- విచారణ సమయంలో కేటీఆర్ మంత్రిగా తప్పుకోవాలి : టీపీసీసీ ఉత్తమకుమార్‌రెడ్డి
- కేటీఆర్ తప్పుకోకపోతే కేసీఆర్ బర్తరఫ్ చేయాలి
- కేటీఆర్ సతీమణి శైలిమ పేరుతో భూమి ఉంది
- లీజుకు ఉంటే వివరాలు బయటపెట్టండి : రేవంత్
- లాక్ డౌన్‌లో ఎమ్మెల్యే షకీల్ ఇల్లు కడుతున్నాడు : మాజీ ఎంపీ కొండవిశ్వేశ్వర్ రెడ్డి
మంత్రి కేటీఆర్ తన శాఖలో నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేపట్టడం నైతికత కాదని ఎన్‌జిటీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కేటీఆర్ మంత్రిగా తప్పుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎంపీ రేవంత్ రెడ్డి,మాజీ ఎంపీ కొండవిశ్వేశ్వర్ రెడ్డి,మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇతర నాయకులు కలిసి మీడియా సమావేశం నిర్వహించారు..ఎంపీ రేవంత్ రెడ్డి జన్వాడ లో మంత్రి కేటీఆర్ 25 ఎకరాల్లో అక్రమంగా విలాస ఫామ్ హౌస్ కట్టుకున్నారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ని ఆశ్రయించారు. దీని పై మంత్రి కేటీఆర్ కి ఎన్జీటీ నోటీసులు జారీ చేసింది..దీని పై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. గండిపేటకు నీరు వచ్చే నాలా పూడ్చి ఫార్మ్ హౌస్ నిర్మాణం చేశారని 111 జీవో ని ఉల్లంఘన తో చెరువుల ను కాపాడాల్సిన వాళ్లే అక్రమ నిర్మాణం చేపట్టారని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ నాయకులను కొందరిని కక్షపూరితంగా బెదిరించి భూములు అమ్మేసుకునేలా చేశారని మండిపడ్డారు.111 జీవో ఎత్తివేయాలని అనుకుంటే మాకు ఇబ్బంది లేదన్నారు.
గ్రీన్ ట్రిబ్యునల్ వేసిన కమిటీలో మున్సిపల్ శాఖల అధికారులు ఉన్నారని దీంతో విచారణ సరిగా జరగదని కాబట్టి మంత్రిగా వైదొలగాలని కోరారు. కేటీఆర్ తప్పుకోకుంటే కేసీఆర్ బర్తరఫ్ చేయాలని అన్నారు.. తండ్రి కొడుకులు పారదర్శకంగా పని చేయాలని కోరారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలపై ఎందుకు టీఆరెస్ పార్టీ నాయకులు మాట్లాడటం లేదని తేలుకుట్టిన దొంగల్లాగా దాసుకున్నారని విమర్శించారు.బాల్కా సుమన్ కేటీఆర్ కి భూమి లేదన్నారు మరి కేటీఆర్ సతీమణి శైలిమ పేరుతో భూమి ఉందని దానికి సంబందించిన ఆధారాలు ఇస్తానన్నారు. అర్బన వెంచర్ పేరుతో భూమి ఉందని అర్బనా వెంచర్లో నా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్ లో కేటీఆర్ పేర్కొన్నారని గుర్తు చేశారు.లీజుకు తీసుకున్నట్టు ఎన్నికల అఫిడవిట్ లో ఎక్కడ లేదన్నారు. నిజంగా లీజు న తీసుకుంటే వివరాలు బయటపెట్టలని అన్నారు. పోలీసులు కూడా ఆ సైట్ లో కేటీఆర్ నివసిస్తున్నారని కోర్ట్ కి చెప్పిన్నట్లు తెలిపారు. కేటీఆర్ ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.