‘‘ప్రపంచాన్ని కొన్ని దశాబ్దాలుగా కలవరపరచిన ఎయిడ్స్ అనబడే విచ్చలవిడి శృంగార కారక రోగం మానవాళికి ఒక దశలో ముప్పుగా పరిణమించింది. ముఖ్యంగా విచ్చలవిడి లైంగిక సంబంధాలు , గే, లెస్బియన్ వంటి అసహజ శృంగార వాంఛలూ ఎయిడ్స్ కారకాలుగా ప్రపంచం గుర్తించింది.’’
మందు లేని మాయ రోగం – ఎయిడ్స్
(నేడు ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం)
విచ్చలవిడి శృంగార సంభోగాల వల్ల ముఖ్యంగా ఒకరి కంటే ఎక్కువ మందితో సంభోగంలో పాల్గొనడం వల్ల వచ్చే వ్యాధి. స్త్రీ నుండి పురుషుడికి, పురుషుడి నుండి స్త్రీకి రావడం, తల్లి నుండి బిడ్డకు, కలుషిత సిరంజిల వల్ల ఒకరినుండి ఇంకొకరికి ఎయిడ్స్ సంక్రమిస్తుంది. సెక్స్ అందుబాటులో లేకపోతే తట్టుకోలేని తీవ్రస్వభావమే లైంగిక వ్యసనం. లైంగిక వ్యసనపరులు మాత్రం… ఓ రకమైన డిప్రెషన్‌కు గురవుతారు. సమయానికి సెక్స్ అందుబాటులో లేకపోయినా తట్టుకోలేరు. ఎంతకైనా తెగిస్తారు. ఏమైనా చేస్తారు. మంచి-చెడు, నైతికత-అనైతికత, పరువు-ప్రతిష్ఠ… ఏవీ గుర్తుకురావు. విచ్చలవిడి శృంగారానికి ఎగబడుతారు. విచ్చలవిడి శృంగారంతో ఎయిడ్స్ వ్యాప్తి ఎక్కువ.
ఒకే గాలిని పీల్చడం ద్వారా, కౌగిలింతులు, ముద్దులు, షేక్హ్యాండ్ల ద్వారా, ఒకే ప్లేట్ లో తినడం ద్వారా, ఒకే షవర్ కింద స్నానం చేయడం ద్వారా, వ్యక్తిగత వస్తువులను ఒకరినొకరు పంచుకోవడం ద్వారా, జిమ్‌లో ఒకే పరికరాలు వాడడం ద్వారా, టాయిలెట్ సీటు, డోర్ హ్యాండిళ్లను ముట్టుకోవడం ద్వారా హెచ్ఐవీ రాదు అని గుర్తుంచుకోండి. హెచ్.ఐ.వి శరీర ద్రవాల ద్వారా అంటే రక్తం, వీర్యం, యోని ద్రవాలు, తల్లిపాల ద్వారా వ్యాపిస్తుంది.
శృంగారం సమయంలో కండోమ్స్ విఫలమైతే, అంటే చిరిగిపోవడం, జారిపోవడం, లీక్ అవ్వడం లాంటివి జరిగితే హెచ్ఐవీ సోకే ప్రమాదం ఉంది. అందుకే కండోమ్స్ ధరిస్తే సరిపోదు. హెచ్ఐవీ పరీక్షలు చేయించుకొని పాజిటివ్ అని తేలితే వెంటనే చికిత్స మొదలుపెట్టాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం హెచ్ఐవీ ఉన్న ప్రతి నలుగురిలో ఒకరికి తమకు హెచ్.ఐ.వీ సోకినట్లు తెలీదు. దాంతో ఇతరులకు కూడా అది వ్యాపించే అవకాశాలు చాలా ఎక్కువ.
నోటి ద్వారా సెక్స్ చేయు పద్దతిని ఓరల్ సెక్స్ అంటారు. ఇతర రకాల శృంగారంతో పోలిస్తే ఓరల్ సెక్స్ ద్వారా రిస్క్ తక్కువే అయినప్పటికీ 10వేల కేసుల్లో నాలుగు కేసుల్లో మాత్రమే హెచ్ఐవీ సోకే అవకాశం ఉంది. ఎదుటి వారి నోటిలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే వారికి సుఖ వ్యాధులు, హెచ్ ఐ వి వచ్చే ప్రమాదం ఉంది. ఓరల్ సెక్స్ ద్వారా హెచ్ఐవీ సోకే ప్రమాదమైతే ఉంది.
పెళ్ళికి ముందు లైంగిక సంపర్కానికి దూరంగా ఉండడం. జీవిత భాగస్వామితో నమ్మకమైన దాంపత్య జీవితం కలిగి ఉండడం ద్వారా హెచ్.ఐ.వి నివారణలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ప్రస్తుతం ఎయిడ్స్ ను సమూలంగా నియంత్రించే మందుగానీ, టీకా గానీ మార్కెట్లోకి ఇంకా రాలేదు. సురక్షితం కాని లైంగిక సంబంధాలను కొనసాగించొద్దు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ సిరంజీలు, నీడిళ్లను వాడాలి. రక్త మార్పిడి చేసేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. స్టెరిలైజ్డ్ నీడిల్స్ మాత్రమే ఉపయోగించాలి. ప్రభుత్వ ఆమోదిత బ్లడ్‌బ్యాంక్ (రక్తనిధి)నుంచి పొందిన రక్తాన్ని మాత్రమే ఉపయోగించాలి. గర్భిణులు విధిగా హెచ్ఐవీ పరీక్ష చేయించుకోవాలి. సైకోథెరపీ ద్వారా సెక్స్ వ్యసనపరులను ఊబిలోంచి బయటికి తీసుకురావడం సాధ్యమే.
డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్