- కందులు కూడా కొంటామని ప్రకటించిన మంత్రి హరీష్ రావు
- గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిన ఘనత కెసిఆర్‌దే
రైతులకు పంట పెట్టుబడి సాయంగా ఎకరానికి 10 రూపాయలు, రైతు చనిపోతే రైతు బీమా కింద ఐదు లక్షలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. జిల్లాలోని మనూర్ మండలం తోర్నాల గ్రామంలో రైతు వేదికను ఆర్థికమంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..గతంలో కొనుగోలు కేంద్రాలు ఉండేవి కావు. తోర్నాలలో వి•రు అడిగినందుకు అన్ని పంటలు కొన్నాం. ఈ ఏడాది కందులు ఆరువేలకు కొంటామని తెలిపారు.
ఉగాది పండుగ తర్వాత రైతులకు సబ్సిడీ ద్వారా వ్యవసాయ పనిముట్లు, రాయితీ కింద వరినాట్లు వేసే యంత్రాలు ఇవ్వడానికి సీఎం ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. షుగర్ కేన్ హార్వెస్ట్ యంత్రాలు ఇస్తాం. మంజీరలో ధార లేకున్నా కాళేశ్వరం నీళ్లు తెచ్చి మంజీర, సింగూరును నింపుతామన్నారు. బసవేశ్వర్ లిప్ట్ ద్వారా ఈ ప్రాంతానికి సాగు నీరు అందిస్తాం. దీనిపై ప్రతిపాదనలు తయారవుతున్నాయని వివరించారు. ఉగాది తర్వాత జాగ ఉన్నవారికి ఇండ్లు కట్టుకునేందుకు సాయం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇదిలా వుంటే ప్రాణమున్నంత వరకు నారాయణఖేడ్ అభివృద్ధికి తన సహకారం ఉంటుందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
నారాయణ ఖేడ్‌లో గిరిజన బాలికల రెసిడెన్షియల్ స్కూల్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. 70 ఏళ్లు కాంగ్రెస్, టీడీపీ లకు ఓట్లు వేశారు. కానీ ఒక్క గిరిజనరెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయలేదు. కానీ కేసీఆర్ సీఎం అయ్యాక రాష్ట్రంలో 52 కొత్త గురుకులాలు వచ్చాయన్నారు. తాండాలను గ్రామ పంచాయతీలుగా తెలంగాణ ప్రభుత్వం మార్చిందన్నారు. నారాయణ ఖేడ్‌లో రూ. 20 కోట్ల ప్రత్యేక ప్యాకేజీతో అన్ని తండాలకు రోడ్లు, అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
దేశంలోనే తెలంగాణలో సంగారెడ్డిలో ఇంటిగ్రేటేడ్ గిరిజన రెసిడెన్షియల్ లా కాలేజ్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇంటర్ అయ్యాక ఐదేళ్లు లా డిగ్రీ చదువు చెప్పి పంపుతాం. ఉగాది పండుగ తర్వాత సొంత స్థలం ఉన్న వారికి ఇళ్లు కట్టుకునేందుకు డబ్బులిస్తామన్నారు. నాలుగు రెసిడెన్షియల్ పాఠశాల ఉపాధ్యాయులకు అవసరమైన క్వార్టర్లు కావాలని ఎమ్మెల్యే అడిగారు అవి కూడా కట్టిస్తామని మంత్రి పేర్కొన్నారు.