Take a fresh look at your lifestyle.

బండి సంజయ్‌ అరెస్ట్‌తో భగ్గుమన్న బిజెపి

బండి అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన
హైకోర్టులో కేసు వేసిన బిజెపి లీగల్‌ ‌సెల్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : ‌రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై పోలీసులు కుట్ర కేసు నమోదు చేసి.. బొమ్మలరామారం పోలీస్‌ ‌స్టేషన్‌ ‌నుంచి భువనగిరి కోర్టుకు తరలించారు. సంజయ్‌ ‌కనిపించకుండా కారు అద్దాలకు పేపర్లు అడ్డు పెట్టారు. బండిని తరలిస్తుండగా కారును అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. వారిని బలప్రయోగంతో పోలీసులు చెదరగొట్టారు. ఇదిలా ఉండగా బీజేపీ లీగల్‌ ‌సెల్‌ ‌తెలంగాణ హైకోర్టులో హెబియస్‌ ‌కార్పస్‌ ‌పిటిషన్‌  ‌వేసింది.

చీఫ్‌ ‌జస్టిజ్‌ ఉజ్వల్‌ ‌భుయాన్‌ ‌దగ్గరకు వెళ్ళిన లీగల్‌ ‌సెల్‌ ‌ప్రతినిధులు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. టెన్త్ ‌పేపర్‌ ‌లీకేజీ తెలంగాణలో ప్రకంపణలు సృష్టిస్తున్నాయి. ఈ కేసులో బండి సంజయ్‌ను అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. నాటకీయ పరిణామాల మధ్య బొమ్మలరామారం పోలీస్‌ ‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్బంగా అక్కడ టెన్షన్‌ ‌వాతావరణం నెలకొంది. బండిని పరామర్శించేందుకు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావును పోలీసులు అరెస్టు చేయడంతో మరింత ఉద్రిక్తత నెలకొంది. బండి అరెస్టును బీజేపీ తీవ్రంగా ఖండించింది. అరెస్టును నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలోనూ బీజేపీ నేతల అరెస్టుల పర్వం కొనసాగింది. అరెస్టు నేపథ్యంలో బీజేపీ నాయకులు నిరసనకు దిగుతారన్న సమాచారంతో పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply