రాళ్ళు విసిరితే
పూలుగా స్వీకరించు
నీ మార్గం
సుగమమవుతుంది
విమర్శలు చేస్తే
సద్విమర్శగా తీసుకో
నీ మస్తిష్కం
పదును తీరుతుంది
ముళ్ళతో గుచ్చితే
పూల గుచ్చంగా మలుచుకో
నీ సంకల్పం
నెరవేరుతుంది
రాళ్ళున్నాయని
బియ్యాన్ని పడేస్తావా ?
ముళ్ళున్నాయని
రోజాలను వదిలేస్తావా ?
జీవితం కూడా అంతే!
విచక్షణతో పోరాడుతూ
విజయ బావుటా ఎగరేయడమే
నీ ముందున్న లక్ష్యం!
—కయ్యూరు బాలసుబ్రమణ్యం
9441791238- శ్రీకాళహస్తి