Take a fresh look at your lifestyle.

‘‌టాటా’ల చేతికి ఎయిర్‌ ఇం‌డియా

బిడ్‌ ‌సమర్పించిన టాటా సన్స్
‌కేంద్ర ఆర్థిక శాఖ అనుమతే తరువాయి

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 1 : ‌నష్టాల్లో ఉన్న ఎయిర్‌ ఇం‌డియాను టాటా సన్స్ ‌టేకోవర్‌ ‌చేసుకోనుంది. దీనిని ఇప్పటికే కేంద్రం అమ్మకానికి పెట్టింది. పలు సంస్ళను అమ్మకానకి పెట్టిన క్రమంలో ఎయిర్‌ ఇం‌డియాను కూడా వదిలించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలో ఎయిర్‌ ఇం‌డియా ప్రైవేటీ కరణ కోసం సమర్పించిన బిడ్స్‌ను టాటా సన్స్ ‌గెలుచుకున్నట్లు తెలుస్తోంది. అయితే కేంద్ర ఆర్థిక శాఖ త్వరలో దీనిపై తుది ప్రకటన చేయనున్నది. కేంద్ర హోంశాఖ నేతృత్వంలోని నిపుణుల బృందం టాటా సన్స్ ‌సమర్పించిన బిడ్‌కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో నష్టాల్లో ఉన్న ఎయిర్‌ ఇం‌డియా సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణ జరగనుంది. జాతీయ పౌర విమానయాన సంస్థ అయిన ఎయిర్‌ ఇం‌డియాను అమ్మేందుకు గతంలోనూ ప్రయత్నాలు జరిగాయి. 2018 మార్చిలో కేంద్రం ఎయిర్‌ ఇం‌డియాలో 76 శాతం షేర్లను అమ్మేందుకు మొగ్గు చూపింది. అయితే అప్పుడు స్పందన కరువైంది. భారీ నష్టాల్లో ఉన్న ఎయిర్‌ ఇం‌డియా ఇక టాటా సన్స్ ‌చేతుల్లోకి వెళ్లనున్నది. ఎయిరిండియా అమ్మకం కోసం టాటా సన్స్ ‌తో పాటు స్పైస్‌జెట్‌ ‌ప్రమోటర్‌ అజయ్‌సింగ్‌ ‌బిడ్స్ ‌వేశారు. ఎయిర్‌ ఇం‌డియా ప్రతి రోజు సుమారు 20 కోట్ల నష్టాన్ని చవిచూస్తోంది.

దీంతో ఆ సంస్థ ఇప్పటి వరకు 70 వేల కోట్ల నష్టంలో ఉన్నది. దివాళా తీసిన ఎయిర్‌ ఇం‌డియాను టాటా చేజిక్కించుకోవడం కొంత ఊరటనిచ్చే అంశం.  పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఎయిర్‌ ఇం‌డియాను కొనుగోలు చేయడానికి టాటా సన్స్ ‌తుది బిడ్‌ ‌ను గెలుచుకుందని ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. స్పైస్‌ ‌జెట్‌ ‌ప్రమోటర్‌ అజయ్‌ ‌సింగ్‌ ‌కూడా బిడ్‌ ‌వేసినప్పటికి, టాటాసన్స్  ఎయిర్‌ ఇం‌డియా కొనుగోలు కోసం అధిక ఆఫరును సమర్పించారని అధికారులు చెప్పారు. టాటాసన్స్ ‌సమర్పించిన బిడ్‌ ‌ప్రభుత్వ కమిటీ నిర్ణయించిన కనీస ధర కంటే 3000 కోట్ల రూపాయలు ఎక్కువ అని సమాచారం. ఎయిర్‌ ఇం‌డియా పట్ల టాటాకు మక్కువ ఉన్నందున, దీని విస్తరణకు పెద్దమొత్తంలో డబ్బును టాటా సన్స్ ‌పెట్టే అవకాశం ఉందని ఎయిర్‌ ఇం‌డియా మాజీ డైరెక్టర్‌ ‌జితేంద్ర భార్గవ చెప్పారు. హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల బృందం టాటా సన్స్ ‌బిడ్‌ ‌కు ఓకే చెప్పినా దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ తుది ప్రకటన చేయాల్సి ఉంది. భారీనష్టాల్లో ఉన్న ఎయిర్‌ ఇం‌డియా టాటాల చేతుల్లోనైనా లాభాల బాట పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply