Take a fresh look at your lifestyle.

యాజమాన్యానికి ఏఐటియుసి యాజమాన్యానికి ఏఐటియుసి బినామా ??

మందమర్రి, మే 9, ప్రజాతంత్ర విలేఖరి : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ‌మహమ్మారి కట్టడి కోసం దేశంలో అన్ని పరిశ్రమలకు లాక్‌డౌన్‌ ‌ప్రకటించి, పూర్తి వేతనాలు చెల్లించిందని, సింగరేణిని కాలరీస్‌ను మాత్రం లే ఆఫ్‌ ‌ప్రకటించి సగం జీతం ఇస్తుందని,ఆయన తెలిపారు. అందులో భాగంగా సింగరేణి కాలరీస్‌ను లేఆప్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గత 45 రోజులుగా లే ఆఫ్‌ ‌కొనసాగుతుంది.కనుక 45 రోజులకు మించి నడవకూడదు అనే ఉద్దేశంతో సింగరేణి యాజమాన్యం లాక్‌డౌన్‌ ‌ప్రకటించాల్సి ఉండగా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు యాజమాన్యానికి బీమామీలుగా మారి తమ ఉనికిని చాటుకునేందుకు కార్మికులు లే ఆఫ్‌ను వదిలేసి విధులకు రావాల్సిందిగా ప్రకటనలు చేస్తూ సింగరేణి యాజమ్యానానికి బీనామీలుగా మారారని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పార్వతి రాజిరెడ్డి మండిపడ్డారు. శనివారం విలేఖరులతో మాట్లాడుతూ కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకోని దేశంలోని బొగ్గు గనులను అన్నింట్లో కేంద్ర ప్రభుత్వం లేఆప్‌ను ప్రకటించింది. సింగరేణిలో లేఆప్‌ను ప్రకటించడానికి కారణం మేము అంటూ ప్రాతినిధ్య గుర్తింపు సంఘాలు సంకలు గుద్దుకొవడం సిగ్గుచేటని ఆయన ఎద్దేవా చేశారు.

సింగరేణి యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ కార్మికులు విధులకు హాజరవుతారని డెలిగేట్స్‌కి సమాచారం పంపడం పట్ల అంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. సింగరేణి యాజమాన్యం కోరనా వైరస్‌ని దృష్టిలో పెట్టుకోని మరికొంత కాలం లాక్‌డౌన్‌ను పొడగించి సింగరేణి సంస్థను లాక్‌డౌన్‌గా ప్రకటించాలని ఆయన సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్‌ ‌చేశారు. ఇప్పటికైనా ఏఐటియుసి ఆడుతున్న  నాటకాన్ని కార్మికుల గుర్తించాలని ఏఐటియుసికి కార్మికుల పట్ల చిత్తశుద్ధి లేదని, తమ ఉనికిని చాటుకుంటూ డబ్బులు సంపాదించుకోవాలని దురుద్దేశంతో సింగరేణి యాజమాన్యానికి ఏఐటియుసి కార్మిక సంఘం తొత్తుగా మారిందని ఆయన విమర్శించారు. సింగరేణి ప్రాతినిధ్యంలో చలామణి అవుతున్న కార్మిక సంఘం యాజమాన్యం వేసేఎంగిలి మెతుకులకు ఆశపడి పోరాడి తెచ్చుకున్న హక్కులను కాలరాస్తూ కంపెనీకి తాకట్టు పెట్టి లక్షల రూపాయాలు దండుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రాతినిధ్యం గుర్తింపు సంఘాలు కళ్ళు తెరిచి కార్మికుల పక్షాన నిలిచి కార్మికులకు న్యాయం జరిగేలా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రకార్యదర్శి కామెర గట్టయ్య, రాష్ట్ర నాయకులు దాసరి జనార్థన్‌, ఎంఎఫ్‌ ‌బేగ్‌, ‌దీవి సత్యం, కాసర్ల ప్రసాద్‌ ‌రెడ్డి, గుడిసెల శ్రీహరి,నోముల శ్రీనివాస్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply