- తొలిసారి బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థికమంత్రి హరీష్ రావు
- మొత్తం బ్జడెట్ రూ. 1,82,914 కోట్ల
- రెవెన్యూ వ్యయం రూ. 1,38,669.82 కోట్లు,
- పెట్టుబడి వ్యయం రూ. 22,061.18 కోట్లు
- రెవెన్యూ మిగులు రూ. 4,482.18 కోట్లు
- ఆర్థిక లోటు రూ. 33,191.25 కోట్లు
-రైతు రుణమాఫీకి రూ. 6,225 కోట్లు..
-రైతుబంధు పథకం కోసం రూ. 14 వేల కోట్లు.
-రైతు బీమా కోసం రూ. 1,141 కోట్లు.
-విద్యుత్ శాఖకు రూ. 10,416 కోట్లు.
-సాగునీటి రంగానికి రూ. 11,054 కోట్లు..
-రైతు వేదికల నిర్మాణం కోసం రూ. 350 కోట్లు..
-బిందు, తుంపర సేద్యానికి రూ. 600 కోట్లు.
-విత్తనాల సబ్సిడీకి రూ. 142 కోట్లు..
-పాడి రైతుల ప్రోత్సాహం కోసం రూ. 100 కోట్లు..
-మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కోసం రూ. 1000 కోట్లు.
-ఫీజు రియింబర్స్‌మెంట్ కోసం రూ. 2,650 కోట్లు.
-పాఠశాల విద్యాశాఖకు రూ. 10,421 కోట్లు.
-ఉన్నత విద్యాశాఖకు రూ. 1,723.27 కోట్లు.
-సంపూర్ణ అక్షరాస్యత కోసం రూ. 100 కోట్లు.
వ్యవసాయాభివృద్ది లక్ష్యంగా…కోటి ఎకరాల మాగాణం నా తెలంగాణ అన్న కెసిఆర్ సంకల్పానికి అనుగుణంగా తెలంగాణ బడ్జెట్ రూపుదిద్దుకుందని ,. వ్యవసాయం,రైతులు, ప్రాజెక్టులు, అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు లక్ష్యంగా వార్షిక బడ్జెట్లో ప్రాధాన్యం, ఆర్థిక మాంద్యం ఉన్నా ప్రగతి ఆగిపోరాదన్న లక్ష్యంగా కసరత్తుచేశామని… 2020-21 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వార్షిక బ్జడెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టారు. మంత్రి హరీష్‌రావు తొలిసారిగా సభలో బ్జడెట్ ప్రంసంగాన్ని చదివి వినిపించారు. ఇక శాసనమండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బ్జడెట్‌ను ప్రవేశపెట్టారు.రూ.182,914 కోట్లతో రాష్ట్ర బ్జడెట్ స్వరూపాన్ని తెలిపారు. ఆర్థికమంత్రిగా అసెంబ్లీలో తొలిసారి హరీష్‌రావు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ … లక్షా 82 వేల 914 కోట్ల రూపాయలతో రూపొందింది. దీనిలో విద్యుత్‌శాఖకు రూ.10,416 కోట్లు కేటాయిస్తున్నట్లు హరీశ్ రావు చెప్పారు. రైతు సమన్వయ సమితి పేరు రైతుబంధు సమితిగా మారుస్తున్నట్లు ప్రకటించారు. మొదటి నుంచి రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పాటుపడుతోందని, అందులో భాగంగానే పలు ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది చెప్పారు. వీటిలో సీతారామ ప్రాజెక్ట్‌తో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, మిషన్ కాకతీయతో 15 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని తెలియజేశారు.
వాస్తవిక దృక్పథంతో బడ్జెట్
వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ ను రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. బడ్జెట్ అంటే కాగితాల ద రాసుకునే అంకెలు కాదని ఆయన స్ఫష్టం చేశారు. స్వరాష్ట్ర కలను సాకారం చేసిన ఉద్యమ నేత కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రంగా కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్ సమగ్ర దృష్టి, శ్రద్దాశక్తుల ప్రతిబింబమే ఈ బడ్జెట్ అని మంత్రి హరీష్‌రావు తెలిపారు. దేశంలో ఆర్థిక మాంద్యం కొనసాగుతున్నా తెలంగాణ ప్రజలపై ఆ ప్రభావం పడకుండా తెలంగాణ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆర్థిక మాంద్యానికి విరుగుడు కొనుగోలు శక్తిని పెంచడమే అని తెలిపిన ఆయన ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి ప్రభుత్వం దీర్ఘ ప్రణాళికలు చేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రణాళిలు సుదర్ఘీమైనవని చెప్పిన హరీశ్‌రావు వచ్చే నాలుగు సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి ప్రణాళిక రూపొందించామని తెలిపారు. తెలంగాణ వార్షిక బడ్జెట్లో రైతులకు పెద్దపీట వేశారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హ మేరకు రైతులకు ఏడాదికి ఎకరానికి రూ.10వేలు అందిస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి బ్జడెట్ ప్రసంగంలో వెల్లడించారు.
రైతుబంధు కోసం రూ.14వేల కోట్లు
రైతు బంధు కోసం ఈ బ్జడెట్లో రూ.14వేల కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. కొత్త పాసుపుస్తకాల మంజూరు వల్ల రైతు బంధు లబ్దిదారుల సంఖ్య వచ్చే ఏడాది పెరుగుతుందని.. పెరిగిన లబ్దిదారులకు అనుగుణంగా బ్జడెట్లో రూ.2వేల కోట్లు అదనపు కేటాయింపులు చేస్తున్నట్లు వెల్లడించారు. రైతు ఏ కారణంతో మృతి చెందినా పది రోజుల్లోనే ఆ కుటుంబానికి రైతుబీమా కింద రూ.5లక్షల పరిహారం అందిస్తున్నాం. రైతు బీమా కోసం రూ.1,141 కోట్లు కేటాయింపు చేశారు. రైతులకు 2014లో రూ.16,124 కోట్లు రుణమాఫీ చేశాం. ఇప్పుడు ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ రైతు రుణమాఫీ అమలుకు శ్రీకారం చుట్టామని అన్నారు. రూ.25వేల లోపు రుణాలు ఉన్న రైతులు 5,83,916 మంది. రూ.25వేల లోపు రుణాలన్నీ ఒకే విడతలో మాఫీ చేస్తాం. దీనికోసం ఈనెలలో రూ.1,198 కోట్లు విడుదల చేస్తాం. హ రుణమాఫీ మొత్తాన్ని ప్రతీరైతుకు వ్యక్తిగతంగా, చెక్కుల రూపంలో ఎమ్మెల్యేల చేతులదుగా అందిస్తామని ప్రకటించారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్‌కు రూ.1000 కోట్లు, పాడి రైతుల ప్రోత్సాహకం కోసం రూ.100 కోట్లు బ్జడెట్లో కేటాయించారు. ఆర్థిక మాంద్యం ప్రభావం ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల్లో కోత విధించలేదని, పైగా సంక్షేమ పథకాల్లో లబ్దిదారులను పెంచేందుకు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. ప్రస్తుత బడ్జెట్‌ను ప్రజలే కేంద్రంగా రూపొందించిన ప్రగతిశీల బడ్జెట్ అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సాగునీటి రంగానికి రూ.11వేల కోట్లు కేటాయించినట్లు హరీశ్ రావు వెల్లడించారు. అలాగే చిన్న నీటిపారుదల శాఖకు రూ.600కోట్లు, రైతు వేదిక నిర్మాణానికి రూ.300కోట్లు కేటాయించినట్లు ఆయన చెప్పారు.
57 ఏళ్లు నిండిన వారికి వృద్దాప్య పెన్షన్లు
అలాగే 57 ఏళ్లు నిండిన వారికి వృద్దాప్య పెన్షన్లు అందజేస్తామని హరీష్‌రావు ప్రకటించారు. వెనుకబడిన వర్గాల కోసం రూ. 4,356.82 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. రైతులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో విత్తనాల సబ్సిడీకి రూ. 142 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మొత్తం రూ.40 వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేయనున్నట్లు హరీష్‌రావు స్పష్టంచేశారు. ఈ బ్జడెట్లో విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టిందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు చెప్పారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్లో ఈ రంగానికి రూ.13వేల కోట్లపైగా నిధులు కేటాయించారు. ఇందులో భాగంగానే ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రూ.2,650 కోట్లు కేటాయిస్తున్నట్లు అసెంబ్లీలో హరీశ్ రావు ప్రకటించారు.. ఆర్థికమంత్రిగా అసెంబ్లీలో తొలిసారి హరీష్‌రావు ప్రవేశపెట్టిన ఈ బ్జడెట్ … లక్షా 82 వేల 914 కోట్ల రూపాయలతో రూపొందింది. ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా ఈ బ్జడెట్ రూపకల్పన జరిగిందన్న హరీశ్ రావు.. అలాగే పాఠశాల విద్య కోసం రూ. 10,421 కోట్లు, ఉన్నత విద్య కోసం రూ.1,723 కోట్లు ఖర్చుచేయనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా ప్రజారోగ్యానికి ఎంతో ముఖ్యమైన వైద్యరంగానికి రూ. 6,186 కోట్లు, రవాణా రంగంలోని ఆర్టీసీకి రూ.1000 కోట్లు, అన్ని రకాల పెన్షన్ల కోసం రూ.11,758 కోట్లు కేటాయింపులు చేస్తున్నట్లు హరీశ్ రావు చెప్పారు. మైనార్టీ సంక్షేమానికి రూ.1,518 కోట్లు, పారిశ్రామిక అభివృద్ధికి రూ.1,998 కోట్లు, గృహ నిర్మాణానికి రూ.11,917 కోట్లు అందించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కోసం రూ. 791 కోట్లు, ఆర్అండ్బీ కోసం రూ. 3,494 కోట్లు, పోలీస్‌శాఖకు రూ.5,852 కోట్లు నిధులు కేటాయించినట్లు ప్రకటించారు.
ఎంబీసీల సంక్షేమానికి రూ.500 కోట్లు
అదే విధంగా ఎంబీసీల సంక్షేమానికి రూ.500 కోట్లు కేటాయించామని, అన్నిరకాల పెన్షన్ల కోసం రూ.11,758 కోట్లు, మత్స్యకారుల సంక్షేమానికి రూ.1586 కోట్లు నిధులు అందించనున్నట్లు తెలిపారు. అలాగే ఆడపిల్లల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రారంభించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలక కోసం రూ. 350 కోట్లు ఖర్చుచేయనున్నట్లు ప్రకటించారు. అలాగే మూసీ రివర్ ప్రాజెక్ట్ కోసం రూ.10 వేల కోట్లు అందించనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నియోజకవర్గాల అభివృద్ధికి రూ.480 కోట్లు, మహిళలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1200 కోట్లు, పంచాయతీరాజ్ అభివృద్ధికి రూ. 23,500 కోట్లు, మున్సిపల్‌శాఖకు రూ. 14,809 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు సర్వీస్‌ను విస్తరిస్తామని అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు. రెండో దశలో రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు మెట్రో సర్వీస్‌ను విస్తరిస్తామని చెప్పారు. అదేవిధంగా బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకపూల్ వరకు మెట్రో విస్తరిస్తామన్నారు. పాతబస్తీ పరిధిలో మిగిలిన 5 కిలోటర్ల మెట్రో మార్గాన్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం రూ.20 లక్షల ఆర్థికసాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని బ్జడెట్ ప్రసంగంలో హరీశ్ రావు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ గృహావసరాల కోసం 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ రుణాలు, మైక్రో ఇరిగేషన్ కోసం సబ్సిడీ రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించారు. మార్కెట్ చైర్మన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు రూ.338 కోట్ల పారిశ్రామిక రాయితీలు అందిస్తామని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో 232 బస్తీ దవాఖానాలు
హైదరాబాద్‌లో 232 బస్తీ దవాఖానాలను ప్రారంభిస్తామని, కంటి వెలుగు తరహాలోనే త్వరలో ఈఎన్టీ వైద్య సేవలు అందిస్తామని ప్రకటించారు. ఐటీ రంగాన్ని వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోనూ విస్తరిస్తామని, అదే విధంగా టైర్-2, టైర్-3 నగరాల్లో కూడా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. రూ.20 కోట్లతో 28 చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, అటవీశాఖకు రూ.791 కోట్లు కేటాయింపు చేశామని స్పష్టంచేశారు. దేవాలయాల అభివృద్ధికి రూ.500 కోట్లు అందిస్తామని హరీష్‌రావు తెలిపారు. అలాగే రూ.600 కోట్లతో గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు. పంచాయతీల్లో పనిచేస్తున్న 36
వేలమంది పారిశుద్ధ్య కర్మచారుల వేతనాన్ని రూ.8,500కు పెంచుతామని ప్రకటించారు. దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం రూ.50 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించాం. పంటల ఉత్పత్తిలో 23.7శాతం, పాడిపశువుల రంగంలో 17.3శాతం సాధించాం.మహిళా స్వయం సహకార సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద రూ. 1,200 కోట్లు. పంచాయతీరాజ్ గ్రాణాభివృద్ధి కోసం రూ. 23,005 కోట్లు. పట్టణ మిషన్ భగీరథ పథకం కింద మిగిలిపోయిన 38 మున్సిపాలిటీలకు రూ. 800 కోట్లు. -మున్సిపల్ శాఖకు రూ. 14,809 కోట్లు.హైదరాబాద్ నగరంలో ప్రాజెక్టుల అమలు కోసం రూ. 10 వేల కోట్లు. కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇండస్టియ్రల్ ఇన్సెంటివ్స్ కోసం రూ. 1,500 కోట్లు,-పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం రూ. 1,998 కోట్లు. ఆర్టీసీకి రూ. 1000 కోట్లు, -గృహ నిర్మాణాల కోసం రూ. 11,917 కోట్లు, -పర్యావరణ, అటవీశాఖకు రూ. 791 కోట్లు, దేవాలయాల అభివృద్ధి కోసం రూ. 500 కోట్లు,-కలెక్టరేట్లు, డీపీవోలు, పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణాలను పూర్తి చేయడం కోసం రూ. 550 కోట్లు.,రోడ్లు, భవనాల శాఖకు రూ. 3,494 కోట్లు. -పోలీసు శాఖకు రూ. 5,852 కోట్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఎన్డీపీ నిధుల కోసం రూ. 480 కోట్లు. కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.