Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో అకాల వర్ష బీభత్సం

ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో అతలాకుతలం

పలుచోట్ల దెబ్బతిన్న మామిడి తోటలు

కొట్టుకు పోయిన కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం

పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు..రెండు కాడెద్దులు..43 మేకలు మృతి

నగరాన్ని ముంచెత్తిన వాన…లోతట్టు ప్రాంతాలు జలమయం

ఉమ్మడి జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరికి గాయాలు ..పలుచోట్ల తడిసి ముద్దయిన ధాన్యం

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోతకు వొచ్చిన పంటలకు భారీనష్టం…దెబ్బతిన్న మామిడి తోటలు

యాదాద్రిలో దంచికొట్టిన వాన…పనుల్లో నాణ్యాతలోపాలు బట్టబయలు

ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో పలుచోట్ల తడిసిన ధాన్యం…పలు గ్రామాల్లో నేలరాలిన మామిడి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 4 : రాష్ట్రంలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. హైదరాబాద్‌లోనూ భారీ వర్షం కురిసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో బుధవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడినన వాన అతలాకుతలం చేసింది. జోరుగా వీచిన ఈదురు గాలులతో పలుచోట్ల చెట్లు, ప్లెక్సీలు విరిగి పడ్డాయి. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. అన్నదాత చేతికి వొచ్చిన వరిధాన్యం నేలపాలయ్యింది. పలుచోట్ల మామిడి తోటలు దెబ్బతిన్నాయి. చేతికి వచ్చిన పంట నేలరాలింది. కొన్ని చోట్ల కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దకాగా, కొన్నిచోట్ల వాననీటిలో కొట్టుకుపోయింది. తెల్లవారు జామున కురిసిన అకాల వర్షం ముఖ్యంగా అన్నదాతలకు తీరని నష్టం తెచ్చిపెట్టింది. భారీ వర్షాలకు చల లోని పంటలు నేలకొరిగాయి. ఈదురు గాలులకు పలుచోట్ల చెట్లు విరిగిపడగా, విద్యుత్‌ ‌స్తంభాలు నేలకొరిగాయి. నల్లగొండ, సిద్దిపేట, జగిత్యాల జిల్లాల్లో పిడుగులు పడటంతో ఇద్దరు మరణించగా, రెండు కాడెద్దులు, 43 మేకలు మృతిచెందాయి.

మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌ ‌మండలం మోదిని గూడెంలో పిడుగుపాటుకు లింగస్వామి అనే వ్యక్తి మృతిచెందాడు. అదేవిధంగా సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మండలం నరేండ్లగడ్లలో పిడుగుపడి రైతు మరణించాడు. ధాన్యంపై టార్పాలిన్‌ ‌కప్పుతుండగా పిడుగుపడి పోచయ్య మృతిచెందగా, మరో రైతు తీవ్రంగా గాయపడ్డాడు. మద్దూరు మండలంలోని వంగపల్లిలో ఎర్రబచ్చల బిక్షపతి అనే రైతుకు చెందిన రెండు కాడెద్దులు పిడుగుపాటుకు మరణించాయి. వీటివిలువ సుమారు రూ.లక్షా 50 వేలు ఉంటుందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ ‌నగరాన్ని వర్షం ముంచెత్తింది. ఈదురు గాలులతో పలుచోట్ల చెట్లు, ప్లెక్సీలు విరిగిపడ్డాయి. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తెలంగాణ వి•దుగా ఉపరితల ద్రోణి ఆవరించి ఉన్నదని దీని ప్రభావంతో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని తెలిపింది. కాగా, హైదరాబాద్‌ ‌తోపాటు నల్లగొండ, యాదాద్రి భువనగిరి, మెదక్‌, ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లాల్లో ఈదురు గాలులతో కూడి వర్షం బీభత్సం సృష్టించింది. హైదరాబాద్‌లో తెల్లవారు జామున ప్రారంభమైన వాన గంటపాటు దంచి కొట్టింది. అత్యధికంగా సీతాఫల్‌మండిలో 7.2 సెంటీవి•టర్ల వర్షపాతం నమోదయింది. ఇక బన్సీలాల్‌పేటలో 6.7, వెస్ట్ ‌మారేడుపల్లిలో 6.1, అల్వాల్‌లో 5.9, ఎల్బీనగర్‌లో 5.8, బాలానగర్‌లో 5.4, ఏఎస్‌రావ్‌ ‌నగర్‌లో 5.1, బేగంపేట పాటిగడ్డలో 4.9, మల్కాజ్‌గిరిలో 4.7, ఫలక్‌నుమాలో 4.6, గన్‌ఫౌండ్రీలో 4.4, కాచిగూడ, సికింద్రాబాద్‌లో 4.3, చార్మినార్‌లో 4.2, గుడిమల్కాపూర్‌, ‌నాచారంలో 4.1, అంబర్‌పేటలో 4, అవి•ర్‌పేట, సంతోష్‌నగర్‌లో 3.7, ఖైరతాబాద్‌లో 3.6, బేగంబజార్‌, ‌హయత్‌నగర్‌, ‌చిలుకానగర్‌లో 3.5 సెంటీవి•టర్ల చొప్పున వర్షం కురిసింది. సైదాబాద్‌, ‌చంపాపేట్‌, ‌సరూర్‌నగర్‌, ‌నాగోల్‌, ‌వనస్థలిపురం, తుర్కయంజాల్‌, ‌పెద్దఅంబర్‌పేట, అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం, తిరుమలగిరి, అల్వాల్‌, ‌కంటోన్మెట్‌, ‌మల్కాజిగిరి, ముషీరాబాద్‌, ‌నాగోల్‌, ‌జగద్గిరిగుట్ట, కూకట్‌పల్లిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం, కుషాయిగూడ, ఈసీఐఎల్‌, ‌కాప్రాలో ఉరుములతోకూడి భారీ వర్షం కురిసింది. భారీవర్షంతో ఎల్బీనగర్‌, ‌కొత్తపేట్‌ ‌రైతుబజార్‌, ‌చైతన్యపురి, మలక్‌పేట్‌ ‌గంజ్‌, ఉస్మానియా మెడికల్‌ ‌కాలేజీ, మారేడ్‌పల్లి, ఖైరతాబాద్‌, ‌పంజాగుట్ట, అవి•ర్‌పేట్‌, ‌బంజారాహిల్స్, ‌రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, ‌కిస్మత్‌పూర్‌లో రోడ్లు జలమయ మయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. వర్షానికి ఈదురుగాలులు తోడవడంతో మియాపూర్‌, ‌దిల్‌సుఖ్‌నగర్‌, ‌చైతన్యపురి, కొత్తపేట్‌, ‌రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, ‌కిస్మత్‌పూర్‌లో ముందుజాగ్రత్తగా అధికారులు విద్యుత్‌ ‌సరఫరా నిలిపివేశారు. యూసుఫ్‌గూడ, మైత్రివనం స్టేట్‌హోమ్‌, ‌చాదర్‌ఘాట్‌ ‌పోలీస్‌స్టేషన్‌ ‌వద్ద రోడ్డుపై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.గత కొన్ని రోజులుగా ఎండవేడిమితో అల్లాడుతున్న నగర ప్రజలకు ఈ వర్షంతో ఒక్కసారిగా ఉపశమనం లభించింది. నేడు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి రోడ్లపై పడిపోయాయి. ముందుజాగ్రత్త చర్యగా అధికారులు విద్యుత్‌ ‌నిలిపివేశారు. కాగా, ఒక్కసారిగా వాన కురియడంతో జీహెచ్‌ఎం‌సీ అధికారులు అప్రమత్తమయ్యారు. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో జిహెచ్‌ఎం‌సి సిబ్బంది వెంటనే రంగంలోకి దిగిసహాయక చర్యలను ముమ్మరం చేసింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దవడంతో.. రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. భారీ వర్షానికి రహదారులు చెరువులను తలపించాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ ‌సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

