Take a fresh look at your lifestyle.

పేదల జీవితాల్లో మార్పే లక్ష్యంగా కృషి

ప్రజలందరి సంక్షేమమే ధ్యేయంగా 14 నెలల పాలన
సమన్యాయం జరిగేలా మూడు రాజధానుల నిర్మాణం
త్వరలో విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని
విభజన చట్టం మేరకు ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందే
విజయవాడ పతాకావిష్కరణలో సిఎం జగన్‌ ఉద్ఘాటన

విజయవాడ,ఆగస్ట్ 15 : ‌పేదల జీవితాలు మార్చడానికి కృషి చేస్తున్నామని ఎపి సిఎం జగన్‌ అన్నారు. రైతు భరోసా, వైఎస్‌ఆర్‌ ‌చేయూత, అమ్మఒడి, ఆసరా పథకాలు ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరినీ ఆదుకునే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. కులం, మతం, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామమని అన్నారు. ప్రజలందరి సంక్షేమమే ధ్యేయంగా 14 నెలల పాలన సాగిందన్నారు. దేశ 74వ స్వాతంత్య దినోత్సవ వేడుకలను ఆంధ్రప్రదేశ్‌లో  శనివారం ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ ‌స్టేడియంలో జాతీయ జెండాను ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌ ‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ప్రత్యేక వాహనంపై ప్రభుత్వ సంక్షేమ పథకాల శకటాలను సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌వీక్షించారు.  సంక్షేమ పథకాలు ప్రతిధ్వనించేలా ఏర్పాటు చేసిన శకటాలతో పాటు  కరోనా కష్ట కాలంలో ఆరోగ్య సేవలకు గాను ఏర్పాటు చేసిన శకటాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీనిలో భాగంగా ముందుగా రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య ్రదినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్‌.. అనంతరం ప్రసంగిస్తూ స్వాతంత్య ్రసమరయోధులకు పాదాభి వందనం చేస్తున్నానని అన్నారు. స్వాతంత్య్ర ప్రాణవాయువు లాంటిందని గాంధీజీ చెప్పారు. రాజ్యాంగం, చట్టప్రకారం నడుచుకుంటేనే అభివృద్ధి సాధ్యం. ప్రజాస్వామ్యం ప్రకారం వ్యవస్థలు నడుచుకోవాలని అన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకే పాలనా వికేంద్రీకరణ అని ప్రకటించారు. సమన్యాయం జరిగేలా మూడు రాజధానుల బిల్లును చట్టంగా మార్చాం అన్నారు. త్వరలో విశాఖ కేంద్రంగా కార్యనిర్వా హక రాజధానిని ప్రారంభిస్తామని అన్నారు. కర్నూలు కేంద్రంగా న్యాయ రాజధాని ఏర్పాటుకు పునాదులు వేస్తాం అన్నారు. పార్లమెంట్‌ ‌సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం.. ప్రత్యేక హోదాను అమలు చేయాలని గట్టిగా అడుగుతూనే ఉంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం మిగతా పార్టీలపై ఆధారపడే పరిస్థితి లేదు.. కాబట్టి ఇప్పటికిప్పుడు హోదా ఇచ్చే అవకాశం కనిపించకపోయినా.. ప్రత్యేక హోదాను ఖచ్చితంగా  సాధించాలనే ధృడసంకల్పంతో ఉన్నాం. ఈరోజు కాకపోతే భవిష్యత్‌లోనైనా..కేంద్ర ప్రభుత్వం మనసు మారి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకంతో హోదా కోసం కేంద్రాన్ని డిమాండ్‌ ‌చేస్తూనే ఉంటాం.

