Take a fresh look at your lifestyle.

రాష్ట్ర వ్యాప్తంగా 230కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం

aim, plant 230 million, plants across,state,nizamabad
పెద్ద ఎత్తున హరిత కార్యక్రమంలో పాల్గొనాలి : అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ]

నిజామాబాద్‌  ‌తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా 230కోట్ల మొక్కలు నాటడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నాడిక్కడ డియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అడవుల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ‌కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 92 అర్బన్‌ ‌పార్క్‌లను నిర్మిం చామని, ఒక్కో పార్క్‌కు రూ.3 కోట్ల నుంచి రూ.5కోట్ల వరకు ఖర్చు అయినట్లు వివరించారు.

అర్బన్‌ ‌పార్కుల అభివృద్ధికి కేసీఆర్‌ ‌చొరవ చూపుతున్నారని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. పెద్ద ఎత్తున మొక్కలు పెంచితేనే మానవమనుగడ ఉంటుందన్నారు. మన పిల్లలకు మంచి భవిష్యత్‌ ఇవ్వాలంటే హరిత తెలంగా ణ సాధించాలన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్‌ ‌పుట్టినరో జున పెద్దఎత్తున మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టా మన్నారు. ప్రతి ప్రభుత్వశాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని  ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి రెండు చొప్పున మొక్కలు నాటడంతో పాటు సంరక్షించే బాధ్యతను తీసుకుంటున్నారు. మరోవైపు ఆయా ప్రభుత్వశాఖల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు పెంచేందుకు నిర్ణయించారు. ప్రభుత్వశాఖల కు, ఉద్యోగులకు అవసరమైన మొక్కలను అటవీ, గ్రాణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలోని నర్సరీల నుంచి సరఫరా చేస్తున్నారు.

ప్రజాప్రతినిధులు, విద్యాసంస్థలు, స్థానిక సంస్థలు, అధికారులు, ఉద్యోగులకు అవసరమై న మొక్కలను నర్సరీల నుంచి ఇవ్వాలని అటవీ, గ్రాణాభివృద్ధిశాఖ అధికారులు ఇప్పటికే తమ సిబ్బందిని ఆదేశించారు. పూలమొక్కలు, పండ్ల మొక్కలు ప్రత్యేకంగా తెచ్చుకొని పెట్టుకునేందుకు కొన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రి ఒక్కరు ఒక్కో మొక్క చొప్పున నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు.  గతంలో పెట్టిన మొక్కలు చనిపోయిన ప్రదేశాల్లో మళ్లీ మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.  మున్సిపాలిటీతో పాటు గ్రామాల్లో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.

Tags: aim, plant 230 million, plants across,state,nizamabad

Leave a Reply