Take a fresh look at your lifestyle.

భారత్‌, ‌గుయాన మధ్య వాయు సేవలు

హైదరాబాద్‌, ‌పిఐబి, ఫిబ్రవరి 22 : భారతదేశ ప్రభుత్వానికి మరియు గుయాన సహకార గణతంత్ర ప్రభుత్వానికి మధ్య వాయు సేవల ఒప్పందంపై సంతకాలు చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదాన్ని తెలియ జేసింది. ఈ ఒప్పందంలో చేరేందుకు గాను అవసరమైన ఆంతరంగిక ప్రక్రియను పూర్తి చేసినట్లుగా ప్రతి ఒక్క పక్షం రూఢి చేస్తూ తత్సంబంధిత దౌత్య పత్రాలను ఇచ్చిపుచ్చుకున్న అనంతర కాలంలో వాయు సేవల ఒప్పందం అమలులోకి వొస్తుంది. గుయానలో భారతదేశానికి చెందిన వారు చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు. 2012వ సంవత్సరం జన గణన ప్రకారం జనాభాలో దాదాపుగా 40 శాతం లెక్కకు వొచ్చేటటువంటి అతి పెద్ద నిర్దిష్ట జాతీయ సమూహంగా కూడా వారు ఉన్నారు.

గుయానతో వాయు సేవల ఒప్పందంపై సంతకాలు చేయడం వల్ల రెండు దేశాల మధ్య వాయు మార్గ సేవల ఏర్పాటుకు ఒక రూపు రేఖ సిద్ధం కాగలదు. విమాన యానం మార్కెట్‌ అం‌తకంతకు పెరుగుతూ ఉండడం, భారతదేశంలో విమాన యాన రంగంలో సంస్కరణలను చేపట్టిన తరువాత, అంతర్జాతీయ వాయు సంధానం కోసం మార్గాన్ని సుగమం చేయడానికని అనేక దేశాలతో వాయు సేవల సంబంధిత ఒప్పందంపై సంతకాలు చేయడం జరిగింది. ఎయర్‌ ‌సర్వీసెస్‌ అ‌గ్రీమెంట్‌ (ఎఎస్‌ఎ) ఇరు దేశాల మధ్య వాయు మార్గ కార్యకలాపాల కోసం ఒక చట్టపరమైన నియమావళి రంగాన్ని సిద్ధం చేస్తుంది. ఇది దేశాల సార్వభౌమత్వం, విమాన యాన సంస్థల జాతీయత మరియు ప్రతి ఒక్క పక్షానికి చెందిన నిర్దిష్ట ఎయర్‌ ‌లైన్స్‌కు వాణిజ్య అవకాశాల ఆదాన ప్రదానం సంబంధిత సిద్ధాంతాల పైన ఆధారపడుతుంది. వర్తమానంలో భారత ప్రభుత్వానికి, గుయాన ప్రభుత్వానికి మధ్య ఎటువంటి ఎయర్‌ ‌సర్వీసెస్‌ అ‌గ్రిమెంట్‌ (ఎఎస్‌ఎ) అనేది లేదు.

భారతదేశం, గుయానలు కన్‌ ‌వెన్శన్‌ ఆన్‌ ఇం‌టర్‌ ‌నేశనల్‌ ‌సివిల్‌ ఏవియేశన్‌ (‌చికాగో కన్‌ ‌వెన్శన్‌) ‌యొక్క సంతకం దారు దేశాలుగా ఉన్నాయి. భారత ప్రభుత్వం, గుయాన ప్రభుత్వంల ప్రతినిధి వర్గాలు ఐసిఎఒ ఎయర్‌ ‌సర్వీసెస్‌ ‌సంప్రదింపుల కార్యక్రమం జరిగిన కాలంలో అంటే 2016వ సంవత్సరంలో డిసెంబర్‌ 6 ‌వ తేదీ నాడు బహామాస్‌లోని నసావులో కలుసుకొన్నాయి. ఆ సందర్భంలో భారతదేశానికి, గుయానాకి మధ్య 2016వ సంవత్సరం డిసెంబర్‌ 06‌న జరిగిన అవగాహన పూర్వక ఒప్పందం ప్రకారం రెండు దేశాల మధ్య నిర్ధారిత వాయు సేవలకై ఎఎస్‌ఎ ‌యొక్క ప్రచురిత దస్తావేజులను దాఖలు చేశాయి. భారతదేశానికి, గుయానాకు మధ్య కొత్త వాయు సేవల ఒప్పందం ఇరు పక్షాల విమాన రవాణాదారు సంస్థలకు వాణిజ్య పరమైన అవకాశాలను అందిస్తూనే, అంతరాయానికి తావు ఉండనటువంటి సంధానానికి అనువైన వాతావరణాన్ని కల్పించగలదు.

Leave a Reply