వనపర్తి,జూన్,16(ప్రజాతంత్ర విలేకరి): దేశానికి అన్నం పెట్టే రైతులు ఆర్థికంగా అభివృద్ది చెందుతూనే రాష్ట్రం, దేశం బాగుంటుందని రైతును రాజు చేయాలని లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందని అందులో బాగంగానే ప్రభుత్వం గ్రామాల్లో రైతు వేదికలు నిర్మిస్తుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం నాడు వనపర్తి జిల్లాలోని పాన్‌గల్ వీపనగండ్ల పెబ్బేరు శ్రీరంగాపూర్ మండలాలలోని రైతు వేదికలను వీపనగండ్ల మండల కేంద్రం 30 పడకల ఆసుపత్రిని పలు గ్రామాల్లో గ్రామపంచాయతీలకు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి కలిసి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతు రైతు వేదికల నిర్మాణంతో వ్యవసాయ అధికారులు ఉండడమే కాకుండా రైతుల సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందన్నారు. వివిధ మండల కేంద్రాల్లోని గ్రామాల్లో ఒక క్లస్టర్ గా విధించి రైతు వేదికలను నిర్మిస్తున్నట్లు రైతు వేదికలకు ప్రతి క్లస్టర్‌కు ఒక ఏఈఓ ఉంటారని ఆయన తెలిపారు.
ఒక భవన నిర్మాణానికి ప్రభుత్వం 20 లక్షల రూ.లు చెల్లిస్తుందన్నారు. రైతు వేదకలు తొందరలోనే పూర్తి కానున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే రైతులకోసం పలు సంక్షేమ పథకాలు రైతు బంధు రైతుభీమా మొదలగువి ప్రవేశ పెట్టిన సిఎం కేసిఆర్ రేతువేదికలతో వారిక మరింత దగ్గరయ్యారన్నారు. రైతువేదకలు రైతులకు దేవాలయాలవంటివి అదేవిధంగా ఇంతటి సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉందని స్ఫష్టం చేశారు. అన్నదాతల కష్టాలు తెలిసిన సిఎం కెసిఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం అదృష్టామని అన్నారు. సిఎం కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సుదూర ప్రాంతాల్లో ప్రజలకు ఆరోగ్య సంరక్షణ కొరకు ప్రభుత్వ పిహెచ్‌సిలను 30 పడకల గదులను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు కల్పించాలని పలు పిహెచ్‌సిలను అదనపు పడకల ఆసుపత్రులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాన్‌గల్ సింగిల్‌విండో అధ్యక్షులు మామిళ పల్లి విష్ణువర్దన్‌రెడ్డి, మార్కెట్ కమిటి చైర్మెన్ నరేందర్‌రెడ్డి, ఎంపిపిలు, జడ్పీటిసిలు, సర్పంచులు, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, అధికారులు ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.