Take a fresh look at your lifestyle.

పాలకుల ద్వంద్వ ప్రమాణాలు ..!

గత సంవత్సరం కొరోనా వైరస్ ఆనవాళ్లు బహిర్గతం అయినా తరువాత మొదటి సారి దేశంలో ఆదివారం కొరోనా పాజిటివ్ ల సంఖ్య లక్ష దాటింది. ..1,03,558 కొరోనా బారిన పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో వరుసగా మూడో రోజు..  ఆదివారం.. కొరోనా బాధితుల సంఖ్య వెయ్యి దాటింది..దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
కేసులు ఎక్కువ నమోదు అవుతున్న రాష్ట్రాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. అత్యధిక కేసులు నమోదు అవుతున్న మహారాష్ట్ర లో వారాంతపు లాక్ డౌన్ విధిస్తూ..సాధారణ పని రోజుల్లో కొరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. రాత్రి సమయాల్లో రవాణా నిలిపివేశారు. AIIMS CHIEF రందీప్ గులేరియా వైరస్ వ్యాప్తి కట్టడికి మైక్రో లాక్ డౌన్ అవసరాన్ని వ్యక్తం చేశారు. వాక్సిన్ ఫలితాల పై భిన్న అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. మాస్క్ ధరించడం…భౌతిక దూరం పాటించడం ..ఒకే దగ్గర గుమికూడకుండా ఉండడం..చేతులు తరచూ సబ్బు తో లేదా శానిటైజర్ తో శుభ్రపరచుకోవడం …వైద్య నిపుణులు పదే పదే తెలియజేస్తున్నా …రాజకీయ పార్టీలకు ..వాటిని నడిపే వారికి చెవికి ఎక్కడం లేదు…ఎన్నికలు..వోట్లు …వాళ్ళ లక్ష్యం ..! 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార సరళి గమనించండి..రాష్ట్రంలో జరుగుతున్నా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటున్న వారిని గమనించండి …ఈ పాలకుల ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం..

Leave a Reply