ప్రతి రోజూ నేను చూసేవే అవి
నన్ను వెక్కిరిస్తుంటే
ఏం చేయాలో తెలియక
తికమక పడుతున్నా..
భారం నిండిన గుండెతో..
బరువైన ఆలోచనలతో…
నేను చూసిన ప్రతిదీ
నా నుంచి సమాధానం కోరుతున్నట్లు అనిపించేది
అందుకే వాటి వంక నేను చూడకుండానే
నా మొహాన్ని చాటేస్తున్నాను!
అసలు ఈ లోకమంతా వాటితోనే ఉంది
అసలు వాటి మీదే నడుస్తుందని
నేను తెలుసుకునే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది!
నేను వాటిని అశ్రద్ధ చేశాను
పాపం వాటి తప్పేమీ లేదు
నేను ఎప్పుడెప్పుడు వాటిని
చూస్తానా, వాటిని ఉపయోగిస్తానా
అంటూ ఎదురు చూస్తూ ఉండేవి
ఇప్పుడు అవి లేకపోవడం వల్ల
నేను నా గుర్తింపును కోల్పోయాను!
అయినా ఏమీ అధైర్య పడలేదు
వయసు మీద పడిందని బాధపడలేదు
పట్టుదలతో వాటిని సాధించాను
నా లక్ష్యం నేను చేరుకున్నాను !
ధన్యవాదాలు అక్షరాల్లారా!
ప్రపంచాన్నే ముందుకు నడిపించే దిక్సూచిల్లారా!!
– ఏడుకొండలు కళ్ళేపల్లి,
మచిలీపట్నం, 9490832338