Take a fresh look at your lifestyle.

జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లో కూడా బీసీల నోళ్లలో మట్టికొట్టే ప్రయత్నం : దాసోజ్‌ ‌శ్రవణ్‌

బీసీ నోళ్లలో మట్టికొట్టే ప్రయత్నం జరుగుతుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజ్‌ ‌శ్రావణ్‌ ‌విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో లోపభూయిష్టంగా బీసీ రిజర్వేషన్‌లతో వారిని అణగదొక్కారని ఆరోపించారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ …గోపాల్‌ ‌రెడ్డితో టీఆర్‌ఎస్‌ ‌వెనకుండి హైకోర్టులో కేసు వేసి రిజర్వేషన్లు కుదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లో కూడా ఇదే కుట్ర చేస్తున్నారని తెలంగాణ లో సామాజిక న్యాయం ఉండటం లేదని అన్నారు.

కులగణన చేయకుండా ఇష్టమొచ్చినట్లు రిజర్వేషన్లు కేటాయిస్తున్నారని బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తే.. కాంగ్రెస్‌ ‌పార్టీ ముందుండి పోరాడుతోందని హెచ్చరించారు.ఒక చట్టం తీసుకొచ్చేటప్పుడు ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోరావు అని ప్రశ్నించారు. కర్ణాటక లో మాదిరిగా కేటగిరైజేషన్‌ ‌ప్రకారం రిజర్వేషన్‌ ‌లు కేటాయించాలని ,బీసీ రిజర్వేషన్‌ ‌లపై సీఎం కేసీఆర్‌, ఎన్నికల కమిషనర్‌ ‌కు లేఖ రాసిన్నట్లు తెలిపారు.

Leave a Reply