నగరాన్ని ముంచెత్తిన వాన…లోతట్టు ప్రాంతాలు జలమయం

హైదరాబాద్‌ ‌నగరంలో బుధవారం ఉదయం భారీ వర్షం బీభత్సం సృష్టించింది. గంటసేపు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో నగర వాసులు ఇళ్ల నుంచి బయటికి రాలేకపోయారు. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. ముఖ్యంగా నగరంలోని పాతబస్తీని వర్షం కుదిపేసింది. యాకుత్‌పురా నియోజకవర్గంలోని మదీనానగర్‌, ‌ధోభీ ఘాట్‌ ‌తదితర లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. బహదూర్‌పురా నియోజకవర్గంలోని మక్కాకాలనీలో భారీగా నీరు చేరింది. యష్రప్‌నగర్‌ ‌ముంపు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. ముంపు ప్రాంతాల్లో యాకుత్‌పురా ఎమ్మెల్యే పాషా ఖాద్రి, జడ్సీ సామ్రాట్‌ ‌పర్యటించారు. వరదనీటిలో ట్యూబ్‌ ‌బోటు సాయంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు హైదర్‌గూడ నుంచి బషీర్‌బాగ్‌ ‌వైపు రాకపోకలు నిలిచిపోయాయి. ఉదయం కురిసిన భారీ వర్షానికి రోడ్లపై వరద నీరు పొంగి పోర్లుతుండటంలో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. డ్రైనేజీల్లో నీరు పొంగి పొర్లు తుండటంతో జీహెచ్‌ఎం‌సీ సిబ్బంది పూడికతీత పనులు చేపట్టారు. పలు ప్రాంతాల్లో కురిసిన భారీవర్షంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంట పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లపై భారీగా చేరిన వరదనీటితో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పోలీసు కమిషనర్‌ ‌కార్యాలయ సవి•పంలోని హైదర్‌ ‌గూడ రహదారిపై భారీగా నీరు చేరడంతో… కార్లు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. హైదర్‌గూడ నుంచి బషీర్‌బాగ్‌ ‌వైపు రాకపోకలు నిలిచిపోయాయి. బషీర్‌ ‌బాగ్‌లో రహదారిపై చెట్ల కొమ్మలు విరిగిపడటంతో పాటు.. లా కళాశాల ఎదుట రోడ్లపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో బాటసారులు ఇబ్బందులు పడ్డారు. సూరారం ప్రధాన రహదారిపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. సాగర్‌ ‌రింగ్‌ ‌రోడ్‌ ‌కాకతీయ కాలనీలో ఓ స్కూటీ వరదకు కొట్టుకొచ్చింది. వి•ర్‌పేటలో లెనిన్‌ ‌నగర్‌ ‌నీట మునగగా.. ఇళ్లలోకి వర్షపు నీరు రావడంతో స్థానికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఆల్వాల్‌లో కాలనీలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రహదారులపై భారీగా వర్షపు నీరు చేరడంతో జీహెచ్‌ఎం‌సీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పాతబస్తీలో చార్మినార్‌, ‌హుస్సేని అలం, షా అలీ బండ ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. భారీ వర్షాల దృష్ట్యా చార్మినార్‌ ‌జోనల్‌ ‌కమిషనర్‌తో ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మాట్లాడారు. వర్షాలకు పలు ప్రాంతాలు నీటమునిగినట్లు తెలిపారు. నీటమునిగిన ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టాలని కమిషనర్‌ను కోరారు. కాలనీల్లోకి భారీగా వరద చేరడంతో బోటు సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నట్లు స్థానికులు తెలిపారు.
ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరికి గాయాలు ..పలుచోట్ల తడిసి ముద్దయిన ధాన్యం
ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లాలో వాన బీభత్సం సృష్టించింది. బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వానతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. వానకు ఈదురుగాలులు తోడవడంతో పలుప్రాంతాల్లో విద్యుత్‌ ‌నిలిచిపోయింది, మామిడి నేలరాలింది. కరెంట్‌ ‌స్తంభాలు విరిగిపోయాయి. జగిత్యాలలో పిడుగుపాటుకు ఇద్దరు గాయపడగా, 43 మేకలు మృతిచెందాయి. ఉమ్మడి జిల్లాలోని బీర్పూర్‌, ‌వెల్గటూర్‌, ‌గొల్లపల్లి, కోనరావుపేట, గోదావరిఖని, గంగాధర, మానకొండూరు, రామడుగు మండలాల్లో భారీగా వర్షం కురిసింది. బీర్పూర్‌ ‌మండలంలో పలుచోట్ల విద్యుత్‌ ‌స్తంభాలు నేలకూలాయి. పెద్దపల్లి జిల్లాలో మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్‌ ‌మండలాల్లో భారీ వాన కురిసింది. తెల్లవారుజామున కురిసిన వర్షానికి మంథని, పెద్దపల్లిలోని మార్కెట్‌ ‌యార్డుల్లో, పలు కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసిపోయింది. జగిత్యాల జిల్లా ధర్మపురి, బుగ్గారం, సారంగాపూర్‌, ‌మల్యాల మండలంలో జోరుగా వానపడింది. మల్యాల మండలం బల్వంతాపూర్‌లో పిడుగుపడి ఇద్దరికి గాయాలయ్యాయి. ఇక ఉమ్మడి ఆదిలాబాద్‌ ‌జిల్లాలో కుండపోతగా వర్షం కురిసింది. కుమ్రం భీమ్‌, ‌మంచిర్యాలలో భారీ వానపడింది. మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలో ఈదురు గాలులతో మామిడి కాయలు రాలిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వడ్లు వాన నీటిలో కొట్టుకుపోయాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోతకు వొచ్చిన పంటలకు భారీనష్టం…దెబ్బతిన్న మామిడి తోటలు
ఉమ్మడి నల్లగొండ  జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో భారీగా వర్షం కురియడంతో పంటపొలాల్లో ధాన్యం నేలరాలింది. తెల్లవారుజామున 5.45 గంటల నుంచి మొదలైన వర్షం ఎడతెరపి లేకుండా కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. తిప్పర్తిలో 9.8 సెంటీవి•టర్ల వర్షపాతం నమోదవగా, త్రిపురారంలో 9.3, నార్కట్‌పల్లిలో 8.8, నిడమనూరు, అనుముల, మిర్యాలగూడ, పెద్దవూర, చిట్యాల, చండూరు, మునుగోడు మండలాల్లో భారీ వర్షం నమోదయింది. కాగా, భారీ వర్షానికి పలు మండలాల్లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. ఐకేపీ సెంటర్లలో ముమ్మరంగా కొనుగోళ్లు జరుగుతుండగా ధాన్యం పెద్ద ఎత్తున కేంద్రాలకు వస్తుంది. ఇప్పటికే కొనుగోలు చేసినదానితో పాటు, కేంద్రాల వద్ద ఇంకా కొనుగోలు చేయాల్సిన ధాన్యం కూడా భారీగానే ఉన్నది. ఇక కోతకు సిద్ధంగా వరి చేలలో  చేను నేలబారి వడ్లు రాలే ప్రమాదం ఉన్నది. భారీ వర్షంతో భువనగిరి పట్టణం జలమయమయింది.
ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో పలుచోట్ల తడిసిన ధాన్యం…పలు గ్రామాల్లో నేలరాలినమామిడి

మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు గాలి వాన వరంగల్‌ ‌జిల్లాలో అన్నదాతలను ఆగం చేసింది. చేతికందిన పంట నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేదని.. సకాలంలో కొనుగోళ్లు జరపడం లేదని వాపోయారు. వర్ధన్నపేట సహా రాయపర్తి, సంగెం, పర్వతగిరి, ఐనవోలు మండలాల్లో కోత దశలో ఉన్న మామిడి కాయలు నేల రాలిపోయాయి. వరి, మొక్కజొన్న రైతులు అకాల వర్షం కారణంగా తీవ్రంగా నష్టపోయారు. అటు నర్సంపేట వ్యాప్తంగా కురిసిన వర్షాలకు వరి, మామిడి, మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు

ఉమ్మడి మెదక్‌లోనూ వర్షబీభత్సం…తడిసిన ధాన్యం

ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలోనూ వర్షం బీభత్సం సృష్టించింది. నర్సాపూర్‌ ‌నియోజక వర్గంలో కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసి ముద్దయింది. నర్సాపూర్‌ ‌పట్టణ సవి•పంలో గల మార్కెట్‌ ‌కమిటీలో మంగళవారం రాత్రి వర్షం వొచ్చే సూచన ఉండడంతో రెండు గంటల వరకు మేల్కొని కవర్లు కప్పి నిద్ర పోయారు. మూడు గంటల ప్రాంతంలో వర్షం రావడంతో రైతులు ఏమీ చేయలేకపోయారు. కవర్లు కప్పినా వరదనీరు కింది నుంచి రావడంతో ధాన్యం తడిసి ముద్దయింది. దుబ్బాక, సిద్దిపేట, పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి మోస్తరు వర్షం కురిసింది. వర్షానికి కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యం తడిసి ముద్దయింది. అకాల వర్షానికి ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్సింది. దుబ్బాక నియోజకవర్గంలోని నరేండ్లగడ్డ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పపై టార్పాలిన్‌ ‌కప్పుతుండగా పిడుగుపడి రైతు పోచయ్య(65) మృతి చెందారు. మరో రైతు కొండయ్య విద్యుదాఘాతానికి గురవ్వడంతో దుబ్బాక ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. మరోవైపు నల్గొండ జిల్లావ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. పలు మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. .

 

Leave a Reply