Take a fresh look at your lifestyle.

‌ప్రతి రైతుకు రైతుబంధు అందాలన్నదే లక్ష్యం

వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

వనపర్తి,జులై,01(ప్రజాతంత్ర విలేకరి): ప్రతి రైతుకు రైతు బంధు అందాలన్నదే ముఖ్యమంత్రి కేసిఆర్‌ ‌లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం నాడు మంత్రి తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతు సీఎం కేసిఆర్‌ ‌దిశా నిర్దేశంలో వ్యవసాయ శాఖ రైతుబంధు నిధులను దాదాపు రూ.7వేల కోట్లు అందజేసిందని చెప్పారు. రైతులకు కులము మతము రైతులంతా ఒకే కులము సేద్యపు కులము అన్నదే ముఖ్యమంత్రి కేసిఆర్‌ ‌రైతు బంధు అందాలన్నదే లక్ష్యమని పేర్కొన్నారు. రైతుబంధు నిధుల పంపిణి ఒక ప్రపంచ రికార్డు 36 గంటల్లో రిక్డ్రా స్థాయిలో రైతుల ఖాతాలో డబ్బులు వేశామని ప్రపంచంలో ఎక్కాడ ఇలాంటి పథకం లేదని గుర్తు చేశారు. వ్యవసాయాన్ని బలోపేతం చేయాలన్నదే ముఖ్యమం త్రి కేసిఆర్‌ ‌ధ్యేయమని చెప్పారు. రైతుబంధు రైతుభీమా వంటి ప్రభుత్వ విధానాలతో తెలంగాణ రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పారు. రైతిబంధు రాని ఖాతాదారులు వ్యవసాయఅధికారును సంప్రదించాలని తెలిపారు.

రైతుబంధు పథకం కింద ఈ ఏడాదు వానాకాలం సీజన్‌కు 55.06 లక్షల రైతులకు కోటి39లక్షల76వేల ఎకారలకు 6987. 90కోట్లు రైతుల ఖాతాలో వేయడం జరిగిందన్నారు. ఈ వారంలో 1.96లక్షల మంది రైతులు బ్యాంకు వివరాలు నమోదు చేసుకోవడం జరిగిందని దీనికి సంబంధించిన 214.75కోట్లు త్వరలోనే జమచేస్తామని అన్నారు. ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాలు ఇవ్వని రైతులు జులై 5వరకు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులకు వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. 28వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల వివరాలు సరిగా లేవని వారికి డబ్బులు జమచేసిన వారి ఖాతాలకు చేరలేదని ఐఎఫ్‌ఎస్‌ ‌సి కోడ్‌ ‌గాని మూసివేయబడిన ఖాతాలు ఇవ్వడం లేదా సరయిన ఖాతా నంబరు ఇవ్వకపోవడం వల్ల నిధులు జమకాలేదని చెప్పారు. రైతు బందు నిధులు రైతువకు చేర్చాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులదేనని అన్నారు. కార్యక్రమంలో జడ్పీచైర్మెన్‌ ఆర్‌.‌లోక్‌నాథ్‌రెడ్డి, మున్సిపల్‌ ‌చైర్మెన్‌ ‌గట్టు యాదవ్‌, ‌వైస్‌ ‌చైర్మెన్‌ ‌వాకిటి శ్రీధర్‌, ‌మాజీ మున్సిపల్‌ ‌చైర్మెన్‌ ‌రమేష్‌గె•డ్‌, ‌కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

error: Content is protected !!