సామాజిక, ఆర్ధిక భరోసాను రాజ్యాంగం కల్పించింది.సమానత్వం పదాన్ని పుస్తకాలకే పరిమితం చేయకూడదు. ఆర్ధిక పరిస్థితులు లేకున్నా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాం. విద్యాపరమైన అంటరానితనాన్ని రూపుమాపేందుకు ప్రయత్నిస్తున్నాం,ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ ‌డియం తీసుకొచ్చాం అని అన్నారు. రైతు భరోసా ద్వారా అన్నదాతలకు ఆర్ధిక సాయం చేస్తున్నాం. పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు అందిస్తున్నాం. అవినీతి లేని వ్యవస్థ కోసం రివర్స్ ‌టెండరింగ్‌, ‌జ్యుడీషియల్‌ ‌ప్రివ్యూ, డైరెక్ట్ ‌బెనిఫిట్‌ ‌ట్రాన్స్‌ఫర్‌ ‌విధానాన్ని అమలు చేస్తున్నాం అన్నారు. కేవలం మొదటి 14 నెలల పాలనలోనే వివిధ పథకాల ద్వారా దాదాపు రూ.46వేల కోట్లు ప్రజలకు నేరుగా అందించాం. చెట్టు ఎంత బాగా ఎదిగినా చీడ పురుగు పడితే ఎండిపోతుంది. అవినీతి అనేది చీడపురుగు. అవినీతి వల్ల ప్రజలకు అందాల్సిన ఫలాలు అందకుండా పోతాయి.ఈ నిజాన్ని గమనించబట్టే రివర్స్ ‌టెండరింగ్‌, ‌జ్యుడీషియల్‌ ‌ప్రివ్యూ గత ప్రభుత్వ నిర్ణయాలపై సక్ష ద్వారా రూ.4వేల కోట్లకు పైగా ఆదా చేశాం. ప్రభుత్వం చేస్తున్న ఖర్చుకు పూర్తిస్థాయి ఫలాలు మరో 10 నుంచి 20 ఏళ్లకు వస్తాయి. కాబట్టి ఇవి ఎన్నికల పథకాలు కావని అన్నారు. రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్ధిక రాజకీయ చరిత్రలో మెరుగైన మార్పుల కోసం.. బాధ్యతతో, మనసుతో అమలు చేస్తున్న పథకాలుగా వివరించారు. స్వాతంత్య్ర వచ్చి ఇన్నేళ్లయినా దాదాపు 33శాతం పేదలకు చదువుకునే అవకాశం లేదు. విద్యాపరమైన అంటరానితనాన్ని రూపుమాపేం దుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. నాడు-నేడు ద్వారా పాఠశాలలు, కాలేజీల రూపురేఖలు మారుస్తున్నాం. 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ‌తో పాటు వసతి దీవెన అమలు చేస్తున్నాం. ప్రతి ఇంటా చదువుల దీపాలు వెలిగించేందుకు.. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. స్కూల్‌ ‌విద్యార్ధులకు పుస్తకాలు, షూస్‌ ‌వరకు అన్నీ ఉచితంగా ఇస్తున్నాం. తల్లిదండ్రుల కోరిక మేరకు ఇంగ్లీష్‌ ‌డియంను ఓ హక్కుగా అమలు చేస్తున్నాం. చదువే నిజమైన ఆస్తి, సంపద అని నమ్మి విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చాం. ప్రత్యేక మెనూతో గోరుముద్ద పథకం అమలు చేస్తున్నాం. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా విద్యార్ధులకు పరీక్షలు చేస్తున్నాం. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం. గతంలో మసకబారిన ఆరోగ్యశ్రీకి కొత్త వెలుగులు తీసుకొచ్చాం. రూ.5లక్షల లోపు ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ వర్తింపజేశామని వివరించారు. బెంగళూరు, హైదరాబాద్‌, ‌చెన్నై నగరాల్లో ఆరోగ్యశ్రీ ద్వారా.. సూపర్‌ ‌స్పెషాలిటీ సేవలు అందిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 1088 వాహనాలను ఒకేసారి 108, 104 సేవల కోసం పంపాం. ఆపరేషన్‌ అయిన రోగులకు రూ.5వేలు ఆరోగ్య ఆసరా అందిస్తున్నాం. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.10వేల పింఛన్‌ అం‌దిస్తున్నాం. కొత్తగా 16 మెడికల్‌ ‌కాలేజీల నిర్మాణానికి నిర్ణయాలు తీసుకున్నాం అని తెలిపారు. జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తాం. 2022 ఖరీఫ్‌ ‌నాటికి పోలవరం పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పల్నాడు కరువు నివారణ ప్రాజెక్ట్.. ‌రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్ట్‌ల పనులు మొదలుపెట్టబోతున్నాం. ఈ ఏడాదిలో వంశధార ఫేజ్‌-2, ‌వంశధార-నాగావళి అనుసంధానం.. వెలిగొండ ఫేజ్‌-1, అవుకు టన్నెల్‌ -2, ‌సంగం బ్యారేజ్‌, ‌నెల్లూరు బ్యారేజీల్ని పూర్తి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాం. రాష్ట్రానికి సంబంధించిన నీటి ప్రయోజనాల విషయంలో.. రాజీ లేదని ఆచరణ ద్వారా చూపిస్తున్నాం అని సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌తన ప్రసంగంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో సిఎస్‌ ‌నీలం సాహ్ని, డిజిపి గౌతం సావంగ్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply