అగ్రరాజ్యంలో.. అంతులేని జాత్యాహంకారం
మార్టిన్ లూథర్ కింగ్ ప్రసంగం ప్రపంచాన్ని కదిలించినప్పటికిని, అమెరికాలో మార్పు రాకపోవడం విషాదం. ఇప్పటికే దాదాపు నాలుగు వందల ఏళ్ళు గడిచాయి. 152 ఏళ్ళ క్రితమే ఆఫ్రికన్-అమెరికన్లకు అమెరికన్ పౌరసత్వం ఇచ్చారు. జూలై 1868 లో, నల్ల అమెరికన్లను చివరకు పౌరులుగా ప్రకటించారు, కానీ వ్యవస్థలో పెద్దగా మార్పు సంభవించలేదు. బానిసత్వం రద్దు చేయబడింది కాని జాత్యహంకారం ఇంకా అమెరికన్ సమాజంలో వేళ్ళూనకపోయింది.
వివక్ష, పీడనలను కూకటి వేళ్ళతో పెకిళిం చనంత వరకు నిరా శను నిర్మూ లించ డానికి కనిపిం చని కేంద్రీకృత శక్తు లెన్నో కారకాలుగా పనిచే స్తూనే ఉంటాయి. కారణాలతో సంబ ంధం లేకుండా పర్యవస నాలను పాతరేస్తూ వేద•న, పీడన, అణిచివేతలను నిరభ్యంతరంగా కొనసాగించవచ్చని భావించడం ప్రమాదకరం. భాధితుడు గాయాన్ని భరించవచ్చేమో, లేదా గాయం మసకబారవచ్చేమో, కాని భవిష్యత్తు మీద, మానవ సమాజం మీద దాని ప్రభావం అంతకంతకు రెట్టింపవుతూనే ఉంటుంది. గాయాలకు చికిత్స చేయడానికి, ముఖ్యంగా గాయాలను చేసే వ్యవస్థను మార్చడానికి ప్రయత్నం చేసే ఎటువంటి యంత్రాంగం లేనప్పుడు భాదితులకు న్యాయం ఆశించడం అత్యాశే అవుతుంది. ఇవన్ని సహజంగానే భాధితుడికి సమాజం పట్ల, మానవాళి పట్ల తెలియని అపనమ్మకాన్ని పెంచుతాయి. అలెక్స్ హేలీ విరచిత రూట్స్ గ్రంథంలో ‘‘నాకు స్వేచ్చనైన ఇవ్వండి. లేదా మరణాన్నైనా ఇవ్వండి’’ అన్న మాసా పాట్రిక్ మాటలు కుంటాకింటేకు బాగా నచ్చాయి. కాని, ఈ తెల్లవరేరో, వారెందుకంత స్వేచ్చగా ఉన్నారో ఆయనకి అర్థం కాలేదు. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న విద్వేశాగ్నులకు ఈ సంభాషణలు అద్దం పడతాయి. 1863 నాటి విముక్తి చట్టం తమ జీవితాల్లో మార్పులు తీసుకు వస్తాయని భావించిన నల్లజాతి ప్రజలకు అడుగడుగునా అవమానా లు ఇప్పటికీ ఎదురవుతున్నాయి. లింకన్ నుంచి మార్టిన్ లూథర్ కింగ్ వరకు నల్ల జాతి ప్రజల హక్కుల పోరాట చరిత్ర వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా ప్రపంచాన్ని జాగృత పరిచిన సంఘటనలు.
ఇటీవలే అమెరికాలోని మిన్నేపోలీసులో ఆఫ్రో-అమెరికన్ జాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్ హత్యానంతరం జాత్యాహాంకార సమస్య ఇంకా అమెరికాలో వేళ్ళూనకపోయిందనేది స్పష్టమైంది. డెరిక్ షవన్ అనే పోలీసు అధికారి దాదాపు 8 నిమిషాల 46 సెకనుల పాటు జార్జ్ ఫ్లాయిడ్ మెడపై తన మోకాలితో నొక్కి ఉంచడంతో ఊపిరి అందకా ఫ్లాయిడ్ మరణి ంచాడు. నిజానికి ఇది అత్యంత అమానవీయ చర్య. తనకు ఊపిరి ఆడటం లేదని ఆయన వేడుకుంటున్నా, షవన్ కనికరించలేదు. ఆయనతో పాటు విధులు నిర్వహిస్తున్న టౌ థావో, జె. అలెగ్జాండర్ కుయెంగ్, థామస్ కె. లేన్ ఈ అమానుష చర్యలో పాలుపంచుకోవడం విషాధం. స్థానిక మార్కెట్ లో ఫ్లాయిడ్ ఇరవై డాలర్ల మోసానికి పాలుపడ్డాడని, ఆయనను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించబోగా, తమను ప్రతిఘటించాడని పోలీసులు పేర్కొంటున్నప్పటికిని ఎక్కడ కూడ ఫ్లాయిడ్ ప్రతిఘటిస్తున్న విషయాలు నమోదు కాలేదు. అంతే కాదు, పాదచారులు సెల్ఫోన్ లలో చిత్రించిన విషయాలే ఇప్పుడు ప్రధాన సాక్షంగా మారాయి. ఆయన పదే పదే తనకు ఊపిరి ఆడటం లేదని, తనను చంపవద్దని వేడుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు అమెరికా ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి. థర్డ్ డిగ్రీ హత్యానేరం కింద షవన్ ను అరెస్ట్ చేసినప్పటికినీ ఈ సమస్యకు అసలైన మూలాలు పరిశీలించవలసిన అవసరం ఉంది.
దేశవ్యాప్తంగా ఫ్లాయిడ్ మద్ధతు దారుల నిరసనల వలన అమెరికా అట్టుడుకి పోతోంది. గతం నుంచి అమెరికా పాఠాలు నేర్చుకున్నట్లు అనిపించడం లేదు. ఈ అల్లర్లు కేవలం ఒక్క ఫ్లాయిడ్ హత్య గురించే అనుకుంటే పొరపాటే, అవి ఆయన మరణానికి ప్రాతినిథ్యం వహిస్తున్న కరత్వం, వర్ణ వివక్షలకు వ్యతిరేకంగా నినదిస్తున్న నిరసన గళాలు. అభివృద్ధి ముసుగు కప్పి అమానవీయ చర్యలతో నల్ల జాతీయుడిపై శతాబ్దాలుగా సాగుతున్న ధౌర్జన్యంపై, శిక్షార్హత చట్టాలను తయారు చేయలేని అమానుషమైన రాజ్యం అసమర్థ వ్యవస్థ మీద ఎత్తిన పిడికిలి అది. శక్తిలేని బలహీనమైన జంతువును నిర్ధాక్షిణ్యంగా వేటాడుతూ, అదే వేటను పదే పదే పునరావృతం చేస్తుంటే వన్యప్రాణులన్నీ సంఘటితమై సాగించిన పోరాటమిది. అధికారంలో ఉన్న ప్రతి వ్యక్తి, అధికారి, స్థానిక, రాష్ట్ర, సమాఖ్య ప్రభుత్వం వారి వారి అధికార పరిధులను బట్టి స్పందించకుండా ప్రవర్తించే అధికార దుర్వినియోగం మీద సగటు అమెరికా జాతీయుడు ప్రదర్శిస్తున్న ఆగ్రహావేశమిది. పక్షపాతవైఖరీ, ఒక జాతి మీద మరో జాతి దాడులు, నల్లజాతి జనాభాను శతాబ్దాలుగా క్రిమినలైజేషన్ చేయడం ద్వారా అమెరికాలో ఆఫ్రో-అమెరికన్ జాతులపై తెలియని కుట్రాపూరిత ముసుగును కప్పారు. 1915 లో వచ్చిన ‘‘బర్త్ ఆఫ్ ది నేషన్’’ చిత్రం తెల్ల ఆధిపత్యాన్ని ధృవీకరిచిన సినిమా. నల్ల అమెరికన్లను నేరస్తులుగా, సమాజ వ్యతిరేకులుగా ఉన్న భావనను సమర్థించింది. ఇటువంటి విష భీజాలను సంబందం లేని వ్యక్తుల మెదళ్ళలో నాటి నల్లవారి పట్ల కృత్రిమ వ్యతిరేకతను సృష్టించడం అక్కడ అనాధిగా సాగుతున్న అమానుష కృత్యం. నిజానికి అగ్రరాజ్యమైన అమెరికాలో బానిసల దిగుమతి నాటి నుంచే ఈ దురావస్థ ప్రారంభమైంది. మొదటి ఆఫ్రికన్ బానిసలు 1619 లో ఆమెరిక తీరానికి తీసుకురాబడ్డారు. ఇక్కడ విభజన రేఖ సుస్పష్టం .. నల్ల జాతీయులు బానిసలు.., తెల్ల జాతీయులు బానిస యజమానులు.
ప్రజలు నిస్సహాయులై, కోల్పోడానికి తమ దగ్గర ఏమీలేదని భావించినప్పుడు, ఇప్పటికే అసమతుల్యతతో అల్లాడుతున్న తమ జీవితాలను దారి మళ్ళించిన విధానాల మీద ఒక సహేతుకమైన కోపానికి తార్కిక ఫలితం ప్రస్తుతం అగ్రదేశమైన అమెరికా అనుభవంలోకి వచ్చింది. రాజ్యం ప్రజల అవకాశాలను కాలరాస్తుంటే, ప్రతిగా, ప్రభుత్వ ఆస్తులను ప్రజలు ధ్వంసం చేస్తారు. సాంఘీక న్యాయం, పోలీసుల బలప్రయోగం అనే అంశాల మీద ప్రజలకున్న అవాంఛనీయత ఒక తరం ప్రజలను వ్యవస్థ పట్ల వ్యతిరేకులుగా మారుస్తుంది. కేవలం తమ చర్మం రంగు కారణంగా జీవితమంతా అభద్రతా భావంతో బ్రతుకుతూ, తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని నిరంతరం భావించే ప్రపంచంలో జీవించవలసి రావడం అత్యంత దురదృష్టకరం. నిజానికి జాత్యాహాంకార సంబందిత హింస అమెరికాలో కొత్తకాదు. అయితే వర్ణవివక్ష సహిత తెలుపు-నలుపు వివాదం యునైటెడ్ స్టేట్స్ లో ప్రభుత్వానికి, మీడియాకు కూడ కొన్నిసార్లు కథావస్తువుగా మారడం విషాదం. సమస్య మూలాలు వెదికి పరిష్కరించడంలో ఈ రెండు వ్యవస్థలు దాదాపుగా విఫలమయ్యాయనే చెప్పవచ్చు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో సైతం నల్లజాతి సైనికులను పక్షపాతం వెంటాడింది. 1919 లో నల్ల సైనికుల పై దాడులు జరిగడంతో అమెరికాలోని దాదాపు 34 నగరాల్లో అల్లర్లు చెలరేగాయి. శ్వేతజాతి దురహంకారులు నల్లజాతి సైనికులకు ‘‘తమ స్థానం’’ ఏంటో చూపించాలనుకున్నారు. చట్టపరంగా ఆమోదిత బహిరంగ స్థలాల ఏర్పాటు అనివార్యమైంది. తెల్లజాతీయులు నల్ల జాయీయులతో కలిసి ఒకే తరగతి గదిలో కూర్చుండలేరు. ఒకే రెస్టారెంట్ లో కలిసి భోజనం చేయలేరు. నల్ల జాతీయులు ఈ చట్టాలను ఉల్లంగించినప్పుడు వారు పోలీసుల ద్వారా దారుణ హత్యకు గురైన సందర్భాలు ఉన్నాయి. పౌరహక్కుల ఉద్యమ సమయంలో అహింసాయుతంగా పోరాడుతున్న నిరసనకారులు క్రమం తప్పకుండా హింసకు గురయ్యారు. 1963 లో మెడ్గార్ ఎవర్స్ హత్య అనంతరం బర్మింగ్హామ్ లోని 16 వ వీధి బాప్టిస్ట్ చర్చిపై బాంబు దాడిలో నలుగురు చిన్నారులు మరణించారు. నిరసనకారులపై జరుగుతున్న హింసాకాడను టీవీలో ప్రసారం చేసిన తరువాతనే 1964 నాటి పౌరహక్కుల చట్టం ఆమోదించబడింది. మార్టిన్ లూథర్ కింగ్ హత్యానంతరం అల్లర్లు యావత్తు అమెరికాను అతలాకుతలం చేసిన తరువాతనే ఫెయిర్ హౌసింగ్ యాక్ట్ అని ప్రసిద్ధి గాంచిన 1968 నాటి పౌర హక్కుల చట్టం ఆమోదిం చబడింది. మార్టిన్ లూథర్ కింగ్ ప్రసంగం ప్రపంచాన్ని కదిలిం చినప్పటికిని, అమెరికాలో మార్పు రాక పోవడం విషాదం. ఇప్పటికే దాదాపు నాలుగు వందల ఏళ్ళు గడిచాయి. 152 ఏళ్ళ క్రితమే ఆఫ్రికన్-అమెరికన్లకు అమెరికన్ పౌరసత్వం ఇచ్చారు. జూలై 1868 లో, నల్ల అమెరికన్లను చివరకు పౌరులుగా ప్రకటించారు, కానీ వ్యవస్థలో పెద్దగా మార్పు సంభవించ లేదు. బానిసత్వం రద్దు చేయబడింది కాని జాత్యహంకారం ఇంకా అమెరికన్ సమాజంలో వేళ్ళూనకపోయింది.
అమెరికా శాంతిని కోరుకుంటే శాంతియుతంగానే స్పందించాలి గాని, పోలీసుల కరత్వానికి వ్యతిరేకంగా శాంతియుతంగా మోకాలిపై వంగిన వ్యక్తిని నిర్ధాక్షిణ్యంగా చంపే హక్కు ఎవరిచ్చారు? సమాధానం లేక సంజాయిషి ఇచ్చుకోలేని అధ్యక్షుడు ట్రంప్ శ్వేతసౌధపు బంకర్లల్లో దాక్కున్నాడంటే ఆయన వైఖరీని నిస్సందేహంగా అనుమానించాల్సిందే. ఈ న్యాయ పోరాటంలో అధికార వర్గాలు వారి స్పందనలను బట్టి ఇంకా ప్రభావితం కాలేదన్నట్టుగానే అనిపిస్తోంది. యధాతథ స్థితినే ప్రజలు, అధికారవర్గం కోరుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ఇక్కడ వారు సామాన్య ప్రజల విధేయతను కాంక్షిస్తూనే వారి వేధన నిశ్శబ్దంగా, గాయాలు ప్రశాంతంగా ఉండాలని కోరు కుంటారు. అల్లర్లు ప్రారంభమైన నాటి నుంచి నిరసనకారుల పట్ల ప్రభుత్వం చేస్తున్న రెచ్చగొట్టే ట్వీట్లు భాషా పరిధులను దాటింది. నిరసనకారులను అత్యంత దుర్మార్గపు కుక్కలని సంభోదించడం ఒక్క అమెరికాకే చెల్లింది. 1967లో అల్లర్ల సందర్భంగా మియామీ మాజీ పోలీస్ చీఫ్ వాల్టర్.ఇ.హ్యాడ్లీ మాటలు ఈ సంద ర్భంగా గుర్తు చేసు కోవడం అత్యం తావ శ్యకం, ‘‘ అల్లర్లు ప్రారంభ మైన ప్పుడు, కాల్పులు ప్రారం భమై తాయి’’. ఇక్కడ ప్రభు త్వం కూడ అల్లర్లు జర గాలనే కోరుకునేదోర •ణితో ఉన్నట్టు కనబ డుతుంది.
జయప్రకాశ్ అంకం…