగడే కష్టమైన మానవతి
ప్రాణ సమానమైన
శీలం సరేసరి..
ప్రాణాలే గాల్లో దీపాలై
బతుకీడుస్తోన్న అభాగిని
కష్టాలకెదురీదుతోన్న కారుణ్యమూర్తి
ఆధునిక ప్రపంచం ఆమె పాలిట
పాపాల కీకారణ్యం !
ఏ క్రూరమృగం ఎప్పుడెలా
కబళిస్తుందో ఏ గుంటనక్కలెలా
కాపేసి కాటికంపుతాయో
అర్థంకాని విధివిలాసం !
కష్టాల కడలి నుండి నిత్యం
ఒడ్డుకు తలకొట్టుకు విలపించే
సంద్రపు అలే నేటి స్త్రీమూర్తి.. !!

భీమవరపు పురుషోత్తం
9949800253

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply