Take a fresh look at your lifestyle.

బాలికా వివాహ వయస్సు చట్టం

న్యూదిల్లీ,జనవరి3 : బాలికల వివాహ వయస్సు పెంపునకు సంబంధించిన బిల్లు సెలెక్ట్ ‌కమిటీకి వెళ్లడంతో కొంతకాలం దీనిపై ఎదురుచూడక తప్పదు. ఏడాది దాటినా దానిపై ఎలాంటి నిర్ణయం రాలేదు. మొన్నటి పార్లమెంట్‌ ‌సమావేశాల్లో కూడా దీనిపై చర్చ సాగలేదు. టీనేజ్‌ ‌పెళ్లిళ్ల వల్ల పిల్లల్లో అవగాహన లేకపోవడం, జీవితం పట్ల అవగాహన లేకపోవడంతో సంసారాలు విచ్చిన్నం అవుతున్నాయి. పటిష్టమైన చట్టం లేకపోవడంతో బాలికలు త్వరగా గర్భం దాల్చి అనారోగ్యం బారిన పడుతున్నారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుని రావాలనుకుంటున్న కొత్తచట్టంతో కొంత వరకు మహిళా సాధికారతకు తోడ్పడుతుందనటంలో సందేహం లేదు. అలాగే బాల్య వివాహాల వెనుక ఉన్న అవిద్య, పేదరికం వంటి మూల కారణాల పరిష్కారానికి సాయపడుతుంది. ఈ బిల్లు చట్ట రూపం తీసుకుంటే బాలికలకు రక్షణ రాగలదు.
అయితే బాల్య వివాహాలు చేస్తున్న వారు కూతుళ్ల వివాహం చాలా ఆలస్యం అవుతుందని తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో సవరణ చట్టం రాక ముందే వివాహం చేస్తున్న సంఘటనలు దేశ వ్యాప్తగా పెరిగాయి. అమ్మాయికి పద్దెనిమిదేళ్లు నిండటం ఆలస్యం వారంలో పెళ్లి కానిచ్చేస్తున్నారు. సంబంధం కుదిరితే చదువు మాన్పించి పెళ్లి పీటలు ఎక్కించే పరిస్థితి కనిపిస్తోంది.  ఉత్తరప్రదేశ్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌బీహార్‌ ‌రాష్టాల్ల్రో కూడా ఈ పరిస్థితి ఉంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలలోనే ఈ హడావుడి పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. అర్థికంగా బలహీన వర్గాలే కాదు ..ధనిక సంప్రదాయవాద కుటుంబాలలోనూ ఇదే పరిస్థితి. వీలైనంత త్వరగా ఆడపిల్ల పెళ్లి చేసి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. కాలేజీలో చదువుకుంటున్న అమ్మాయికి ఉన్నట్టుండి ఏకపక్షంగా పెళ్లి ఫిక్స్ ‌చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిపాదిత బిల్లు ప్రకారం 21 ఏళ్లు నిండకుండా ఆడపిల్లకు వివాహం చేయటం నేరం. కాబట్టి, సంబంధం రెడీగా ఉన్న వారు పెళ్లి చేసేస్తున్నారు. అమ్మాయి వివాహ వయస్సు ఒకేసారి మూడేళ్లు పెరగటం వారి ఆలోచనలను మార్చేసింది. ముఖ్యంగా ముస్లింలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది.
కేసీఆర్‌ ‌షాదీ ముబారక్‌ ‌పథకం పేద ముస్లిం కుటుంబాలకు ఆసరాగా నిలుస్తోంది. 2014లో టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం ద్వారా 18 ఏళ్లు నిండిన అమ్మాయి వివాహానికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందుతుంది. పేద ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఉద్దేశించిన పథకం ఇది. రెండు మూడు నెలలో వారికి లక్ష రూపాయలు అందుతుంది. ఈ క్రమంలో  పాతబస్తీలో వరుసగా వందాలాది నిఖాలు జరగనున్నాయి. ఇస్లాం ప్రకారం ఆడపిల్ల యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఎప్పుడైనా వివాహం చేసుకోవచ్చని అంటు న్నారు. ముస్లింలు మాత్రమే కాదు హిందూ కులుంబాలలో కూడా ఈ ధోరణి కనిపిస్తోంది. దీనికితోడు విపక్షాలు కూడా చట్ట సవరణను  రాజకీయ కోణంలోనే చూస్తూ విమర్శలకు దిగుతున్నారు. ఇదే సందర్భంలో ఉత్తరాది రాష్టాల్ల్రో హడావిడిగా పెళ్లిల్లు జరిగిపోతున్నాయి.  బిల్లు చట్టంగా మారితే బిడ్డ పెళ్లి ఆలస్యమవు తుందని ఆడపిల్లల తల్లిదండ్రులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇది పార్లమెంట్‌ ‌స్టాండింగ్‌ ‌కమిటీ పరిశీలనలో ఉంది. కాబట్టి కొత్త చట్టం అన్ని వర్గాలకు వర్తిస్తుంది. అయితే దీనిని త్వరగా ఆమోదిస్తే తప్ప చట్టంగా బయటకు రాదు. అప్పటి వరకు వివాహ వయస్సులో మార్పు ఉండబోదు.

Leave a Reply