Take a fresh look at your lifestyle.

తెలంగాణలో ప్రజలు పిట్టల్లా రాలిపోతే…

  • కొరోనాపై మీకు పరిహాసమా…!
  • సిఎం కెసిఆర్‌పై ఏఐసీసీ అధికార ప్రతినిది దాసోజు శ్రావణ్‌ ‌మండిపాటు

అసలు ఫంగసే లేకపోతే… ట్విట్టర్‌లో మీ కొడుకు ప్రచారం ఎందుకు చేస్తున్నారని సిఎం కెసిఆర్‌ను ఎదురు ప్రశ్న వేశారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్‌. ‌ఫస్ట్, ‌సెకండ్‌ ‌వేవ్‌లో ప్రజలు పిట్టల్లా రాలిపోతే…రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కొరోనాపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడడాన్ని శ్రావణ్‌ ‌తప్పుబట్టారు. ఏండ్ల కొద్ది ప్రగతి భవన్‌లో బందీ అయిన సిఎం తాజాగా బయటకు వొచ్చారన్నారు. అయితే, ప్రభుత్వ పెద్దగా ప్రజల్ని నిబంధలను పాటించాలని అప్రమత్తం చేయాల్సింది పోయి, కొరోనా ఉందా అంటూ ప్రజల్ని ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారని సిఎంను నిలదీశారు. బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీలో శ్రావణ్‌ ‌మీడియాతో మాట్లాడుతూ..పేపర్లు, చానళ్లు వైట్‌ ‌ఫంగస్‌, ‌బ్లాక్‌ ‌ఫంగస్‌పై రాసిన వార్తలను హేళన చేయడాన్ని తప్పుబట్టారు. మరి ఏమీ లేకపోతే మంత్రి కేటీఆర్‌ ‌ట్విట్టర్‌లో బ్లాక్‌ ‌ఫంగస్‌, ‌వైట్‌ ‌ఫంగస్‌ ‌లకు ఎందుకు మందులు ఇచ్చారని ప్రశ్నించారు. మిగితా అన్ని మందులను తాము అందుబాటులో ఉంచుతామని ఎందుకు భరోసా ఇచ్చారో చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. ఖమ్మంలో 1,428 మందికి పిల్లలకు వైరస్‌ ‌సోకిందని రిపోర్ట్‌లు చెబుతున్నాయన్నారు.

అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో కేసీఆర్‌కు సోయి ఉందా? అని ప్రశ్నించారు. థర్డ వేవ్‌ ‌వొస్తుందని హెల్త్ ఎక్స్‌ప•ర్టస్ ‌చెబుతుంటే, రాదని చెప్పడానికి కేసీఆర్‌ ‌దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయో చెప్పాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. కేసీఆర్‌ ఏమైనా డాక్టరా అని ప్రశ్నించారు. మొదట ప్యారాసిటమాల్‌, ఇప్పుడేమో డోలో అంటూ కేసీఆర్‌ ‌ప్రజల్ని మభ్య పెడుతున్నారని విమర్శించారు. బాధ్యతారాహిత్యంగా మాట్లాడి ప్రజల్ని కొరోనా బారిన పడి మరణించే విధంగా చేయొద్దని కేసీఆర్‌కు శ్రావణ్‌ ‌హితవు పలికారు. చావులకు సంబంధించిన దొంగ లెక్కల చిట్టాను విప్పి, ప్రభుత్వ మోసాన్ని ఎండగడుతామన్నారు. ఫస్ట్ ‌వేవ్‌కు ముందు అసెంబ్లీ వేదికగా కేసీఆర్‌ ‌మాట్లాడుతూ…మాస్క్‌లు లేకుండా ఎమ్మెల్యేలు, మంత్రులు కొరోనా కట్టడి చేస్తారని చెప్పారన్నారు.

వెయ్యి కోట్లతో తెలంగాణ నుంచి కొరోనాను తరిమి కోడతామని అపహాస్యం చేశారన్నారు. దీంతో ఆయనే కాకుండా, తెలంగాణ ప్రజలు కూడా తగిన మూల్యం చేల్లించుకోవాల్సి వొచ్చిందన్నారు. వాస్తవ లెక్కలు చూపి ఉంటే…ప్రజలు స్వీయ నియంత్రణ పాటించే వారని అన్నారు. సెకండ్‌ ‌వేవ్‌లో ఆక్సిజన్‌, ‌వెంటిలేటర్‌, ‌లైఫ్‌ ‌సేవ్‌ ‌డ్రగ్స్ ‌కొరతతో లక్షలాది మంది మరణించారన్నారు. కానీ, సర్కార్‌ ‌వేల మంది మాత్రమే చనిపోయారని సిగ్గులేకుండా తప్పుడు లెక్కలు ఇచ్చిందన్నారు. 2020 మార్చి నుంచి జూన్‌ ‌వరకు లెక్కలు తీస్తే… కేవలం గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో లక్ష మందికి పైగా మరణించి ఉంటారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరెంతో మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవ మరణాలను చూపించి ఉంటే ప్రజల్లో కొరోనాపై భయం పెరిగేదని, దీంతో వాళ్లు స్వీయ నియంత్రణ పాటించే వారని చెప్పారు.

కోర్టులను మిస్‌ ‌లీడ్‌ ‌చేస్తూ, దొంగ లెక్కలు చెప్పడం వల్ల ప్రజలు సరిగా కొరోనా నిబంధనలున పాటించకుండా వైరస్‌ ‌బారినపడి మరణించారన్నారు. ఇవన్నీ కేసీఆర్‌ ‌నిర్లక్ష్య పాలనకు నిదర్శనమన్నారు. ప్రైవేటు హాస్పిటల్స్‌పై ప్రైస్‌ ‌క్యాప్‌ ‌పెడుతూ జీవో తేవాలని హైకోర్టు చెప్పినా రెండు నెలలుగా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. ప్రస్తుతం ఈ కేసు మరోసారి ప్రధాన బెంచ్‌ ‌ముందుకు రానున్న నేపథ్యంలో ఆఘమేఘాలపై జీవో తెచ్చారని మండిపడ్డారు. ప్రైవేటు హాస్పిటల్స్ ‌దోపిడీ నుంచి ప్రజల్ని కాపాడేందుకు టీఆర్‌ఎస్‌ ‌సర్కార్‌ ‌పని చేయడం లేదని శ్రావణ్‌ ‌మండిపడ్డారు.

Leave a Reply